సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమిళనాడు సర్కార్ తమ అభ్యంతరాలపై వాదనలు వినిపించింది. ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో తమిళనాడు అభ్యంతరాలను పరిశీలించి... సదావర్తి భూముల హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు మొదట రూ. 22 కోట్లకు ఈ భూములు వేలం పాడిన సంజీవరెడ్డికి చెల్లించాల్సిన వడ్డితోపాటు.. రెండో విడత వేలం వ్యవహారాన్ని కూడా తేల్చాలని సుప్రీంకోర్టు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment