పాణ్యం(కర్నూలు): డిపాజిట్లు తిరిగివ్వాలని కోరుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు కేశవరెడ్డి విద్యాసంస్థల ముందు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. తమ విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునే సమయంలో తీసుకున్న డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూవిద్యార్థుల తల్లిదండ్రులు గత కొద్ది కాలంగా ఆందోళనలు చేపడుతుండగా.. సోమవారం మండల పరిధిలోని బాధితులంతా కలిసి నెరవాడలోని కేశవరెడ్డి విద్యాసంస్థల ముందు ధర్నా నిర్వహించారు. యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరించారు.