హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణ(పీఆర్సీ)పై ఈనెల 9వ తేదీన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. దీంతో మరో మూడు రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘంతో ప్రభుత్వ ఉద్యోగులు భేటీ కానున్నారు. దీనిలో భాగంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడ్ని ఏపీ ఉద్యోగ జేఏసీ కలిసింది.
పీఆర్సీ అమలుపై తొమ్మిదో తేదీన ఉద్యోగ సంఘాలతో సమావేశం అయిన అనంతరం అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక అందజేస్తామని యనమల తెలిపారు. ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ ఉద్యోగల రెగ్యులైరేజషన్ పై పదో తేదీన సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు.