= 73వ రోజుకు ఉద్యమం
= జిల్లాలో రూ.25 కోట్ల ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం
మదనపల్లె, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మూతపడడంతో ప్రభుత్వాదాయానికి భారీ ఎత్తున గండిపడింది. జిల్లాలో 26 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. చిత్తూ రు డివిజన్‌లో 14, తిరుపతి డివిజన్‌లో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఉద్యోగుల స మ్మె 73వ రోజుకు చేరుకుంది. జిల్లాలో దా దాపు రూ.25 కోట్లకుపైగా ప్రభుత్వాదాయా నికి గండిపడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం టార్గెట్‌ను నిర్ణయిస్తుంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూ క్రయ, విక్రయాలు, దాన విక్రయాలు, దస్తావేజులు, స్టాం పుల విక్రయాలు, వివాహాలు, సో సైటీ రిజిస్ట్రేషన్లు, ఈసీ నకళ్లు, ఆయుకాల రిజి స్ట్రేషన్లు, పలు ఇతర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఏటా దాదాపు రూ.12 కోట్లుకుపైగా ఆదాయం వస్తోంది. సమ్మె నేపథ్యంలో ఇక్కడ దాదాపు రూ.1.20 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయింది.
గతంలో ఎన్న డూ లేని విధంగా సమైక్య పోరు జరుగుతుం డడంతో ఇటు ప్రభుత్వంతో పాటు అటు స్టాం ప్ వెండర్లు భారీగా నష్టపోతున్నారు. స్టాంప్ వెండర్లు స్టాంపులు అమ్మకాలతో జీవనం సాగి స్తున్నారు. అలాంటిది దాదాపు రెండు నెలలకు పైగా సమ్మె కొనసాగుతుండంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమ్మెపోటు
Published Sat, Oct 12 2013 4:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement