K. Samba Siva Rao
-
నేడు 12 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) నేడు(ఆదివారం) 12 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.45 గంటలకు వెళుతుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ పొగమంచు కారణంగా ఆలస్యంగా నడవడమే ఇందుకు కారణమని తెలిపారు. -
నేడు 9 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) బుధవారం 9 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఉదయం 6.25 గంటలకు నాంపల్లి నుంచి వెళ్లాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరుతుందన్నారు. -
ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: పొగమంచు కారణంగా హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) ఆలస్యంగా నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. మంగళవారం (23వ తేదీ) ఉదయం 6.25 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 5.30కు బయలుదేరనుంది. -
రేపు కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక ైరె లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ-సికింద్రాబాద్(07102) ఈ నెల 15న రాత్రి 10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.55కు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-కాకినాడ(07101) 16న రాత్రి 9.45కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35కు కాకినాడ చేరుతుంది. ఈ సర్వీసులకు రిజర్వేషన్ 14న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. -
విశాఖకు ప్రత్యేక రైళ్లు
సాక్షి,హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-విశాఖ (07016) ఈ నెల 10వ తేదీ రాత్రి 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-కాచిగూడ (07015) 11వ తేదీ సాయంత్రం 7.05 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. మల్కాజ్గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం,తుని,అనకాపల్లి,దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. -
అజ్మీర్ ఉర్సుకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : అజ్మీర్‌లో జరుగనున్న ఉర్సు ఉత్సవాలకు వెళ్లే ప్రయాణికుల కోసం నాంపల్లి,కాచిగూడ, ఒంగోలు, మచిలీపట్నంల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-అజ్మీర్ ఉర్సు (07125/07126) స్పెషల్ ట్రైన్ మే 2వ తేదీన రాత్రి 8.10 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరుతుంది. ఇది సికింద్రాబాద్‌కు 8.30 కు చేరుకొని 8.35 గంటలకు అక్కడ నుంచి వెళుతుంది. మే4వ తేదీ ఉదయం 10.15 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 8వ తేదీన ఉదయం 7 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 9వ తేదీ రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌కు,రాత్రి 11.45 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. - కాచిగూడ-అజ్మీర్ (07129/07130) స్పెషల్ ట్రైన్ మే 3వ తేదీ రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి 5వ తేదీ ఉదయం 4.50 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 7వ తేదీ సాయంత్రం 7.25 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 9వ తేదీ ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాష్ట్రంలోని మల్కాజిగిరి, మేడ్చెల్, కామారెడ్డి,నిజామాబాద్, బాసరలలో ఈ రైళ్లు ఆగుతాయి. - ఒంగోలు-అజ్మీర్ (07227/07228) స్పెషల్ ట్రైన్ మే 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. 12.25 గంటలకు విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది.మే 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 8వ తేదీ సాయంత్రం 7.25 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 10వ తేదీ తెల్లవారు జామున 2.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. 2.50 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 7 గంటలకు ఒంగోలు చేరుకుంటుంది. రాష్ట్రంలోని చీరాల,బాపట్ల,నిడుబ్రోలు,తెనాలి,న్యూగుంటూరు,విజయవాడ,మధిర,ఖమ్మం,మహబూబ్‌బాద్,వరంగల్, మంచిర్యాల,బెల్లంపల్లి,సిరిపూర్కాగజ్నగర్లలో ఆగుతుంది. - మచిలీపట్నం-అజ్మీర్ (07131/07132) ప్రత్యేక రైలు మే 4వ తేదీ ఉదయం 9 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది ఒంగోలు-అజ్మీర్ ట్రైన్‌కు లింక్ అవుతుంది. ఇది ఒంటిగంటకు విజయవాడ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 10వ తేదీ తెల్లవారు జామున 3.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి (అప్పటి వరకు ఇది అజ్మీర్-ఒంగోలు ట్రైన్‌కు లింక్ అయి ఉంటుంది.) ఉదయం 6 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. చిలకలపూడి,పెడన స్టేషన్లలో కూడా ఆగుతుంది. -
విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. రైళ్ల వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే, విశాఖ-నిజాముద్దీన్ మధ్య నడిచే స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ (12803/12804) ఈ నెల 6 నుంచి ఒక నిమిషం పాటు తాడేపల్లిగూడెం స్టేషన్లో ఆగుతుందని తెలిపారు. ఠవిశాఖ-సికింద్రాబాద్ (08503/08504) వీక్లీ స్పెషల్ ఈ నెల 31 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 1 నుంచి జూలై 1 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఠవిశాఖ-సికింద్రాబాద్ (08501/08502)వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్టణం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉద యం 6.30కి విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్ స్టేషన్లలో ఆగుతాయి. ఠయశ్వంత్పూర్-జైపూర్ (906573/06574) వీక్లీ రైలు ఈ నెల 4 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం ఉదయం 10.45 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి గురువారం ఉదయం 10.35 గంటలకు జైపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 6 నుంచి జూన్ 26 వరకు ప్రతి గురువారం రాత్రి 10.05 గంటలకు జైపూర్ నుంచి బయలుదేరుతుంది. -
విశాఖ, విజయవాడలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి,హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్నం, ఔరంగాబాద్-తిరుపతిల మధ్య ప్రత్యేక రై ళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాం బశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-విజయవాడ (07208) ప్రత్యేక రైలు మార్చి 7,14,21,28 తేదీలలో రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు విజయవాడ చేరుకుంటుం ది. తిరుగు ప్రయాణంలో విజయవాడ-సికింద్రాబాద్ రైలు మార్చి 6,13,20,27 తేదీలలో రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం (02728) ఏసీ సూపర్‌ఫాస్ట్ మార్చి 7,14,21,28 తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8,15,22,29 తేదీలలో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఔరంగాబాద్-తిరుపతి (07405) ప్రత్యేక రైలు మార్చి 7,14,21,28 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు మార్చి 8,15,22,29 తేదీలలో రాత్రి 9.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు బాసర,నిజామాబాద్, కామారెడ్డి,సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం,విజయవాడ,తెనాలి,చీరాల,ఒంగోలు,నెల్లూరు,గూడూరు,వెంకటగిరి,శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది నేడు కాచిగూడ-మంగళూర్ సెంట్రల్ బై వీక్లీ ప్రారంభం కాచిగూడ-మంగళూర్ సెంట్రల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17606) మంగళవారం కాచిగూడలో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ఈ రైలు ఉదయం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.20 కి మంగళూర్ చేరుకుంటుంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప,రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.