విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు | Special trains between Visakhapatnam and Secunderabad due to passengers rush | Sakshi
Sakshi News home page

విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

Published Thu, Mar 6 2014 1:04 AM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM

విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు - Sakshi

విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. రైళ్ల వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే, విశాఖ-నిజాముద్దీన్ మధ్య నడిచే స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ (12803/12804) ఈ నెల 6 నుంచి ఒక నిమిషం పాటు తాడేపల్లిగూడెం స్టేషన్‌లో ఆగుతుందని తెలిపారు.
 ఠవిశాఖ-సికింద్రాబాద్ (08503/08504) వీక్లీ స్పెషల్ ఈ నెల 31 నుంచి  జూన్ 30 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 1 నుంచి జూలై 1 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
 
 ఠవిశాఖ-సికింద్రాబాద్ (08501/08502)వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం రాత్రి  11 గంటలకు విశాఖపట్టణం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉద యం 6.30కి విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైళ్లు  దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్ స్టేషన్‌లలో ఆగుతాయి.
 
 ఠయశ్వంత్‌పూర్-జైపూర్ (906573/06574) వీక్లీ రైలు ఈ నెల 4 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం ఉదయం 10.45 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి గురువారం ఉదయం 10.35 గంటలకు జైపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 6 నుంచి జూన్ 26 వరకు ప్రతి గురువారం రాత్రి 10.05 గంటలకు జైపూర్ నుంచి బయలుదేరుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement