విశాఖ, విజయవాడలకు ప్రత్యేక రైళ్లు
సాక్షి,హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్నం, ఔరంగాబాద్-తిరుపతిల మధ్య ప్రత్యేక రై ళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాం బశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్-విజయవాడ (07208) ప్రత్యేక రైలు మార్చి 7,14,21,28 తేదీలలో రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు విజయవాడ చేరుకుంటుం ది. తిరుగు ప్రయాణంలో విజయవాడ-సికింద్రాబాద్ రైలు మార్చి 6,13,20,27 తేదీలలో రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం (02728) ఏసీ సూపర్‌ఫాస్ట్ మార్చి 7,14,21,28 తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8,15,22,29 తేదీలలో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఔరంగాబాద్-తిరుపతి (07405) ప్రత్యేక రైలు మార్చి 7,14,21,28 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు మార్చి 8,15,22,29 తేదీలలో రాత్రి 9.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు బాసర,నిజామాబాద్, కామారెడ్డి,సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం,విజయవాడ,తెనాలి,చీరాల,ఒంగోలు,నెల్లూరు,గూడూరు,వెంకటగిరి,శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది
నేడు కాచిగూడ-మంగళూర్ సెంట్రల్ బై వీక్లీ ప్రారంభం
కాచిగూడ-మంగళూర్ సెంట్రల్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17606) మంగళవారం కాచిగూడలో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ఈ రైలు ఉదయం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.20 కి మంగళూర్ చేరుకుంటుంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప,రాజంపేట్, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది.