లడ్డూని కవర్లలో వేసి ఇస్తున్న సిబ్బంది
సాక్షి, అనంతపురం: రెండు నెలలుగా తిరుమలేశుని దర్శనం లేకపోవడం, పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడం అందరికీ తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూలను జిల్లా కేంద్రానికే తీసుకొచ్చి పంపిణీ చేపట్టడంతో లడ్డూల కోసం భక్తులు బారులు తీరారు. సోమవారం స్థానిక రామచంద్రానగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం నుండి శ్రీవారి లడ్డూల విక్రయం జరిగింది.
లడ్డూని పంపిణీ చేస్తున్న దృశ్యం
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జిల్లా కేంద్రానికి 20 వేల లడ్డూలు వచ్చినా మధ్యాహ్నం లోపు అయిపోవడంతో చాలా మంది భక్తులు నిరాశ చెందారు. తిరుమల నుండి ప్రత్యేక అధికారిగా వచ్చిన ఏఈఓ రాజేంద్రకుమార్, జిల్లా ధర్మప్రచార మండలి అధ్యక్షులు శ్రీపాద వేణు, కార్యదర్శి నాగేశ్వరి, టీటీడీ మేనేజర్ రామమోహనరెడ్డి తదితరులు మాట్లాడుతూ స్వామి వారి దర్శనం లేక ఇబ్బంది పడుతున్న భక్తులకు శ్రీవారి లడ్డూలనైనా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. మంగళవారం మరో పది వేల లడ్డూలను తెప్పిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment