- బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ
- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : ఆధార్‌తో నిమిత్తం లేకుండా విద్యార్థులకు స్కాల ర్‌షిప్‌లు ఇవ్వాలనే డిమాండ్‌తో బీజేపీ నాయకులు సో మవారం ఆందోళనకు దిగారు. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. గంటన్నర పాటు సాగిన ఈ ఆం దోళనతో వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోగా, పోలీ సులు కోరినా రాస్తారోకో విరమించేందుకు అంగీకరించలేదు. చివరకు రాస్తారో విరమించిన నాయకులు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా లోపలకు వెళ్లేందుకు యత్నించగా, అప్పటికే పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. అయితే, వినతిపత్రం ఇస్తామని కోరడంతో పోలీసులు అంగీకరించారు.
ఈ ప్రభుత్వాన్ని ఆధార్ కూలదోస్తుంది..
అన్నింటికీ ఆధారమంటూ ప్రభుత్వం ఇస్తున్న ఆధార్ కార్డులే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాయని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నా రు. మాజీ ఎమ్మెల్యే అయిన తాను ఆధార్ కోసం 9 నెలల క్రితం ఫొటో దిగగా ఇంత వరకు రాలేదన్నారు. ఇక సామాన్యులు, విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించా రు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుతో సంబంధం లేకుం డా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడం తో పాటు ఫీజు రీయింబర్‌సమెంట్ చెల్లించాలని డిమాం డ్ చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మా ట్లాడుతూ విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరిన నేపథ్యంలో బకాయి స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని కోరా రు. కార్యక్రమంలో నాయకులు వన్నాల శ్రీరాములు, రావు పద్మ, కృష్ణవేణి, కూచన రవళి, డాక్టర్ టి.విజయలక్ష్మి, ఉషాకిరణ్, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, శ్రీరాముల మురళీమనోహర్, గుజ్జ సత్యనారాయణరావు, కొత్త దశరథం, మల్లాడి తిరుపతిరెడ్డి, గాదె రాంబాబు, రావు అమరేందర్‌రెడ్డి, జన్నె మొగిలి, జలగం రంజిత్, బండి సాంబయ్య, బి.శ్రీనివాస్, అమర్‌నాథ్‌రెడ్డి, మారెపల్లి విష్ణువర్దన్‌రెడ్డి, బిక్షపతి, భాస్కర్ పాల్గొన్నారు.