token
-
టోకెన్లతోనే సరి
సాక్షి, హైదరాబాద్: టోకెన్లు ఇచ్చి ఏడాది అవుతున్నా..పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు మాత్రం విడుదల కాలేదు. గతే డాది అక్టోబర్‌లో ఆయా బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ పోర్టల్‌లో జనరేట్ అయ్యి టోకెన్ నంబర్లు కూడా జారీ అయ్యాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఇటు విద్యార్థులు..అటు ప్రైవేట్ కాలేజీ యాజమన్యాలు లబోదిబోమంటున్నాయి. దరఖాస్తు నుంచి ట్రెజరీ వరకు ఇలా... పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన, కోర్సు కొనసాగిస్తున్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయడం..వాటిని కాలేజీస్థాయిలో యాజమాన్యాలు పరిశీలించి సంక్షేమశాఖలకు సమర్పించడం... సంక్షేమశాఖల అధికా రులు ఆయా దరఖాస్తులను మరోమారు పరిశీలించి ఆమోదం తెలపడం.. ఆ తర్వాత అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు ఖజానా శాఖకు సిఫార్సు చేయడం అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాలేజీ యాజమాన్యాలు ఒక్కో విద్యార్థికి సంబంధించిన ఫైలు కాకుండా ఒక కోర్సు చదువుతున్న విద్యార్థులందరి ఫైళ్లు కలిపి ఒక బిల్లుగా తయారు చేసి ఖజానాశాఖకు సమర్పిస్తాయి. అవన్నీ రెండేళ్ల కిందటివే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్నాయి. 2019–20, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి పలు బిల్లులు గతేడాది అక్టోబర్ నాటికి ఖజానా శాఖకు సమర్పించాయి. నాలుగు సంక్షేమ శాఖలకు సంబంధించి రూ.1115 కోట్లు వరకు బిల్లులున్నాయి. ఇందులో సాగానికిపైగా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినవే. సంక్షేమ శాఖలు సమర్పించిన బిల్లులను ఖజానా అధికారులు పరిశీలించి టోకెన్లు జనరేట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఆర్థిఖశాఖ పోర్టల్‌లో ఆ బిల్లులకు ఆమోదం దక్కలేదు. ఏడాది కాలంగా ఇవన్నీ పెండింగ్‌లో ఉండడంతో ఒకవైపు విద్యార్థులు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపకారవేతన నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాలో, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక జాప్యం జరుగుతుండడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు రాష్ట్ర సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులను ప్రత్యేకంగా కలిసి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా, నిధుల విడుదలపై ప్రభుత్వం స్పందించలేదు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో కాలేజీల నిర్వహణపై చేతులెత్తేయాల్సి వస్తోందంటూ తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ ‘సాక్షి’తో అన్నారు. -
ఫేస్ రికగ్నిషన్‌తో అక్రమాలకు అడ్డుకట్ట
తిరుమల: భక్తులకు మెరుగైన సేవలందించేందుకు టీటీడీ ఫేస్ రికగ్నిషన్ అనే నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులకు సులభతరంగా సేవలందించడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చింది. సర్వదర్శనం భక్తులకు, లడ్డూ కౌంటర్లు, గదులు కేటాయింపు, నగదు రీఫండ్ కౌంటర్ల వద్ద బుధవారం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. పనితీరు ఇలా.. ఇప్పటివరకు సర్వ దర్శనం భక్తులకు టోకెన్ జారీ చేసే సమయంలో వారి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి, వారి ఫొటో తీసుకుని టోకెన్ జారీ చేస్తున్నారు. వారు దర్శనానికి వెళ్లే సమయంలో ఆధార్ కార్డును పరిశీలించి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇకపై ఫేస్ రికగ్నిషన్ విధానంతో వారికి టోకెన్ జారీ చేసే సమయంలోనే ఫొటో తీసుకుంటారు. వారు దర్శనానికి వెళ్ళే సమయంలో ఫేస్ రికగ్నిషన్ అయిన వెంటనే దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఒకరి టోకెన్‌పై మరొకరు దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే..ఫేస్ రికగ్నేషన్లో వారి ఫొటో మ్యాచ్ కాదు. దీంతో అక్రమాలకు చెక్ పెట్టవచ్చని టీటీడీ భావిస్తోంది. లడ్డూ టోకెన్లకు సంబంధించి కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ప్రవేశించే సమయంలో ఫేస్ రికగ్నిషన్ విధానంలో టోకెన్ జారీ చేస్తారు. అదే పద్ధతిలో దర్శనానంతరం లడ్డూ కౌంటర్ వద్ద కూడా ఫేస్ రికగ్నిషన్ అయిన తర్వాతనే లడ్డూలను అందజేస్తారు. దీంతో అక్రమ పద్ధతిలో లడ్డూలు పొందే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టవచ్చునని టీటీడీ భావిస్తోంది. ఇదే విధానాన్ని గదుల కేటాయింపు, వాటిని ఖాళీ చేసిన సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లింపునకు వినియోగించనున్నారు. సేవలు సులభతరం ఈ విధానం అమలైతే గదులను దళారులు రొటేషన్ చేసే పద్ధతికి అడ్డుకట్ట వేయవచ్చునని చెబుతున్నారు. గదులు ఖాళీ చేసిన 48 గంటల్లోనే భక్తుల డిపాజిట్లు వారి ఖాతాలో జమవుతుందని అంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని విజిలెన్స్ విభాగానికి అనుసంధానం చేస్తే నేర చరిత్ర కలిగిన వారిని సులభతరంగా గుర్తించవచ్చునని, దీంతో నేరాలు జరగకుండా నిరోధించే అవకాశముంది. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు టోకరా ఇచ్చిన స్కిడ్ టోకెన్ డెవలపర్లు
-
సర్వదర్శన టోకెన్లను జారీ చేసిన టీటీడీ
సాక్షి, తిరుపతి : ఉచిత సర్వదర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రారంభించింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచే టీటీడీ టోకెన్లను జారీ మొదలుపెట్టింది. రోజుకు 3వేల చొప్పున ఉచిత టోకెన్లను ఇస్తుండటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కౌంటర్ల దగ్గర బారులు తీరారు. ప్రారంభించిన రెండు గంటల వ్యవధిలోనే టోకెన్లు అయిపోయాయి. కరోనా నేపథ్యంలో నిషేధం విధించిన సర్వదర్శనం ఏడు నెలల తర్వాత లభిస్తుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి నవంబరు కోటా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అదనంగా 3 వేలు ప్రత్యేక ప్రవేశ దర్శనం, 3 వేల సర్వ దర్శన టికెట్లు కేటాయించింది. పెరిగిన దర్శన టికెట్లుతో రోజుకి 23 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం భాగ్యం కలుగుతుంది. తిరుమల సమాచారం.. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 16,043 స్వామివారి తీలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య: 5,405 స్వామివారి హుండి ఆదాయం: 1.24లక్షలు -
మెట్రో : టోకెన్ పోతే వడ్డింపే
మెట్రో రైల్ ప్రయాణిలకు ముఖ్య గమనిక. స్టేషన్లలో ఇచ్చే టోకెన్లను ఇకనుంచి జాగ్రత్తగా ఉంచుకోండి. దానిని పోగొట్టుకుంటే భారీగా జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కొందరు చేసే పోకిరి పనుల వల్ల అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. సాక్షి, బెంగళూరు: కొంతకాలంగా మెట్రోరైల్వే స్టేషన్లలో టికెట్ల సందర్భంగా ఇచ్చే టోకెన్లను తస్కరిస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో దీనిని అరికట్టడానికి మెట్రో సంస్థ (బీఎంఆర్సీఎల్).. టోకెన్లను పోగొట్టుకున్న వారికి జరిమానాను పెంచింది. చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో కొందరు తుంటరిలు మెట్రో టోకెన్లను కొనుగోలు చేసి, అసలు ప్రయాణమే చేయకుండా వాటిని జేబులో వేసుకుని వెళ్తుంటారు. మైక్రోచిప్ కలిగిన ఈ టోకెన్లను తయారు చేయడానికి ఒక్కొక్క టోకెన్‌కు రూ.35 ఖర్చవుతుండగా, పొరపాటున టోకెన్‌ను పోగొట్టుకుంటే రూ.50 జరిమానా విధించేవారు. దీంతో టోకెన్ల తమవద్ద ఉన్నా కూడా కొంతమంది పోగొట్టుకున్నామంటూ రూ.50 జరిమానా చెల్లించి వాటిని తీసుకెళ్లేవారు. దీంతో ఇప్పటి వరకు 1,500 టోకెన్లు తస్కరణకు గురికావడంతో ఆ విషయాన్ని గుర్తించిన బీఎంఆర్సీఎల్ అధికారులు జరిమానాను రూ.50 నుంచి రూ.500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దొడ్డిదారిలో వెళ్తూ తస్కరణ మెట్రో స్టేషన్లోకి ప్రవేశించగానే మార్గాన్ని బట్టి ప్రయాణికులకు సిబ్బంది టోకెన్లను ఇస్తారు. తమ స్టేషన్ రాగానే బయటకు వెళ్లే ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఆ టోకెన్‌ను వేస్తే ద్వారం తెరచుకుని బయటకు వెళ్లగలరు. కొంతమంది టోకెన్లను కొట్టేయడానికి సాధారణ ద్వారం నుంచి కాకుండా మరో మార్గం ద్వారా బయటకు వెళ్లడం తెలుసుకున్నారు. ఒకవేళ తనిఖీల్లో దొరికితే రూ.200 వరకు జరిమానా తప్పదు. అయినప్పటికీ మెట్రో టోకెన్ల మిస్సింగ్ ఘటనలు ఆగకపోవడంతో మెట్రో టోకెన్లు పోతే విధించే జరిమానాను భారీగా పెంచడం విశేషం. దీంతో పాటు టోకెన్లు పోగొట్టుకున్న వ్యక్తులు మెట్రోలో గరిష్ట టికెట్ ధర రూ.60 చెల్లించి మరో టోకెన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. పెంపు అందుకే ‘టోకన్లు తీసుకొని ప్రయాణించిన అనంతరం తాము దిగాల్సిన స్టేషన్ రాగానే టోకన్లు తిరిగి అప్పగించకుండా తమతోపాటే తీసుకెళుతున్న ఘటనలో అనేకం జరిగినట్లు మా దృష్టికి వచ్చింది.వీటిని నివారించడానికే జరిమానాను భారీగా పెంచడానికి నిర్ణయించుకున్నాం. దీంతోపాటు బయటకు వెళ్లే ద్వారాల వద్ద డిటెక్టర్లను ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం’. –ప్రదీప్‌సింగ్ ఖరోలా, బీఎంఆర్సీఎల్ ఎండీ. -
టోకెన్లు ఇచ్చి భోజనం లేదన్నారు
* మార్కెట్ యార్డులో మూణ్నాళ్ల ముచ్చటైన ఉచిత భోజన పథకం * రహదారిపై బైఠాయించి రైతుల ఆందోళన కొరిటెపాడు (గుంటూరు): మార్కెట్ యార్డులో రైతులకు ఉచిత భోజన పథకం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, మార్కెటింగ్ అధికారులు ఈనెల 20వ తేదీన అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించారు. అయితే అన్నదాతలకు టోకెన్లు ఇచ్చి, భోజనం పెట్టకపోవడంతో మంగళవారం యార్డులో గందరగోళం నెలకొంది. టోకెన్లు తీసుకొన్న రైతులు భోజనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి మిర్చి రైతులు భారీ స్థాయిలో గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం మిర్చి బస్తాలను తీసుకు వచ్చారు. అమానత్ పట్టీల ఆధారంగా యార్డు సిబ్బంది వారందరికీ ఉచిత భోజనం టోకెన్లు పంపిణీ చేశారు. మిర్చి బస్తాలను విక్రయించి భోజన హాలు దగ్గరకు వెళ్ళే సరికి భోజనం అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహించి యార్డు బయటకు వచ్చి నరసరావుపేట రోడ్డులో బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో, ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పలువురు మిర్చి రైతులు మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి క్యూలో నిలబడితే భోజనం అయిపోయిందని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, పాలకవర్గం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. భోజనం పెట్టకపోగా రైతుల పట్ల యార్డు సిబ్బంది హేళనగా మాట్లాడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, కార్యదర్శి ఎం.దివాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇక మీదట యార్డులో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని, రైతులందరికీ భోజనం అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
డబ్బుల్లేకున్నా.. టోకెన్ ఉంటే చాలు..
హైదరాబాద్: కాయగూరలు కొనాలా? చిల్లర ఉండాలి.. చేతిలో నగదు ఉండాలి అని ఇక చూసుకోవాల్సిన పనిలేదు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడరాదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. రైతు బజార్లలో ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో కలసి సంయుక్తంగా ‘టీ-సేవ’కు శ్రీకారం చుట్టింది. ఫలక్‌నుమా రైతుబజార్లో ఈ నెల 5న దీన్ని ప్రారంభించారు. అంతా టోకెన్ల సిస్టమ్.. మొదటగా రైతుబజార్‌కు వచ్చే వినియోగదారులు టీ-సేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలపాలి. ఆ తర్వాత టీ-సేవ ప్రతినిధి వెంటనే సదరు వినియోగదారుని అకౌంట్లో నగదు మొత్తాన్ని పరిశీలిస్తారు. అనంతరం కూరగాయలు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు కావాలో అడుగుతాడు. వినియోగదారుడు తెలిపిన నగదుకు అనుగుణంగా రూ.5, 10, 20లకు సంబంధించిన టోకెన్లను అందిస్తారు. ఉదాహరణకు రూ.200ల కూరగాయలు కావాలని కోరిన వినియోగదారుడికి రూ.20లు విలువజేసే 10 టోకెన్లను అందజేస్తారు. ఒకవేళ రూ. 200కు కంటే అనగా రూ.20-30 తక్కువగా కూరగాయలు తీసుకుంటే మిగిలిన డబ్బులను ఖాతాలోకి వెనక్కి పంపడమో లేదా నగదు రూపంలో చిల్లర ఇవ్వడమో చేస్తారు. కాగా ఈ టోకెన్లను స్వీకరించిన రైతులకు సంబంధిత నగదును అకౌంట్లకు బదిలీ చేస్తారు. లేదా నగదు అందజేస్తారు. డెబిట్ కార్డు ఉన్న వారికి నేరుగా టోకెన్లను ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తారు. -
టోకెన్ లేకపోతే ఆటో బయటకు వెళ్లదు
బస్‌స్టాండ్ ఆటోలకు రికార్డులన్నీ ఉండాలి ఈ విధానానికి ప్రజలూ సహకరించాలి ఏసీపీ చిదానందరెడ్డి బస్‌స్టేషన్ : పోలీస్ ఇచ్చే టోకెన్ లేకపోతే ప్రయాణికులతో ఉండే ఆటో బయటకు వెళ్లే పరిస్థితి లేదని ఏసీపీ(ట్రాఫిక్) చిదానందరెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నగరం రాజధాని అయిన నేపథ్యంలో పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్‌లో ఆటో ప్రీపెయిడ్ కంప్యూటరీకరణ చేయనున్న విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం ఆటో కార్మికులు, ఆటోస్టాండ్ తీరును ఏసీపీ స్వయంగా పరిశీలించారు. పలు ఆటోల రికార్డులను తనిఖీ చేశారు. కంప్యూటరీకరణ విధానాన్ని కృష్ణా సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించడంతో వారు కంప్యూటర్‌కు కెమెరాను అనుసంధానం చేసే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఆటో కార్మికునికి వాహనం రిజస్ట్రేషన్ చేసి ఉండటమే కాకుండా డ్రైవింగ్ లెసైన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అన్ని రికార్డులు ఉన్న ఆటోలను కంప్యూటరీకరణ విధానంలో ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు. కంప్యూటర్లో డ్రైవర్ ఫొటో, వాహనం వివరాలు పొందుపరచడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ విధానంలో ఉన్న ఆటోలకు టోకెన్ ఇవ్వడం జరుగుతుందని, ఆ టోకెన్‌ను బయటకు వెళ్లే మార్గం దగ్గర ఉన్న విధులు నిర్వహిస్తున్న పోలీసుకు చూపితేనే ఆటో బయటకు వెళుతుందని తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. పోలీసుల విధివిధానాలకు అనుగుణంగా నడుచుకుంటేనే భద్రతమైన ప్రయాణంతోపాటు పూర్తిగా క్రైం రేటు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీవారి భక్తులకు టోకెన్ కష్టాలు
చెరిగిన బార్ కోడింగ్‌తో తిప్పలు తక్కువ సంఖ్యలో లడ్డూలిస్తున్న సిబ్బంది పట్టించుకోని ఆలయ అధికారులు టీటీడీ ప్రవేశ పెట్టే కొత్త సాంకేతిక పద్ధుతులతో భక్తులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ముద్రించిన లడ్డూ టోకెన్లకు బదులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అప్పటికప్పుడే ఇచ్చే కంప్యూటర్ బార్‌కోడింగ్ టోకెన్లు లడ్డూ కౌంటర్‌కు చేరే సరికి అక్షరాలు చెదిరిపోతున్నాయి. ఫలితంగా భ క్తులకు అందాల్సిన లడ్డూల కంటే తక్కువ సంఖ్యలో అందుతుండటంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. చెరిగిపోతున్న కంప్యూటర్ లడ్డూ టికెట్లు సామాన్య భక్తులు వెళ్లే సర్వ దర్శన క్యూలైన్లలో సబ్సిడీ ధరతో కేవలం రూ. 20కి టీటీడీ రెండు లడ్డూలు ఇచ్చేది. ఆల యం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ లో రూ.25 చొప్పున లడ్డూలు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఈవో సర్వదర్శన క్యూలైన్లలోనూ సబ్సిడీ లడ్డూల తోపాటు రూ.25 లడ్డూలు రూ.50కి రెం డు లడ్డూలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు టీటీడీ ఐటీ విభాగం కంప్యూటర్ బార్‌కోడింగ్‌తో టికెట్లు సిద్ధం చేసింది. ఈనెల రెండో తేది నుంచి భక్తులకు టికె ట్లు ఇవ్వటాన్ని ప్రారంభించారు. లడ్డూ టికెట్లపై బార్ కోడ్, మంజూరు చేసిన తేది, సమయం, లడ్డూల సంఖ్య, ధర వంటి వివరాలున్నాయి. టీటీడీ నిబంధనల ప్రకారం భక్తులకు సబ్సిడీ లడ్డూలు మాత్రమే కావాలంటే రూ.20కి రెండూ లడ్డూలతో కూడిన ఒక టోకెన్ ఇస్తారు. రూ.20కి రెండు సబ్సిడీతోపాటు రూ.50 కి మరో రెండు అదనపు లడ్డూలు కూడా కావాలంటే రూ.70 ధరతో ముద్రించి నాలుగు లడ్డూలతో కూడి ఒక టోకెన్ ఇస్తారు. చాలా పలుచగ , మెత్తగా ఉండే టోకెన్లు లడ్డూ కౌంటర్‌కు చేరే సరికి అందులోని అక్షరాలు చెరిగి పోతున్నా యి. లడ్డూల సంఖ్య, ధర లేకపోవడం తో కౌంటర్ సిబ్బంది కూడా ఏ టోకెన్‌కు ఎన్ని లడ్డూలు ఇవ్వాలి? అన్న సందేహం వ్యక్తమవుతోంది. లడ్డూల్లో కోత .. సిబ్బందికి మేత కొత్త లడ్డూ టికెట్ల విధానం కౌంటర్ సిబ్బంది కాసుల వర్షం కురిపిస్తోంది. సామాన్య భక్తుల చేతిలో నలిగి అక్షరాలు లేకుండా వచ్చే టికెట్లపై నిర్ణయించిన లడ్డూలు ఇచ్చే విషయంలో సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించడం లేదు. అక్షరాలు కనిపించటం లేదనే కుంటిసాకుతో నాలుగు లడ్డూలకు బదులు రెండే లడ్డూలు అందజేస్తున్నారు. దీనిపై భక్తు లు ఆవేదన చెందుతున్నారు. కొందరు సిబ్బంది ఏకంగా భక్తుల నుంచి ప్రమాణపత్రం తరహాలో ‘నేను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రూ.70 ఇచ్చి నాలుగు ల డ్డూల టోకెన్ పొందాను. నా తప్పిదం వ ల్లే టోకెన్‌పై అక్షరాలు చెదిరిపోయాయి. దయచేసి లడ్డూలు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను’ అంటూ తెల్లకాగితంపై స్వీక రించాకే లడ్డూలు ఇవ్వటం గమనార్హం.