
బాబు, అచ్చెన్నలకు ధర్మాన సవాల్
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు బహిరంగ సవాల్ విసిరారు. శ్రీకాకుళం మున్సిపాలిటీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ధర్మాన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి... ఉప ఎన్నికల్లో గెలవాలని ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే... సైకిల్ పార్టీ ఓటమి తప్పదన్నారు.
గురువారం శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రెడ్డి శాంతితోపాటు పలువురు జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.