Narayana hospital
-
బాలుడికి జికా వైరస్‌పై ‘నారాయణ’ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి : దేశంలో అరుదుగా నమోదవుతున్న జికా వైరస్ లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖకు కనీస సమాచారం ఇవ్వకుండా మంత్రి నారాయణకు చెందిన నెల్లూరులోని నారాయణ ఆస్పత్రి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు గుర్తించినప్పటికీ ముంబైలోని ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలు పంపింది. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో జికా వైరస్ అని తేలింది. వాస్తవానికి.. గతనెల 30న జ్వరంతో బాధపడుతున్న బాలుడికి నారా యణ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈనెల 7న జ్వరంలో ఫిట్స్ రావడంతో తిరిగి మరో మారు తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అందిస్తున్నా ఆరోగ్య సమస్యలు తగ్గకపోవడం, డెంగీ, మలేరియా పరీక్షలు కూడా నెగిటివ్ రావడంతో జికా ఏమోనని వైద్యులు అనుమానించి ఈనెల 13న నేరుగా ముంబైకు నమూనాలు పంపారు. 16న వెలువడిన ఫలితాల్లో జికా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు తేలింది. ఇలా అరుదైన వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యశాఖలోని ఎపిడమాలజీ విభాగానికి సమాచారం ఇస్తే ప్రత్యేక బృందాలు బాలుడి నమూనాలను నేరుగా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్‌కు పంపేవారు. దీంతోపాటు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాధి వ్యాప్తి నియంత్రణకు వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, నారాయణ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పుడు ఈ వ్యవహారంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. ప్రైవేట్ ల్యాబ్ ఫలితాల ఆధారంగా జికా వైరస్ అని నిర్ధారణకు రాలేని వైద్యశాఖ.. బాలుడితో పాటు, తల్లిదండ్రులు, గ్రామంలోని మరికొందరి నమూనాలను పూణేలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు గురువారం పంపింది. గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం..డెంగీ, చికున్‌గున్యా మాదిరిగానే జికా వైరస్ పగటిపూట కుట్టే ఎడిస్ జాతి దోమ కాటు ద్వా రా వ్యాపిస్తుంది. ఇది సోకిన గర్భిణుల ద్వారా పుట్టే శిశువుల్లో మైక్రోసెఫలీ సమస్య ఎదురవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు స్ప ష్టం చేశాయి. దీంతో.. శిశువు మెదడుపై ప్రభా వం పడి నరాలు, కండరాల సమస్యలు, పక్షవాతం, బలహీనత లక్షణాలు ఎదురవుతాయి. సాధారణ వ్యక్తుల్లో సైతం కండరాలు బిగుసుకుపోవడం, దృశ్య లోపాలు, పక్షవాతం సంభవించే అవకాశం ఉంటుంది. రక్తం, వీర్యం, జననాంగ స్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతుంది. ఈ ఏడాది జూలైలో దేశంలో జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలను ఇచ్చింది. జికా వైరస్ సోకిన ప్రాంతాల్లోని గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని ఆదేశించింది. -
బిడ్డకు ప్రాణదానం చేయరూ..
సాక్షి, నెల్లూరు(దర్గామిట్ట): లివర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి ప్రాణదానం చేయాలని ముత్తకూరు మండలం ఈపూరుకు చెందిన శ్రీదేవి కోరారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 17 నెలల కుమారుడు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడని, పది రోజుల క్రితం రక్త విరేచనాలు కావడంతో నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. పరీక్షించిన వైద్యులు చెన్నై వెళ్లాల్సిందిగా సిఫార్సు చేశారన్నారు. బాలుడికి త్వరగా ఆపరేషన్ చేయాలని చెన్నైలోని వైద్యులు తెలిపారని, దీనికి రూ.22 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. తాము నిరుపేదలమని, దాతలు సహకరించి ఆపన్నహస్తం అందించాలని కోరారు. -
నారాయణా.. నీకిది తగునా..?
సాక్షి, నెల్లూరు (వీఆర్సీసెంటర్): నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ వెంకటేశ్వరపురం పునరావాసకాలనీ, వాటర్‌ట్యాంక్ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం ఐదుగురు వ్యక్తులు 8వ నంబర్ ఎన్నికల బూత్‌కు చెందిన ఓటర్ల జాబితాను తీసుకుని ఇంటింటికీ తిరిగారు. ఈ ఎన్నికల్లో నగర ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి పి.నారాయణకు ఓటు వేస్తారా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఓటు వేస్తారా అని అడుగుతూ ఓటర్ల నుంచి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. ఈ విధంగా సేకరించిన సమాచారంతో వారి వెంట తెచ్చుకున్న ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్ల ఫొటోల వద్ద టీడీపీకి మద్దతు తెలిపితే ‘టీడీపీ’ అని, వైఎస్సార్సీపీకి అనుకూలంగా చెప్పిన వారి ఫొటో వద్ద ‘వై’ అని గుర్తు పెట్టడాన్ని స్థానికులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ విధంగా వచ్చి సర్వే చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తూ సర్వే చేస్తున్న వారిని నిలదీశారు. ఓ దశలో స్థానికులు, సర్వే చేస్తున్న వారి మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఎక్కువ సేవు ఇక్కడ ఉంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి అక్కడి నుంచి జారుకునే పనిలో పడటాన్ని గుర్తించిన స్థానికులు ఇంతకీ మీరు ఎవరు పంపితే వచ్చారని గట్టిగా నిలదీయడంతో విధి లేని పరిస్థితుల్లో తమలో ఇద్దరం నారాయణ ఆస్పత్రిలో పనిచేస్తున్నామని ఒప్పుకున్నారు. తమకు తోడుగా స్థానికంగా ఉన్న మరో ముగ్గురితో సర్వే చేయాలని యాజమాన్యం ఆదేశించడంతో ఇక్కడకు వచ్చామని చెప్పడంతో మరింత కోపోద్రిక్తులైన ప్రజలు వారిని పోలీసులకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఐదుగురు సర్వే టీం సభ్యులు మెల్లగా అక్కడి నుంచి జారుకుని తిన్నగా స్థానికంగా ఉన్న టీడీపీ కార్యాలయంలో తలదాచుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నారాయణ సంస్థలో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులతో ఇలాంటి సర్వేలు చేయించడం ఏమిటని, నారాయణా ఇది నీకు తగునా అంటూ 53వ డివిజన్ ప్రజలు, ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. -
మెదడులోని 1.2 కేజీల కణిత తొలగింపు
నెల్లూరు(బారకాసు): ఓ మహిళ మెదడులో ఉన్న 1.2 కేజీల కణితను నారాయణ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. మంగళవారం చింతారెడ్డిపాళెంలోని నారాయణ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు జి.విద్యాసాగర్ వివరాలు వెల్లడించారు. కావలిలోని బీసీ కాలనీకి చెందిన 65 ఏళ్ల వెంకటసుబ్బమ్మ చాలా రోజులుగా మెదడులోని కణిత కారణంగా మూతి వంకరపోయి తరచూ ఫిట్స్ రావడంతో ఇబ్బందిపడుతుండేది. పలు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహితురాలి సూచన మేరకు ఆమె నారాయణ హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో పెద్ద కణిత ఉందని, దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని తెలిపారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. ఈ కణిత 1.2 కేజీల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాణుతులైన వైద్యులు అందుబాటులో ఉండటం వల్లనే ఈక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాంసతీష్ తెలిపారు. ఈ శస్త్రచికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఉచితంగా నిర్వహించామన్నారు. సమావేశంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, ఏజీఎం భాస్కర్‌రెడ్డి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
-
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
నెల్లూరు: విడవలూరుకు చెందిన దినేష్‌రెడ్డి అనే యవకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో యవకుడు దినేష్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ నెల 13న దినేష్‌రెడ్డికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. అయితే దినేష్‌రెడ్డి బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో అతడి తల్లిదండ్రుల అంగీకారం మేరకు నెల్లూరు జిల్లాలోని నారాయణ ఆస్పత్రిలో విజయవంతంగా అవయవదానం ఆపరేషన్ చేశారు. దినేష్ రెడ్డి కిడ్నీని నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి.. మరొక కిడ్నీని నారాయణ ఆస్పత్రిలో ఉంచారు. గుండె, కాలేయాన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్‌కు అధికారులు తరలించినట్టు సమాచారం.