Sadavarti Satram lands
-
‘సదావర్తి’పై సర్కారు తాజా పిటిషన్ తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి సత్రం భూముల వేలం పాటలో బిడ్డర్ చదలవాడ లక్ష్మణ్ చెల్లించిన డిపాజిట్‌ను తమ వద్దే ఉంచుకుంటామని, అందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సదావర్తి భూముల యాజమాన్య హక్కులు తమవేనంటూ తమిళనాడు ప్రభుత్వం గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు దీనిపై పూర్తి స్థాయిలో హైకోర్టు విచారణ జరపాలని చెబుతూ, భూముల వేలం ప్రక్రియలో పాల్గొన్న వారి డబ్బులు వెనక్కివ్వాలని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే యాజమాన్యం విషయం తేలే వరకు లక్ష్మణ్ డిపాజిట్‌ను తమ వద్ద ఉంచుకుంటామని ప్రభుత్వం తాజాగా పిటిషన్ వేసింది. మరోవైపు.. భూముల యాజమాన్య హక్కులు తేలేంత వరకు తన వేలం హక్కులను రద్దు చేయరాదని, విచారణలో భూములు ఏపీవని తేలితే తనకు కేటాయించాలని చదలవాడ లక్ష్మణ్ మరో పిటిషన్ వేశారు. వీరి వాదనలను తోసిపుచ్చుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లను తిరస్కరించింది. సత్రం భూములను కారు చౌకగా కట్టబెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడం వల్లే తిరిగి రెండవసారి వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. కేసు విచారణకు ఆళ్ల తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ హాజరయ్యారు. -
సదావర్తి భూములపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
-
సదావర్తి భూములపై తాజా ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమిళనాడు సర్కార్ తమ అభ్యంతరాలపై వాదనలు వినిపించింది. ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో తమిళనాడు అభ్యంతరాలను పరిశీలించి... సదావర్తి భూముల హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు మొదట రూ. 22 కోట్లకు ఈ భూములు వేలం పాడిన సంజీవరెడ్డికి చెల్లించాల్సిన వడ్డితోపాటు.. రెండో విడత వేలం వ్యవహారాన్ని కూడా తేల్చాలని సుప్రీంకోర్టు సూచించింది. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం చివాట్లు
-
రాజకీయ మాంసాహారి
సాక్షి, హైదరాబాద్: అమరేశ్వరుడి భూములను కారుచౌకగా కొట్టేయాలని చూసి న్యాయస్థానాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయి కూడా సీఎం చంద్రబాబు ఇంకా సిగ్గూ ఎగ్గూ లేకుండా తాను ఏ తçప్పు చేయలేదని బుకాయించే యత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సదావర్తి భూములను చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో భాగస్వాములైన కొంతమంది వ్యక్తులు, టీడీపీ నేతలు, మంత్రి లోకేశ్ బాబు ఆధ్వర్యంలో దోచుకోవాలని చూశారని దుయ్యబట్టారు. దీనిపై తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండోసారి వేలం వేస్తే రూ 60.30 కోట్లు ధర పలికిందన్నారు. చంద్రబాబు దోపిడీని వైఎస్సార్సీపీ సమర్థంగా అడ్డుకోవటంతో దిక్కుతోచని పరిస్థితిలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు శాఖాహారిగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రాజకీయ మాంసాహారిగా రాష్ట్ర ఆరోగ్యాన్ని భక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికలో వార్త వస్తే.. జగన్‌పై విమర్శలా? పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుపై ‘సాక్షి’లో కథనంపై చంద్రబాబు విమర్శలు చేయటంపై అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. సదావర్తి పాపం నుంచి రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించేందుకే జగన్‌పై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఏపీపై కృష్ణా నదీ జలాల బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, ఆ ఫిర్యాదు లేఖను తెలంగాణ నీటి వనరుల శాఖ కార్యదర్శి మీడియాకు వివరించారని, దాని ఆధారంగా సాక్షితో సహా అన్ని తెలుగు, జాతీయ దిన పత్రికలు వార్తలు రాశాయని తెలిపారు. తెలంగాణ పత్రికలు తెలంగాణ ప్రభుత్వ వాదనను రాయడం తప్పా? అని ప్రశ్నించారు. అసలు కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ ఉంటే చంద్రబాబు ఎప్పుడైనా నోరు విప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులను సంకల్పిస్తే దానికి వ్యతిరేకంగా జగన్ దీక్ష చేశారని గుర్తు చేశారు. సాక్షి పత్రికలో ఒక వార్త వస్తే అది జగన్‌న్‌వాదన ఎలా అవుతుందని రాంబాబు ప్రశ్నించారు. -
‘చంద్రబాబు ఏం తిన్నా మాకు అభ్యంతరం లేదు’
-
‘చంద్రబాబు పగటి కలలు కంటున్నారు’
సాక్షి, విజయవాడ : సదావర్తి సత్రం భూములను రూ.22కోట్లకే కొట్టేయాలని తెలుగుదేశం పార్టీ యత్నించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జోక్యంతో ప్రభుత్వానికి రూ.60కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. సక్రమంగా వేలం నిర్వహించి ఉంటే ప్రభుత్వ ధర రూ.350 కోట్ల ఆదాయం వచ్చేదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం తమకేనని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నంద్యాల, కాకినాడలో టీడీపీ నేతలు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్న దుస్థితి చంద్రబాబుదన్నారు. వంశధార నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న రామకృష్ణ... నిర్వాసితుల పరామర్శకు వెళ్లిన సీపీఎం మధును అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చే నెల మూడ్రోజుల పాట భారీ ధర్నా చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. -
మళ్లీ చక్రం తిప్పిన 'పచ్చ' బ్యాచ్!
సదావర్తి సత్రం భూములను తాజా వేలంలోనూ దక్కించుకున్న టీడీపీ మరింత ధర వచ్చేదంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములను టీడీపీ నాయకులు వదిలేట్టు కనబడటం లేదు. ఆరంభం నుంచి ఈ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు కుట్రలు చేసిన అధికార పార్టీ నాయకులు తాజా వేలంలోనూ తమ 'పాటవం' ప్రదర్శించారు. తమ అనుచరుడి ద్వారా సత్రం భూములను దక్కించుకున్నారు. రెండోసారి నిర్వహించిన వేలంలోనూ భూములు చేజారిపోకుండా చక్రం తిప్పారు. కారు చౌకగా కొట్టేయాలని.. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను మొదట రూ. 22 కోట్లకు తమ పార్టీ నాయకుడికి చంద్రబాబు సర్కారు కట్టబెట్టేసింది. సదావర్తి సత్రానికి చెన్నై నగరానికి సమీపంలో ఉన్న 83 ఎకరాల అత్యంత విలువైన భూమిని ఏపీ ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే అప్పనంగా ఇచ్చేసింది. ప్రభుత్వ నిర్వాకంతో వందల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంతో డొంక కదిలింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం లోతుగా విచారణ జరిపింది. సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలని ఆదేశించింది. తెర వెనుక మంత్రాంగం తాజా వేలంలోనూ టీడీపీ నేతలు చక్రం తిప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన బృందం చెన్నైలో మకాం వేసి మళ్లీ భూములు దక్కించుకునేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. భూములు తమ చేయి దాటిపోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు కనబడుతోంది. తాజా వేలంలో రూ.60.30 కోట్లకు భూములు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ కంపెనీలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. వేలంలో పాల్గొన్న బద్వేలు శ్రీనివాస్ రెడ్డి.. వరదరాజులు రెడ్డి ముఖ్య అనుచరుడు. ఆస్తుల విలువను పూర్తిస్థాయిలో అధ్యయం చేసి మళ్లీ తనవాళ్లే భూములు దక్కించుకునేలా చంద్రబాబు వ్యవహారం నడిపినట్టు తాజా వేలం ద్వారా రుజువైంది. జాతీయ స్థాయిలో మరింత ప్రచారం చేసివుంటే రూ.100 కోట్లపైగా ధర పలికేదని చెన్నై రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడ్డారు. సదావర్తి భూమి వేలానికి సంబంధించి జాతీయ పత్రికల్లో కూడా ప్రకటనలు ఇవ్వాలని హైకోర్టు తేల్చి చెప్పినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.