చెరిగిన బార్ కోడింగ్‌తో తిప్పలు
తక్కువ సంఖ్యలో లడ్డూలిస్తున్న సిబ్బంది
పట్టించుకోని ఆలయ అధికారులు
టీటీడీ ప్రవేశ పెట్టే కొత్త సాంకేతిక పద్ధుతులతో భక్తులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ముద్రించిన లడ్డూ టోకెన్లకు బదులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అప్పటికప్పుడే ఇచ్చే కంప్యూటర్ బార్‌కోడింగ్ టోకెన్లు లడ్డూ కౌంటర్‌కు చేరే సరికి అక్షరాలు చెదిరిపోతున్నాయి. ఫలితంగా భ క్తులకు అందాల్సిన లడ్డూల కంటే తక్కువ సంఖ్యలో అందుతుండటంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు.
చెరిగిపోతున్న కంప్యూటర్ లడ్డూ టికెట్లు
సామాన్య భక్తులు వెళ్లే సర్వ దర్శన క్యూలైన్లలో సబ్సిడీ ధరతో కేవలం రూ. 20కి టీటీడీ రెండు లడ్డూలు ఇచ్చేది. ఆల యం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ లో రూ.25 చొప్పున లడ్డూలు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఈవో సర్వదర్శన క్యూలైన్లలోనూ సబ్సిడీ లడ్డూల తోపాటు రూ.25 లడ్డూలు రూ.50కి రెం డు లడ్డూలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు టీటీడీ ఐటీ విభాగం కంప్యూటర్ బార్‌కోడింగ్‌తో టికెట్లు సిద్ధం చేసింది. ఈనెల రెండో తేది నుంచి భక్తులకు టికె ట్లు ఇవ్వటాన్ని ప్రారంభించారు. లడ్డూ టికెట్లపై బార్ కోడ్, మంజూరు చేసిన తేది, సమయం, లడ్డూల సంఖ్య, ధర వంటి వివరాలున్నాయి. టీటీడీ నిబంధనల ప్రకారం భక్తులకు సబ్సిడీ లడ్డూలు మాత్రమే కావాలంటే రూ.20కి రెండూ లడ్డూలతో కూడిన ఒక టోకెన్ ఇస్తారు. రూ.20కి రెండు సబ్సిడీతోపాటు రూ.50 కి మరో రెండు అదనపు లడ్డూలు కూడా కావాలంటే రూ.70 ధరతో ముద్రించి నాలుగు లడ్డూలతో కూడి ఒక టోకెన్ ఇస్తారు. చాలా పలుచగ , మెత్తగా ఉండే టోకెన్లు లడ్డూ కౌంటర్‌కు చేరే సరికి అందులోని అక్షరాలు చెరిగి పోతున్నా యి. లడ్డూల సంఖ్య, ధర లేకపోవడం తో కౌంటర్ సిబ్బంది కూడా ఏ టోకెన్‌కు ఎన్ని లడ్డూలు ఇవ్వాలి? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
లడ్డూల్లో కోత .. సిబ్బందికి మేత
కొత్త లడ్డూ టికెట్ల విధానం కౌంటర్ సిబ్బంది కాసుల వర్షం కురిపిస్తోంది. సామాన్య భక్తుల చేతిలో నలిగి అక్షరాలు లేకుండా వచ్చే టికెట్లపై నిర్ణయించిన లడ్డూలు ఇచ్చే విషయంలో సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించడం లేదు. అక్షరాలు కనిపించటం లేదనే కుంటిసాకుతో నాలుగు లడ్డూలకు బదులు రెండే లడ్డూలు అందజేస్తున్నారు. దీనిపై భక్తు లు ఆవేదన చెందుతున్నారు. కొందరు సిబ్బంది ఏకంగా భక్తుల నుంచి ప్రమాణపత్రం తరహాలో ‘నేను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రూ.70 ఇచ్చి నాలుగు ల డ్డూల టోకెన్ పొందాను. నా తప్పిదం వ ల్లే టోకెన్‌పై అక్షరాలు చెదిరిపోయాయి. దయచేసి లడ్డూలు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను’ అంటూ తెల్లకాగితంపై స్వీక రించాకే లడ్డూలు ఇవ్వటం గమనార్హం.
శ్రీవారి భక్తులకు టోకెన్ కష్టాలు
Published Tue, Feb 24 2015 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement