ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్:
స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సర్దార్‌పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్-17 రాష్ట్రస్థాయి బాలబాలికల వాలీబాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలుర విభాగంలో విజేతగా ఖమ్మం జిల్లా జట్టు నిలిచింది. బాలికల విభాగంలో కృష్ణ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ మొదలు, సెమీస్, ఫైనల్స్ ఇలా మొత్తం 26 మ్యాచ్‌లను ఒకేరోజు నిర్వహించారు. క్రీడాకారులు తీవ్ర అలసటకు లోనయ్యారని ఆయా టీమ్‌ల యాజమాన్యాలు వాపోయాయి. బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో వరంగల్, తృతీయస్థానాన్ని విజయనగరం దక్కించుకున్నాయి.
బాలికల విభాగంలో వరంగల్, నిజామాబాద్ ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. విజేతలకు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓ బాలరాజు, డీఎస్డీవో కబీర్‌దాస్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ జి.శ్యాంప్రసాద్, కె.క్రిష్టపర్‌బాబు, షఫీ, క్రీడల పరిశీలకులు బాలరాజు, ఖమ్మం టూటౌన్ సీఐ సారంగపాణి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఈటీలు డీఈఓను సన్మానించారు. పీఈటీలు, క్రీడాకారులు సమన్వయంతో వ్యవహరించినప్పుడే విజయాలు సాధ్యమని డీఈఓ అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనన్నారు. జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. జాతీయ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి.శ్యాంబాబు తెలిపారు.
జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులు
కె. రాందాస్ (నల్లగొండ), ఎమ్. సృజన్ (వరంగల్), కె.నరేష్ (ఖమ్మం), రాజు (ఖమ్మం), ఎస్.జగపతిబాబు (వరంగల్), ఎన్.రామకృష్ణ (గుంటూరు), కె.పాల్‌రాజు (శ్రీకాకుళం), నరేష్ (రంగారెడ్డి), ఎమ్.రామారావు (విజయనగరం), కె.పాల్‌రాజ్ (ప్రకాశం), మణికుమార్ (ఖమ్మం), బాషామియా (కర్నూల్), స్టాండ్‌బై గా ఎమ్.తిరుపతి (కరీంనగర్), మణికంఠ (తూర్పుగోదావరి), సాకిబ్ బాషా (చిత్తూర్) ఎంపికయ్యారు.
జాతీయ జట్టుకు ఎంపికైన బాలికలు:
యు. హంస (నిజామాబాద్), ఎమ్. శ్రీప్రియ (క్రిష్ణా), ఎస్‌కె. ఈస్తర్‌రాణి (క్రిష్ణా), ఎమ్.అఖిల (నిజామాబాద్), ఎ.జ్యోతి (వరంగల్), ఇ. నిర్మలాదేవి (వరంగల్), డి.నిరూషా (వరంగల్), ఎ.సాహితీరెడ్డి (రంగారెడ్డి), ఎస్. ఐశ్వర్య (తూర్పుగోదావరి), ఎస్.లావణ్య (నల్లగొండ), కె.లక్ష్మీశిరీష (కడప), బి.శ్రావణి (ఖమ్మం), స్టాండ్ బైగా షర్మిల (ప్రకాశం), ఆర్.వరలక్ష్మి (మెదక్), ఎమ్.భవాని (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు.
వాలీబాల్ విజేత ఖమ్మం
Published Mon, Dec 16 2013 2:13 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM
Advertisement
Advertisement