
సాక్షి, నెల్లూరు(దర్గామిట్ట): లివర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి ప్రాణదానం చేయాలని ముత్తకూరు మండలం ఈపూరుకు చెందిన శ్రీదేవి కోరారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 17 నెలల కుమారుడు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడని, పది రోజుల క్రితం రక్త విరేచనాలు కావడంతో నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. పరీక్షించిన వైద్యులు చెన్నై వెళ్లాల్సిందిగా సిఫార్సు చేశారన్నారు. బాలుడికి త్వరగా ఆపరేషన్ చేయాలని చెన్నైలోని వైద్యులు తెలిపారని, దీనికి రూ.22 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. తాము నిరుపేదలమని, దాతలు సహకరించి ఆపన్నహస్తం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment