సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు సోమవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పట్టణంలోని సిల్వర్‌జూబ్లీ కళాశాలకు చెందిన హరికృష్ణ అనే విద్యార్థి ఆదివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
లెక్చరర్ల వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు... సూసైడ్ నోట్ రాశాడు. దీంతో హరికృష్ణ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిల్వర్‌జూబ్లీ కళాశాల విద్యార్థులు పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు.