samikhyandhra
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమ్మెపోటు
= 73వ రోజుకు ఉద్యమం = జిల్లాలో రూ.25 కోట్ల ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం మదనపల్లె, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మూతపడడంతో ప్రభుత్వాదాయానికి భారీ ఎత్తున గండిపడింది. జిల్లాలో 26 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. చిత్తూ రు డివిజన్లో 14, తిరుపతి డివిజన్లో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఉద్యోగుల స మ్మె 73వ రోజుకు చేరుకుంది. జిల్లాలో దా దాపు రూ.25 కోట్లకుపైగా ప్రభుత్వాదాయా నికి గండిపడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం టార్గెట్‌ను నిర్ణయిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూ క్రయ, విక్రయాలు, దాన విక్రయాలు, దస్తావేజులు, స్టాం పుల విక్రయాలు, వివాహాలు, సో సైటీ రిజిస్ట్రేషన్లు, ఈసీ నకళ్లు, ఆయుకాల రిజి స్ట్రేషన్లు, పలు ఇతర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఏటా దాదాపు రూ.12 కోట్లుకుపైగా ఆదాయం వస్తోంది. సమ్మె నేపథ్యంలో ఇక్కడ దాదాపు రూ.1.20 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయింది. గతంలో ఎన్న డూ లేని విధంగా సమైక్య పోరు జరుగుతుం డడంతో ఇటు ప్రభుత్వంతో పాటు అటు స్టాం ప్ వెండర్లు భారీగా నష్టపోతున్నారు. స్టాంప్ వెండర్లు స్టాంపులు అమ్మకాలతో జీవనం సాగి స్తున్నారు. అలాంటిది దాదాపు రెండు నెలలకు పైగా సమ్మె కొనసాగుతుండంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. -
కాపాడుకునేందుకు కాంగ్రెస్ మైండ్‌గేమ్
వారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు! నిన్నటి వరకు అధికార దర్పంతో దర్జా ఒలకబోసినవారే...కానీ ఆ క్రమంలో ప్రజలకు దూరమయ్యారు. క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోయారు. ఉన్న కొద్దిపాటి ఆశలూ రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆవిరయ్యాయి. రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. వెంట ఉన్న నేతలు, కార్యకర్తలు జారుకుంటున్నారు. దాంతో జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే ఎన్నికల వరకు రాజకీయ రథాన్ని నెట్టుకువచ్చేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ‘ఏదో ఉంది... తొందరపడొద్దంటూ’ మైండ్‌గేమ్‌కు తెరతీశారు. ఉనికి కోసం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పాట్లూ... అగచాట్లూ ఇలా ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మాగుంట: రాజకీయ భవితవ్యంపై చీకట్లు ముసురుకుంటున్న తరుణంలో ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ వేశారు. ‘సీఎం కిరణ్ అద్భుతం చేస్తారు... ఎవ్వరూ అధైర్యపడొద్దు... తొందరపడొద్దు... భవిష్యత్తుకు ఢోకా లేదు’అంటూ అరచేతలో వైకుంఠం చూపిస్తున్నారు. అందుకే ఒంగోలులో మంగళవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీఎం కిరణ్ నేతృత్వంలో రాజకీయ వ్యూహంతో తామంతా వెళుతున్నామని ఎంపీ మాగుంట చెప్పుకొచ్చారు. తమ దెబ్బకు అధిష్టానం దిగివస్తుందన్నారు. లేకపోతే సీమాంధ్ర సీనియర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులమంతా ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్యాపదేశంగా సీఎం కిరణ్ నాయకత్వంలో కొత్తపార్టీ పెడతామన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. తద్వారా కార్యకర్తలు ఎవ్వరూ జారిపోకుండా కట్టడి చేయాలన్నది ఆయన వ్యూహం. కానీ ఎంపీ మాగుంట వ్యూహం పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఇప్పటికే సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా సీమాంధ్ర సీనియర్ మంత్రులు ధ్వజమెత్తుతున్న విషయాన్ని కార్యకర్తలు ప్రస్తావించారు. అలాంటిది సీఎం కిరణ్ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఆయనతో నడిచేవారు ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టారు. ‘అదిగో... ఇదిగో’...ఎమ్మెల్యే సురేష్ కొత్త పల్లవి పంచాయతీ ఎన్నికలతోనే చతికిలపడిపోయిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ ప్రస్తుతం అంతర్మథనంలో పడిపోయారు. దాదాపుగా టీడీపీలో చేరేందుకు సిద్ధపడిపోయినా ఆయన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిత్తరపోయారు. ఈలోగా టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన కూడా వాయిదా పడటం ఆయనకు కలసివచ్చింది. ఈ సమయంలో ఉన్న కొద్దిమంది కార్యకర్తలు జారిపోకుండా ఉండేందుకు కొత్త పల్లవి అందుకున్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని మెల్లగా చెబుతున్నారు. అదిగో అవకాశం వస్తోంది... ఇదిగో పిలుపు వస్తోంది అని వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా నుంచి వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లినా దానికి రాజకీయ రంగు పులుముతున్నారు. తద్వారా తాను ఏదో కీలక రాజకీయ మంతనాల జరుపుతున్నట్లు కార్యకర్తలు విశ్వసించాలన్నది ఆయన లక్ష్యం. అలా కార్యకర్తలను కొంతకాలం ఆశల పల్లకిలో ఊరేగించి తరువాత తన నిర్ణయం తాను తీసుకోవాలన్నది ఎమ్మెల్యే సురేష్ వ్యూహం. ‘అంతా మనోళ్లే కదా!’.. ఎమ్మెల్యే ఉగ్ర మాటల గారడీ కనిగిరి నియోజకవర్గంలో కుదేలైపోయిన ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డి తీరు కూడా అదే విధంగా ఉంది. అందుకే తాను కీలక రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నానని ప్రచారం చేయించారు. అనంతరం వరుసగా రెండు రోజులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. విజయావకాశాలు ఉన్న రాజకీయ ప్రత్యమ్నాయ మార్గం ఆయనకు మూసుకుపోయింది. విధిలేని పరిస్థితుల్లో ఆయన టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. కానీ ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావిస్తే ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా జారిపోతారని ఎమ్మెల్యే ఉగ్ర సందేహించారు. అందుకే ఏ విషయం కూడా చెప్పకుండా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ‘అంతా మనోళ్లే కదా!...మనకు ఎవరితోనూ విబేధాలు లేవు కదా!... మనల్ని ఎవరు కాదంటారు. నేను ఓ నిర్ణయం తీసుకుంటాను. మీరంతా నాతో ఉండండి. నేను చూసుకుంటాను’అని చెబుతూ కార్యకర్తల్లో ధైర్యం కల్పించేందుకు యత్నించారు. మాటలతో కనికట్టు చేస్తూ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో చేయనున్నాననే సంకేతాలు ఇచ్చారు. కానీ ఆయన మాటలు కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపలేకపోయాయనే చెప్పాలి. ఏం చేయనున్నారో చెప్పకుండా మాటలతో గారడీ చేస్తే తామెలా నమ్మేదని కొందరు సూటిగానే వ్యాఖ్యానించారు. ఆమంచి ‘స్వతంత్ర’ మంత్రం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రూటే సెపరేటు. కాంగ్రెస్ పనైపోయిందని తేలిపోవడంతో ఆయన డైలామాలో పడ్డారు. వర్గబలం, కార్యకర్తల బలం పెద్దగా లేకపోయినప్పటికీ ప్రభుత్వ అండదండలతోనే ఇంతకాలం హవా చలాయిస్తున్నారు. కానీ ఆ ప్రభుత్వమే చరమాంకానికి చేరుకోవడంతో ఆమంచికి అంతా అగమ్యగోచరంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆయన సరికొత్త ఎత్తు వేశారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని తన అనుచరుల ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చారు. కానీ ఆ ప్రచారాన్ని అటు ప్రజలుగానీ ఇటు కార్యకర్తలుగానీ ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో కంగుతిన్న ఆమంచి మళ్లీ సీఎం కిరణ్ నాయకత్వంలో పనిచేస్తామని చెబుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి ప్రత్యేకవర్గంగా పోటీచేస్తామనే వాదాన్ని మెల్లగా ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ఇలా వారం పదిరోజులకో కొత్త ప్రచారంతో కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా అయోమయానికి గురిచేస్తున్నారు. అలా చేస్తేనే కార్యకర్తలు గందరగోళంలో పడిపోయి ఏమీ తేల్చుకోలేక తనతో ఉంటారన్నది ఆమంచి వ్యూహం. ‘అన్నా’... అన్నన్నా...! కాలం సాగదీద్దాం... ఏ దారీ కనిపించకపోవడంతో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తే ప్రజలు విశ్వసించరని ఆయనకు తెలుసు. అందుకే కొందరు ఎంపిక చేసినవారితో ఆయనే ఉద్యమాన్ని నడిపిస్తూ తాను కేంద్రబిందువుగా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. ప్రస్తుతం ఏం చెప్పినా కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరు. కాబట్టి రాజకీయ ముఖచిత్రం కొంత స్పష్టత సంతరించుకునే వరకు కాలం వెళ్లబుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. ఇవండీ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పాట్లు... అగచాట్లు! మునుముందు వారు మరెన్ని ఎత్తుగడలు వేస్తారో...! చూద్దాం...! -
అంగన్వాడీల సమైక్య బాట
ఇప్పటివరకు ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తుంటే.. ఆ స్ఫూర్తితో అంగన్వాడీ సిబ్బంది కూడా ఉద్యమబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రెండు నెలలుగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ‘నో వర్క్’ బోర్డు పెట్టిన విష యం తెలిసిందే. అదే బాటలో ఈ నెల 17వ తేదీ నుంచి సీమాంధ్రలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని నాయకులు నిర్ణయించారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సూపర్వైజర్లు, సీడీపీఓలు, ప్రాజెక్టు డెరైక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లంతా సమైక్య జెండాలు చేతబట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. జిల్లాలో 4094 కేంద్రాలు జిల్లాలో 21 సీడీపీఓ ప్రాజెక్టుల పరిధిలో 4094 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందుతుంది. కొన్ని నెలల నుంచి కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం కూడా ప్రవేశపెట్టారు. పౌష్టికాహారంలో భాగంగా వారంలో రెండు రోజులు కోడిగుడ్లు అందిస్తున్నారు. ఇక ఆటపాటల విద్య చిన్నారుల సొంతం. ఇంతటి ప్రయోజనకరమైన అంగన్వాడీ కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షలమంది లబ్ధి పొందుతున్నారు. సమ్మె ప్రారంభమైతే వీరందరిపై ప్రభావం పడక తప్పదు. జేఏసీ ఆవిర్భావం.. ఇటీవల విజయవాడలో సీమాంధ్రలోని పదమూడు జిల్లాలకు చెందిన అధికారులు, కార్యకర్తలు సమావేశమై సమైక్యాంధ్రకు దన్నుగా ఉండాలని తీర్మానించారు. ఇప్పటికే రెండు యూనియన్లు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనియన్లతో సంబంధం లేకుండా శాఖ కింది స్థాయి కార్యకర్తల నుంచి పైస్థాయి ఉన్నతాధికారుల వరకు జేఏసీలో భాగస్వాములు కానున్నారు. ఇకపై అంతా.. ఇప్పటివరకు పర్చూరు, తాళ్లూరు, మార్కాపురం అర్బన్ సీడీపీఓలతోపాటు కొండపి ఏసీడీపీఓ పూర్తిస్థాయిలో సమ్మె చేస్తున్నారు. మిగిలినవారు ఓవైపు విధులు నిర్వర్తిస్తూ.. మరో వైపు ఉద్యమ నినాదాలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో అంతా సమ్మె పోరుకు సిద్ధమయ్యారు. అయితే సుదీర్ఘకాలంగా ఉద్యమం జరుగుతున్నా స్పందించని శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ.. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సమ్మెకు దిగుతామంటూ ప్రకటించడంపై పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. -
పోలీసులా.. రౌడీలా?
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంకోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన సందర్భంగా అక్కడకు వెళ్లిన తమ పట్ల కాచిగూడ ఎస్సై సైదులు, సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, అకారణంగా కొట్టారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు శివకుమార్, హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి తదితరులు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ‘‘నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం విషమించడంతో గత నెల 29న జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో మా పార్టీకి చెందిన ప్రతినిధులం ఆస్పత్రికి చేరుకున్నాం. ఆస్పత్రి గేటువద్ద శాంతియుతంగా ఉన్న మాపై సివిల్ దుస్తుల్లోని పోలీసులు విరుచుకుపడ్డారు. మర్మాయవాలపై లాఠీలు, బూటు కాళ్లతో తంతూ విచక్షణారహితంగా చితకబాదారు’’ అని వివరించారు. దాడిలో ప్రతాప్‌రెడ్డితోపాటు బండారు సుధాకర్, ఎం.సరోజ్‌రెడ్డి, మాజిద్‌తోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అనంతరం తమను కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, అక్కడ ఎస్సై సైదులు పత్రికల్లో రాయలేనివిధంగా దుర్భాషలాడుతూ మళ్లీ తమపై దాడి చేశారని వివరించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే వీధిరౌడీల్లా దాడి చేశారని, జగన్‌కు మద్దతుగా ఎవరూ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ తరహా దాడికి పాల్పడ్డారని తెలిపారు. జగన్ దీక్షకు మద్దతు తెలిపే తమ హక్కుకు పోలీసులు విఘాతం కలిగించారని, అకారణంగా దాడి చేసి తమ జీవించే హక్కును కాలరాశారని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న పోలీసుల ఫొటోలను చూపిస్తే తమపై దాడి చేసినవారిని గుర్తించగలమన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించి తమపై దాడికి పాల్పడిన పోలీసులు, ఎస్సై సైదులుపై క్రిమినల్ చర్యలతోపాటు శాఖాపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా విచారణ జరిపి ఈనెల 19లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తూర్పు మండల డీసీపీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. -
విభజనలో టీడీపీ ముద్దాయి
సాక్షి, చెన్నై: రాష్ట్ర విభజన వ్యవహారంలో టీడీపీ కూడా ముద్దాయి అని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. చెన్నైలో ఆదివారం ఆయనకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా తమిళనాడులోని తె లుగు సంఘాల నేతృత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. చెన్నైలోని వళ్లువర్‌కోట్టం వద్ద సమైక్య సింహ గర్జన పేరుతో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఆహ్వానించడం వివాదానికి దారి తీసింది. అలాగే సోమిరెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు వెలియడం కూడా వివాదాస్పదమైంది. ఈ చర్యల్ని వ్యతిరేకించిన సమైక్యవాదులను నిర్వాహకులు బుజ్జగించారు. నిరసన ప్రదర్శనకు హాజరైన సోమిరెడ్డి పలువురు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, సమైక్యాంధ్ర జిందాబాద్ అని నినదించాలని డిమాండ్ చేసినా ఆయన స్పందించ లేదు. తాను ఇక్కడికి ముఖ్య అతిథిగా హాజరుకావడాన్ని బట్టి సమైక్యవాదిని అవునో..కాదో నిర్ణయించుకోవాలని ఆయన ఎదురు పశ్న వేస్తూ ప్రసంగించారు. విభజన ప్రక్రియకు టీడీపీ లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని, ఈ పక్రియలో టీడీపీ సైతం ముద్దాయి అని అన్నారు. అయితే తమకంటే ముందుగా మరెందరో ముద్దాయిలు ఉన్నారని.., టీడీపీ ఆరో ముద్దాయి అంటూ వివరించే యత్నం చేశారు. పార్టీలు లేఖలు ఇచ్చినంత మాత్రాన రాజ్యాంగ బద్దంగా, విధానపరంగా నిర్ణయాలు తీసుకోకుండా వ్యవహరిస్తారా అంటూ ఏఐసీసీపై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా మారిందని తెలిపారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ప్రస్తుత సమస్యలకు ఓటరు తీర్పే పరిష్కార మార్గం అవుతుందని అన్నారు. -
విజయనగరంలో భారీ ర్యాలీ, గర్జించిన లక్ష గళాలు...
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యాంధ్రప్రదేశ్‌గా ఉంచాలని డిమాండ్ విజయనగరం పట్టణంలో లక్ష గొంతులు సమైక్య నినాదాన్ని మార్మోగించాయి. రాష్ట్ర విభజన యోచనను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కాంగ్రెస్ హైకమాండ్, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వేర్పాటు వాదులు వ్యవహారశైలిని దుయ్యబడుతూ పెద్ద పెట్టున గర్జించాయి. సమైక్యాంధ్ర సమరభేరి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహంచిన లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. ర్యాలీ ఆద్యంతం సమైక్యవాదులంతా శాంతియుతంగా సాగారు. వివిధ ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది ఉదయం 9.30 గంటలకు పట్టణంలోని కోట జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ వారి జాతరను తలపిస్తూ లక్ష గళ గర్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమైక్యవాదులతో పట్టణ రహదారులు కిక్కిరిసిపోయాయి. స్థానిక కోట జంక్షన్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీగా మూడు లాంతర్ల జంక్షన్, మెయిన్‌రోడ్డు మీదుగా గంటస్తంభం వద్దకు చేరుకుంది. అక్కడ ఆందోళనకారులు బైఠాయించారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయం, ఎస్బీఐ మెయిన్ బ్రాంచి, వైఎస్ఆర్ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా మయూరి జంక్షన్ వద్దకు చేరుకుని అక్కడ మానహారం నిర్వహించారు. అక్కడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు చేరుకుని ముక్తకంఠంతో ఢిల్లీ పీఠాలు దద్దరిల్లేలా ఐదు నిమిషాల పాటు జై సమైక్యాంధ్ర అంటూ గర్జించారు. వివిధ రూపాల్లో నిరసనలు.. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర సమరభేరి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమంలో నిరసనలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సమైక్యవాదులు వివిధ రూపాల్లో తమ నిరసనలను వినూత్నంగా వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ ముందు భాగంలో పెద్ద సంఖ్యలో త్రివర్ణ బెలూన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామితో సహా ఉద్యోగులు, సిబ్బంది చీపుళ్లతో రోడ్లను ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేశారు. కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులు మెడలో కూరగాయలను దండలుగా వేసుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. వస్త్రవ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో కూడిన ప్రత్యేక వస్త్రాలను ధరించారు. న్యాయశాఖ సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేయగా... తోపుడు బళ్ల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బళ్లను తోసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మకు శ వయాత్ర నిర్వహించారు. పులివేషాలు, తప్పెట్టుగుళ్లు, కోలాటం, చెక్క భజన కళాకారులతో పాటు పులువురు చిన్నారులు నృత్యరూపకాలు ప్రదర్శిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో 70 బస్సులతో విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ర్యాలీలో పాల్గొన్న అందరూ ప్లకార్డులు పట్టుకుని, నుదుట జై సమైక్యాంధ్ర అంటూ రాసి ఉన్న రిబ్బన్లు కట్టుకున్నారు. ఈ కా ర్యక్రమంలో శ్రీవెంకటేశ్వర ఆధ్యాత్మిక భక్త మండలి, కో- ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్, విద్యుత్ శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్, క్రైస్తవ సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, సమైక్య జేఏసీ, బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, ఆటో వర్కర్స్ యూనియన్, ఏపీ ఎన్జీఓస్, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, విజయనగరం సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, వాకర్స్క్లబ్లు, టూ వీలర్స్ మోటార్స్ రిపేరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ విజయనగరంలో నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమం సమైక్య ఉద్యమానికి అంతం కాదని... ఇది ఆరంభానికి సూచికని సమైక్యాంధ్ర సమరభేరి జేఏసీ చైర్మన్ జి.శ్రీనివాసరావు అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు అవసరమైతే ఢిల్లీ పెద్దల పీఠాలను కదిలించాలని పిలుపునిచ్చారు. లక్ష గళ గర్జన నిరసన ర్యాలీ అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నిరంతర శ్రమతో అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరి సొత్తు అని అటువంటి హైదరాబాద్‌ను ఒక్క ప్రాంతానికే కేటాయిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతలు, కాంగ్రెస్ అధిష్టానం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి చిరంజీవి తన కుమారుడు, తమ్ముడు, మేనళ్లుళ్ల సినిమాలను ప్రదర్శించుకుని డబ్బులు సంపాదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలోఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జేఏసీ ప్రతినిధులు మామిడి అప్పలనాయుడు, ప్రభూజీ, కాపుగంటి ప్రకాష్, ఉప్పు ప్రకాష్, కేవీఎన్ తమ్మన్నశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
విజయనగరంలో భారీ ర్యాలీ, గర్జించిన లక్ష గళాలు...
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యాంధ్రప్రదేశ్‌గా ఉంచాలని డిమాండ్ విజయనగరం పట్టణంలో లక్ష గొంతులు సమైక్య నినాదాన్ని మార్మోగించాయి. రాష్ట్ర విభజన యోచనను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కాంగ్రెస్ హైకమాండ్, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వేర్పాటు వాదులు వ్యవహారశైలిని దుయ్యబడుతూ పెద్ద పెట్టున గర్జించాయి. సమైక్యాంధ్ర సమరభేరి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహంచిన లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. ర్యాలీ ఆద్యంతం సమైక్యవాదులంతా శాంతియుతంగా సాగారు. వివిధ ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది ఉదయం 9.30 గంటలకు పట్టణంలోని కోట జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ వారి జాతరను తలపిస్తూ లక్ష గళ గర్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమైక్యవాదులతో పట్టణ రహదారులు కిక్కిరిసిపోయాయి. స్థానిక కోట జంక్షన్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీగా మూడు లాంతర్ల జంక్షన్, మెయిన్‌రోడ్డు మీదుగా గంటస్తంభం వద్దకు చేరుకుంది. అక్కడ ఆందోళనకారులు బైఠాయించారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయం, ఎస్బీఐ మెయిన్ బ్రాంచి, వైఎస్ఆర్ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా మయూరి జంక్షన్ వద్దకు చేరుకుని అక్కడ మానహారం నిర్వహించారు. అక్కడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు చేరుకుని ముక్తకంఠంతో ఢిల్లీ పీఠాలు దద్దరిల్లేలా ఐదు నిమిషాల పాటు జై సమైక్యాంధ్ర అంటూ గర్జించారు. వివిధ రూపాల్లో నిరసనలు.. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర సమరభేరి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమంలో నిరసనలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సమైక్యవాదులు వివిధ రూపాల్లో తమ నిరసనలను వినూత్నంగా వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ ముందు భాగంలో పెద్ద సంఖ్యలో త్రివర్ణ బెలూన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామితో సహా ఉద్యోగులు, సిబ్బంది చీపుళ్లతో రోడ్లను ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేశారు. కూరగాయల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులు మెడలో కూరగాయలను దండలుగా వేసుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. వస్త్రవ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో కూడిన ప్రత్యేక వస్త్రాలను ధరించారు. న్యాయశాఖ సిబ్బంది చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేయగా... తోపుడు బళ్ల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బళ్లను తోసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మకు శ వయాత్ర నిర్వహించారు. పులివేషాలు, తప్పెట్టుగుళ్లు, కోలాటం, చెక్క భజన కళాకారులతో పాటు పులువురు చిన్నారులు నృత్యరూపకాలు ప్రదర్శిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో 70 బస్సులతో విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ర్యాలీలో పాల్గొన్న అందరూ ప్లకార్డులు పట్టుకుని, నుదుట జై సమైక్యాంధ్ర అంటూ రాసి ఉన్న రిబ్బన్లు కట్టుకున్నారు. ఈ కా ర్యక్రమంలో శ్రీవెంకటేశ్వర ఆధ్యాత్మిక భక్త మండలి, కో- ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్, విద్యుత్ శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్, క్రైస్తవ సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, సమైక్య జేఏసీ, బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, ఆటో వర్కర్స్ యూనియన్, ఏపీ ఎన్జీఓస్, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, విజయనగరం సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, వాకర్స్క్లబ్లు, టూ వీలర్స్ మోటార్స్ రిపేరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ విజయనగరంలో నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమం సమైక్య ఉద్యమానికి అంతం కాదని... ఇది ఆరంభానికి సూచికని సమైక్యాంధ్ర సమరభేరి జేఏసీ చైర్మన్ జి.శ్రీనివాసరావు అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు అవసరమైతే ఢిల్లీ పెద్దల పీఠాలను కదిలించాలని పిలుపునిచ్చారు. లక్ష గళ గర్జన నిరసన ర్యాలీ అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నిరంతర శ్రమతో అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరి సొత్తు అని అటువంటి హైదరాబాద్‌ను ఒక్క ప్రాంతానికే కేటాయిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతలు, కాంగ్రెస్ అధిష్టానం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి చిరంజీవి తన కుమారుడు, తమ్ముడు, మేనళ్లుళ్ల సినిమాలను ప్రదర్శించుకుని డబ్బులు సంపాదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలోఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జేఏసీ ప్రతినిధులు మామిడి అప్పలనాయుడు, ప్రభూజీ, కాపుగంటి ప్రకాష్, ఉప్పు ప్రకాష్, కేవీఎన్ తమ్మన్నశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యనాదం
సాక్షి, కాకినాడ : సమైక్య ఉద్యమం జిల్లావ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రారంభమై 23 రోజులైనా ఊరు..వాడా నిరసనలు హోరెత్తుతున్నాయి. దిండి-చించినాడ వంతెనపై రామరాజు లంక వాసుల వంటావార్పు వల్ల ఉభయగోదావరి జిల్లాల మధ్య మధ్యాహ్నం వరకు రాకపోకలు స్తంభించాయి. పాడిగేదెలు, గిత్తలతో సమైక్యవాదులు రావులపాలెం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలపడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజమండ్రిలో ఫ్యూచర్ కిడ్స్పాఠశాలకు చెందిన 1500మంది విద్యార్థులు ఆం ధ్రప్రదేశ్ మ్యాప్‌గా ఏర్పడి రాష్ర్టపతి, ప్రధాని, సోనియాలకు పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రులు ఎంఎం పళ్లంరాజు, కె.చిరంజీవి కనిపించడం లేదంటూ కి ర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. నిరసనలతో హోరెత్తిన కాకినాడ కాకినాడలో 23వ రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. కాకినాడలోని జేఎన్టీయూ, ఏపీటీ, జీపీటీలతో పాటు బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకోవడంతో నాలుగోరోజు కూడా జరగలేదు. డీఆర్డీఏ, ఐకేపీల ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది మహిళా సమాఖ్య సభ్యులు మహా ర్యాలీ నిర్వహించారు.కలెక్టరేట్ ఎదుట పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలకు జేఏసీ రాష్ర్ట కో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కేవీవీ సత్యనారాయణరాజు, రవికిరణ్‌వర్మ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీ భావం తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వ వాహన డ్రైవర్స్ సంఘం నేతలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీలు చైతన్యరాజు, వర్మల ఆధ్వర్యంలో చైతన్య విద్యార్థులు నగరంలో బైకు ర్యాలీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో వారికి సంఘీభావంగా నగరంలో ప్రైవేటు పాఠశాలలను గురు,శుక్రవారాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలోకి మున్సిపల్ కమిషనర్లు సీమాంధ్రలోని 33 మున్సిపాల్టీలకు చెందిన కమిషనర్లు రాజమండ్రిలో సమావేశమై సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. విధులు నిర్వహిస్తూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుతామన్నారు. సియోన్ అంధుల పాఠశాల విద్యార్థులు ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నా చేశారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. బొమ్మూరులో న్యాయవాదులు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించగా, మాజీ సర్పంచ్ మత్స్యేటి ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయరహదారిైపై కోడిపందాలు ఆడి నిరసన తెలిపారు. రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో పీహెచ్‌సీలకు తాళాలు వేసి వైద్యులు, సిబ్బంది ర్యాలీ చేశారు. ఏలేశ్వరంలో సుమారు 2వేలమంది స్థానిక బాలాజీచౌక్‌లో సర్వమతప్రార్థనలు, వంటావార్పు, రాస్తారోకోలతో హోరెత్తించారు. తుని గొల్ల అప్పారావు సెంటర్లో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టి పాదచారులకు బూట్ పాలిష్ చేశారు. రామచంద్ర పురంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, సైకిల్‌షాపు ఓనర్లు, మెకానిక్‌ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజోలులో ఉద్యోగ సంఘాల దీక్షలకు గజల్ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. పెద్దాపురంలో జేఏసీ శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను చేసి ఆమోదింప చేసుకోవాలంటూ నిలదీశారు. ఉరకలేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆది నుంచి అగ్రభాగాన ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు గురువారం కూడా పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది మానవహారంగా ఏర్పడి కబడ్డీ, తాడాట వంటి ఆటలతో నిరసన తెలిపారు. రాష్ర్ట విభజనను తట్టుకోలేక మరణించిన వారికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. రావులపాలెంలో జేఏసీ, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పాడిగేదెలు, గిత్తలతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా ట్రాఫిక్ స్తంభించింది. కోరుకొండలో వైఎస్ విజయమ్మకు మద్దతుగా పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ జోతుల లక్ష్మీనారాయణ, యూత్ కన్వీనర్ గణపతిరావు చే స్తున్న ఆమరణ నిరాహారదీక్షలను బుధవారం అర్ధరాత్రి భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. ముమ్మిడివరంలో డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యల చిట్టిబాబు, మెండు గోవిందరావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, కాట్రు అప్పారావులు చేపట్టిన ఆమరణ దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో సుమారు 100 ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. పెదపూడి మండలం చింతపల్లి వద్ద పైన గ్రామానికి చెందిన విద్యార్థులు రాస్తారోకో చేయగా, ఎమ్మెల్యీ బొడ్డు భాస్కరరామారావు పాల్గొన్నారు. కడియం, బొమ్మూరులలో దీక్షాశిబిరాలకు పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు సంఘీభావం తెలిపారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద జేఏసీతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తుని నియోజకవర్గంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలకు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగలిలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ కూసుమంచి శోభారాణి, అడ్డతీగలలో చేపట్టిన దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ అనంతబాబు సంఘీభావం తెలిపారు. మలికిపురంలో చేపట్టిన దీక్షల్లో పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గెడ్డం ఫిలిప్‌రాజు ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనతెలిపారు. బస్సుయాత్రకు అనూహ్య స్పందన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బండార్లంక నుంచి అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం, అల్లవరం మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ వరకు సాగింది. మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చింతా కృష్ణమూర్తి, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు, ఇతర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో మాధవపట్నం నుంచి సామర్లకోట మీదుగా పెద్దాపురం వరకు సాగింది. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం వద్ద వంటావార్పులో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. రెండు ప్రాంతాల్లో వందలాదిగా పార్టీ శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీలతో హోరెత్తించారు. -
ఉద్యమం ఉగ్రరూపం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ఉద్యమంలో పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులతో పాటు విద్యార్థులు, సామాన్యులు అధిక సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు నగరంలో శనివారం నిరసనలు మిన్నంటాయి. సమైక్య నినాదంతో నగరం హోరెత్తింది. ఎన్జీఓలు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడేదిలేదంటూ నినదించారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా వారి పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌బషీర్, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల భారీ ర్యాలీ... ఏపీఆర్ఎస్ఏ, వీఆర్వోల అసోసియేషన్, రేషన్ డీలర్ల అసోసియేషన్, ప్లానింగ్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులంతా సమైక్యంగా ఉద్యమబాట పట్టారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక డీఆర్ఆర్ఎం హైస్కూల్ వద్ద డీఆర్వో రాధాకృష్ణమూర్తి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్ మీదుగా సీవీఎన్ రీడింగ్‌రూం వద్దగల పొట్టిశ్రీరాములు విగ్ర హం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. అక్కడి నుంచి చర్చిసెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు, ఒంగోలు, మార్కాపురం ఆర్డీఓలు మురళి, ఎం.రాఘవరావు, జెడ్పీ సీఈఓ గంగాధర్‌గౌడ్, స్టెప్ సీఈఓ బి.రవి, సీపీఓ టి.వెంకయ్య, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర నాయకులు తోటకూర ప్రభాకర్, శెట్టి గోపి, ఏవీ రవిశంకర్, ఎన్.సుధాకర్, పి.శ్రీనివాసులు, ఎం.వెంకటేశ్వర్లు, వీఆర్వో అసోసియేషన్ నాయకుడు కె.వీరాంజనేయులు పాల్గొన్నారు. సంక్షేమశాఖల ఉద్యోగుల ప్రదర్శన... జిల్లాలోని సంక్షేమశాఖల ఆధ్వర్యంలో స్థానిక ప్రగతిభవన్ నుంచి చర్చిసెంటర్ వరకు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. చర్చిసెంటర్లో మానవహారంగా ఏర్పడి వాహనాలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారిణి మయూరి, సాంఘిక సంక్షేమశాఖ అధికారిణి సరస్వతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీ... విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా కలిసి స్థానిక ఎస్ఈ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్, ట్రంకురోడ్డు, కర్నూల్ రోడ్డు మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వర్లు ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్జీఓల సమ్మెకు మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఈలు పిచ్చయ్య, హరిబాబు, శ్రీనివాసులు, జేఏసీ చైర్మన్ ఎన్.జయాకరరావు, కన్వీనర్ టి.సాంబశివరావు, జాన్సన్, సంజీవరావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో... దేవాదాయ ధర్మాదాయశాఖ, జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, అర్చకులు విధులు బహిష్కరించి స్థానిక దేవాదాయశాఖ కార్యాలయం నుంచి చర్చిసెంటర్ వరకు మేళతాళాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. చర్చిసెంటర్లో మానవహారం నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ జి.రోశయ్య, డీఈ సీహెచ్ శ్రీనివాసరావు, అర్చక సంఘ తరఫున సీతారామాచార్యులు, శేషాచార్యులు, టీవీ శివనాగదాసు, కొత్త వెంకట్రావ్, టీవీ రమణారావు, ఎన్టీ రామారావు పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపిన కార్పొరేషన్ ఉద్యోగులు... రాష్ట్ర విభజనకు నిరసనగా నగర కార్పొరేషన్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన చేపట్టారు. సకల జనుల సమ్మెకు ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. కేంద్రం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. వికలాంగుల నిరసన... సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగులు, స్థానిక బధిరుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. బధిరుల పాఠశాల విద్యార్థులు తమ మూగరోదనతోనే భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఆకట్టుకున్నారు. చర్చిసెంటర్లో క్యారమ్స్, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాలు తదితరులు పాల్గొన్నారు. ట్రాలీ ఆటోలతో ప్రదర్శన... నగర ఆటో ట్రాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రాలీ ఆటోలతో భారీ ప్రదర్శన చేపట్టారు. కర్నూల్‌రోడ్డు ప్లైఓవర్ బ్రిడ్జి నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా చర్చి సెంటర్ వరకు కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించారు. అనంతరం చర్చి సెంటర్లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలకు అన్యాయం చేసే రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బైపాస్ ఆటో సంఘ నాయకుడు షేక్ మీరావలి, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన విద్యార్థుల ఆందోళన... సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ నిరసనను కొనసాగించారు. రిమ్స్ ఎదుట విద్యార్థులతో కలిసి జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. సోనియాగాంధీ, చిదంబరం, ఆంటోని, చిరంజీవి, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర చరిత్రలో వీరంతా ద్రోహులుగా నిలిచిపోతారని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులంతా వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు చర్చిసెంటర్లో మోకాళ్లపై నడిచి, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు రాయపాటి జగదీష్, వెంకటేశ్వర్లు, మహేష్, అశోక్, ఫ్రంట్ నాయకుడు రాజశేఖర్ పాల్గొన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె
-
ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కుట్ర ఉందేమో..ఆలోచించండి!
రాయదుర్గం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో 9 రోజుల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడం వెనుక ఏదైనా కుట్ర దాగుందేమోనని, ఈ విషయంపై సమైక్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని లక్ష్మీబజార్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాలొని దీక్షాదారులకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా కుట్రతోనే చేస్తుందని, దీంతో సీఎం వ్యాఖ్యల్ని సందేహించాల్సి వస్తోందని అన్నారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికా, లేక సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడారా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచి వేసే దిశగా పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే రైల్ రోకో చే సే వారిపై కేసులు పెడతామంటూ డీజీపీ హెచ్చరించారని ఆరోపించారు. హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహించినపుడు విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎంత మందిపై కేసులు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై దాడి కేసులోను కొందరిని విడుదల చేయించార ని గుర్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఇలా మాట్లాడుతున్నారని, కేసులు పెట్టినా భయపడే వారు ఎవరూ లేరన్నారు. ఎన్జీఓలపై ఉద్యమం ఆధారపడి ఉందని, వీరే ప్రభుత్వానికి గుండెలాంటి వాళ్లని అన్నారు. రాష్ర్ట అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత పటిష్టంగా ఉద్యమాన్ని చేపట్టాలని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మన భవిష్యత్తు, భావి తరాల సంక్షేమం కోసం పోరాటాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘం నాయకుడు పరమేశ్వరప్ప మాట్లాడుతూ ఉద్యమం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, స్థానిక నాయకులు తలో మాట మాట్లాడుతున్నారని, దీంతో వారిని ఎవరూ నమ్మడం లేద న్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా రాజకీయ నాయకులు వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ర్ట కమిటీ సభ్యుడు పేర్మి బాలాజీ, గోనబావి శర్మాస్, సంజీవులు, జేఏసీ చైర్మన్ కెంచె లక్ష్మీనారాయణ, నాయకులు టీ.రామాంజనేయులు, వెంకటరామిరెడ్డి, సత్యనారాయణ, ఉబేదుల్లా, జలజాక్షి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య ఉద్యమ స్ఫూర్తి
సాక్షి, ఒంగోలు: వాడవాడలా సమైక్య ఉద్యమ స్ఫూర్తి ఉప్పొంగుతోంది. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు ఇలా అందరూ సమైక్యంగా ఉద్యమంలో ముందుకు సాగుతూ కాంగ్రెస్ అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం మూడో రోజు రిలే నిరాహార దీక్షల్ని పార్టీ బీసీ సెల్ నేతలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షల్ని ప్రారంభించి ప్రసంగించారు. బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా న్యాయమూర్తి ఎ.రాధాకృష్ణ కారును అడ్డగించి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. న్యాయవాదులకు ఉద్యోగ జేఏసీ మద్దతు పలికింది. బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పది వేల మంది విద్యార్థులతో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్మికులు ఒంగోలు జాతి ఎద్దుకు సమైక్యాంధ్ర నినాదంతో కూడిన బోర్డును తగిలించి వినూత్న రీతిలో నిరసన తెలిపి మానవహారం నిర్వహించారు. ఒంగోలులో పాలిటెక్నిక్ విద్యార్థులు మానవహారం, ర్యాలీ చేపట్టారు. యర్రగొండపాలెంలో విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, రైతాంగ సంక్షేమ సేవాసంఘం, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టాయి. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరులో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. చీరాలలో మున్సిపల్ ఉద్యోగులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చీరాల, పేరాల సప్లయర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసింది. భారతీ జూనియర్ కాలేజీ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మలను గడియార స్తంభం సెంటర్లో దహనం చేశారు. కందుకూరులో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ర్యాలీ జరిగింది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి ఒకరోజు రిలే దీక్ష చేపట్టగా, మార్కాపురంలో సమైక్యవాది గంగిరెడ్డి రాజశేఖరరెడ్డి ఆమరణ దీక్షకు దిగారు. దీక్షను వైఎస్సార్ సీపీ విజయవాడ సిటీ ఇన్చార్జి ఉడుముల కోటిరెడ్డి ప్రారంభించారు. తాను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగానే దీక్ష నిర్వహిస్తున్నట్లు రాజశేఖరరెడ్డి ప్రకటించారు. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమంతునిపాడు మండలం వేములపాడులో కూడా ఆటో కార్మికులు ర్యాలీ చేశారు. మార్కాపురం మండలం చింతంగుంట్ల వద్ద రెండువేల మంది విద్యార్థులు, మహిళలతో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం కోర్టు సెంటర్లో రాస్తారోకో చేశారు. కొమరోలు మండలంలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం, ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. చీమకుర్తి మండలం ఎల్లయ్యనగర్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బల్లికురవలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. అద్దంకి నియోజకవర్గంలో వాయిద్య కళాకారులు, రంగస్థల కళాకారులు పద్యాలు పాడుతూ సమైక్య రాష్ట్రానికి మద్దతు పలికారు. అనంతరం పాతబస్టాండు సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. పర్చూరులో మూడోరోజు న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు. మర్రిపూడిలో 500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. టంగుటూరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. -
ఏపీ విభజనపై చర్చాగోష్టిలో వక్తల మనోభావం
పింప్రి, న్యూస్‌లైన్: విడిపోవడం సరికాదని, ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పుణేలో ఆంధ్రప్రదేశ్ విభజన, రాజకీయ పరిస్థితులపై చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనూ హ్య స్పందన లభించింది. డెక్కన్ జింఖానాలోని పుణే ఆంధ్ర సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని మేధావులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులే కాకుండా తెలుగు ప్రజలు కూడా హాజరై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల వారు పాల్గొన్నప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు ప్రాంతాల వారు విడిపోవడం సబబు కాదని, తెలుగువారిగా ఐక్యంగా ఉండి రాజకీయ కుళ్లును కడిగివేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడిందని, రాజకీయ నాయకులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతూ అక్కడి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు బాగా నష్టపోయారన్నారు. రాజకీయ ఎత్తుగడలో తెలుగు జాతి యావత్తూ చిత్తయిందని అభిప్రాయపడ్డారు. మరో వక్త మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మంచి చెడులను గ్రహించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల మధ్య ఐక్యత లేక పోవడంతో కత్తులు దూసుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న తరుణంలోనే వైఎస్ఆర్ ఆకస్మికంగా మృతి చెందారనీ, ఇదే ఆ రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం తెలుగు జాతిని నిలువునా చీలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రరాష్ర్టంలో జరుగుతున్న మారణహోమాన్ని చూసి తెలుగుతల్లి రోదిస్తోందన్నారు. అందువల్ల దేశ సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాలు ఆయా ప్రాంతాల అభీష్టం మేరకు ఏర్పడ్డాయని, ఇంత తీవ్రస్థాయిలో గొడవ జరగలేదని ఓ విద్యార్థిని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ఐ.వి.రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన స్నేహ (ఇంజనీరింగ్ విద్యార్థి), రామారావు, శ్రీనివాస్, ఎస్.డి.రావు, ఎం.సి.కె. రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిమాంధ్రకు పూర్తిగా నిలిచిపోయిన ఆర్టీసి సర్వీసులు
-
రాష్ట్ర విభజన నిరసన జ్వాలలు
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజన నిరసన జ్వాలలు జిల్లాలో మరింత ఉధృతమయ్యాయి. గుంటూరు కేంద్రంగా ఆదివారం సమైక్యాంధ్ర ఆందోళనలు కొనసాగగా.. రాజకీయ నేతలు, విద్యార్థులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు మానవహారాలుగా ఏర్పడి, రాస్తారోకోలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హిజ్రాల సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో భారీ ప్రదర్శన నిర్వహించి .. కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర మద్దతుదారుల సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, మంగళగిరిలో కూడా పలు సంఘాలు సమావేశాలు, నిరసన కార్యక్రమాల్ని చేపట్టాయి. విభజన తట్టుకోలేక.: తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న తమ బంధువుల్ని సీమాంధ్రకు వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తుండటాన్ని తట్టుకోలేక గుంటూరు, కోబాల్డ్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్ మంచుపల్లి వందనంబాబు(25) పురుగుమందు తాగగా శనివారం అర్ధరాత్రి దాటిన మృతిచెందాడు. తెనాలికి చెందిన గోడపాటి నరసింహారావు(43) అనే పెయింటర్ సమైక్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ గుండెపోటుతో మరణించారు. వీరి మృతదేహాలను వైఎస్ఆర్ సీపీ నేతలు, జేఏసీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. గుంటూరులో విద్యార్థి జేఏసీ నిరసన కార్యక్రమంలో షేక్ ఇమ్రాన్ అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు వందలాదిగా పాల్గొని కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఐక్యత సమితి ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ధ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో హిందూ కళాశాల సెంటర్లో ఉపాధ్యాయులు భారీ మానవహారం నిర్వహించి, రాష్ట్రాన్ని విభజిస్తే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. జిల్లాలో జరగనున్న రాజీవ్ విద్యామిషన్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను బహిష్కరించాలని ఉపాధ్యాయ జేఏసీ పిలుపునిచ్చింది. ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కార్యచరణ ప్రణాళిక ఏపీఎన్జీవోస్ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను సమీకరించి కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఎన్జీవో కల్యాణమండపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నుంచే ఏఎన్‌యూ విద్యార్థుల రిలే, ఆమరణ నిరాహారదీక్షలకు పూనుకోనున్నారు. -
కలిసి వస్తే.. సమైక్యాంధ్ర సాధ్యం
ఉద్యోగ,ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు, కార్మిక, మేధావులంతా ముందుకు కలిసి కట్టుగా వస్తే సమైక్యాంధ్ర సాధ్యమని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు అన్నారు. ఆదివారం ఎన్జీవో హోంలో వేదిక ప్రతినిధులు తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణ, చౌదరి నారాయణమూర్తి, హనుమంతు సాయిరాం, బరాటం లక్ష్మణరావు, దుప్పల వెంకటరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, అశోక్, నాగరాజ్, విజయ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, యూపీఏపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భయపడరన్నారు. యూపీఏ ప్రభుత్వం మరో ప్రకటన చేసే వరకు సమైక్య లక్ష్యసాధన కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరుచుకునేలా ప్రశాంతంగా ఉద్యమాలను యువత నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసినంత మాత్రాన తెలంగాణ విభజన జరగదన్నారు. తదుపరి చర్యలు తీసుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణా సొత్తు కాదని, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి ఆస్తిగా పేర్కొన్నారు. విద్యాసంస్థలు, కర్మాగారాలు, అక్కడ ఉన్న సంపద ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని, నెత్తురు ధారపోసైనా కాపాడుకుంటామని శపథం చేశారు. ఊరూరా తెలుగు తల్లి జెండాలు జిల్లాలో ప్రతి ఊళ్లోనూ తెలుగుతల్లి జెండాలు ఆవిష్కరించాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సాగాలని కోరారు. దీనికి ప్రజాస్వామ్య, సమైక్య వాదులంతా ముందుకు రావాలన్నారు. సీమాంధ్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని లేకపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌ను ముక్కలు చేయాలంటే ఒప్పుకోని బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ముక్కలు చేయాలని యోచిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఉద్యోగుల జోలికి వెళితే చర్యలు తప్పవని ప్రతినిధులు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, మేధావుల సంఘాలు మరింత ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయన్నారు. ఉద్యోగులు మెరుపు సమ్మెకు సమాయత్తమవుతున్నారని తెలిపారు. కేసును ఉపసంహరించుకోవాలి రాజాంలో విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని అధికారులకు కోరారు. వారు సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమాలు చేశారే తప్ప చెడ్డవారు కాదని, దీని గురించి ఎస్పీని కలుస్తామని చెప్పారు. నేడు భారీ ర్యాలీ సమైక్యాంధ్ర సాధన కోసం పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సాయంత్రం సూర్యమహల్ నుంచి ఏడు రోడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కె.వేణుగోపాల్, శ్రీనివాసానందస్వామి, ఎంఆర్‌కె దాస్, విజయ్, డి. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘సమైక్య’ ఆకాంక్ష
సాక్షి, ఏలూరు : రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదంటూ సమైక్యవాదులు భీష్మించారు. ఐదో రోజైన ఆదివారం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. నాలుగు రోజులపాటు ఏకబిగిన సాగించిన సమ్మెకు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం కొంత సడలింపు ఇచ్చారు. దీంతో అక్కడక్కడా కొన్ని దుకాణాలు తెరుచు కున్నాయి. ఆర్టీసీ బస్సులు నామమాత్రంగా నడిచారుు. జిల్లాలో అనేకచోట్ల సర్వమత ప్రార్థనలు జరిగాయి. సెలవు రోజున కూడా అన్నివర్గాల ప్రజలు సమైక్య నినాదంతో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. ప్రజల నుంచి చీత్కారాలు, ఒత్తిడి ఎదుర్కొంటున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదివారం ఎట్టకేలకు ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు పీసీసీ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక చాగల్లులో బొల్లిపో వీర్రాజు (68) గుండె పోటుతో మరణించాడు. తాళ్లపూడి మండలం తాడిపూడిలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి కేబుల్ ఆపరేటర్లు మద్దతు పలి కారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ వినోద చానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. పెట్రోల్ బంకులను ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకూ వాటి యజమానులు మూసివేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలి కారు. పోలవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉండిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగారుు. కొయ్యలగూడెం ఆర్టీసీ బస్టాండ్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన బస్సులు తెలంగాణ డ్రైవర్లకు, కండక్టర్లకు సమైక్యవాదులు ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు కట్టి నిరసనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేలా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మనసును మార్చాలని ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని ముస్లింలంతా ప్రదర్శన నిర్వహించి నమాజు చేశారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. జూట్ మిల్లువద్ద వేకువజామునే బస్సులను నిలిపివేశారు. రాష్ట్రాన్ని విడదీస్తే జరిగే నష్టాలు తాగుబోతు కేసీఆర్‌కు తెలియూలని పేర్కొంటూ నెహ్రూ నగర్లో యువకులు ఒక వ్యక్తికి కేసీఆర్ వేషం వేసి ఊరేగించారు. ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గాయత్రి పురోహిత సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. కాపునాడు ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ హాలు ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా అండర్-14, అండర్-16 క్రీడాకారులు సీఆర్‌రెడ్డి గ్రౌండ్ చుట్టూ ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకునే వారు ఈ వారం వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసివేసి ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఆటో ఓనర్లు, డ్రైవర్లు ర్యాలీ చేశారు. దెందులూరు మండలం మొండూరు గ్రామానికి చెందిన 200మంది రైతులు మోటార్ సైకిళ్లపై ఏలూరు వచ్చి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర విషయంలో కేంద్ర మంత్రులను కుక్కలుగా చిత్రీకరించి, ఒక్కొక్కరి వ్యక్త్తిత్వాన్ని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. బాదంపూడిలో రైల్‌రోకో చేశారు. పాలకొల్లు పట్టణంలో రిలే నిరహార దీక్షలు కొనసాగాయి. బ్రాడీపేట, అన్నపూర్ణ థియేటర్ సెంటర్లలో సోనియా, కే సీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దొడ్డిపట్లలో వంటావార్పు నిర్వహించారు. పోడూరు మండలం బొల్లేటికుంట చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెనుగొండలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒక రోజు రిలే దీక్ష చేశారు. ఆచంటలో జేఏసీ ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. జంగారెడ్డిగూడెంలో ప్రాంతీయ బ్రాహ్మణ పురోహిత అర్చక సేవా సమాఖ్య ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటర్లో లక్ష్మీగణపతి శాంతి హోమం నిర్వహించారు. హైస్కూల్ సెంటర్లో విద్యార్థులు, యువకులు ప్రదర్శన నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోటారు వర్కర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. నిడదవోలులో ట్రక్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో 150 ట్రక్కు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను వాహనంపై ఉంచి శవయాత్ర నిర్వహించి తగులబెట్టారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో మానవహారం నిర్వహించి సర్వమత ప్రార్థనలు చేపట్టారు. ఉపాధ్యాయులు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు తేతలి జాతీయ రహదారి జంక్షన్ వద్ద వంటావార్పు చేసి నిరస వ్యక్తం చేశారు. దెందులూరు మండలం శ్రీరామవరంలో గంగానమ్మ ఆలయంలో మహిళలు 1008 ఎనిమిది బిందెల నీళ్లతో అభిషేకం చేశారు. దెందులూరు మన్నా చర్చిలో ప్రార్థనలు చేశారు. కొవ్వూరు విజయవిహార్ సెంటర్లో మౌనప్రదర్శన జరిగింది. రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. శ్రీరామా కాలనీ వద్ద రాష్ట్ర రహదారిపై సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. -
నిలిచిన ఆర్టీసీ సేవలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే నష్టాలబాటలో నడుస్తున్న ఆర్టీసీని సీమాంధ్రలో సమైక్యాంద్ర ఉద్యమ సెగ ఆర్థికంగా మరింత కుంగదీస్తోంది. ఉద్యమ నేపథ్యంలో కోస్తా, రాయలసీమ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసుల నిలిపివేతతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఎంజీబీఎస్ నుంచి దాదాపు లక్షన్నర మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండగా సీమాంద్రలో ఉద్యమం కారణంగా ఈ సంఖ్య 50 వేలకు పడిపోయింది. ఎంజీబీఎస్ నుంచి రాయలసీమ జిల్లాలకు రోజూ ఆర్టీసీ 710 సర్వీసులు నడుపుతుంది. ఉద్యమం ఊపందుకోవడంతో గత ఐదు రోజులుగా రాయలసీమ జిల్లాల వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులన్నీ పూర్తిగా రద్దయ్యాయి. కాగా, శనివారం నుంచి ఒంగోలు, నెల్లూరు జిల్లాల వైపు 90 శాతం, విజయవాడ, గుంటూరు వైపు 75 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఉభయ గోదావరి జిల్లాల వైపు 50 శాతం, విశాఖపట్నం వైపు 25శాతం సర్వీసులను అధికారులు రద్దు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా మారడంతో అనేకమంది తమ ప్రయాణాలను వాయిదాలు వేసుకుంటుండగా, అత్యవసర పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో రైలు, విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా వైపు సర్వీసుల పునరుద్ధరణకు నిర్ణయం రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, బెంగళూరు మార్గాల్లో వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు ఐదు రోజులుగా పూర్తిగా రద్దయిన విషయం విదితమే. కాగా ఆదివారం రాత్రి నుంచి రద్దీని బట్టి కర్నూలు జిల్లాకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎంజీబీఎస్‌లోని కర్నూల్ సెక్టార్ నుంచి నిత్యం 260 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని సర్వీసులను నడిపించేందుకు సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.