కాల్వశ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని గంగారం-కూనారం హుస్సేన్‌మియా వాగు వంతెన కింద గతనెల 22న వెలుగుచూసిన హత్య కేసును కాల్వశ్రీరాంపూర్ పో లీసులు చేధించారు. డబ్బుల కోసం బాబాల వే షంలో ఓ అమాయకుడిని నమ్మించి ప్రాణం తీ సినట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. వి వరాలను సుల్తానాబాద్ సీఐ కరుణాకర్‌రావు వె ల్లడించారు.
పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటకు చెందిన ముక్కెర అంజయ్య (42) గో దావరిఖని, పెద్దపల్లి ప్రాంతంలో బట్టల వ్యా పారం చేసేవాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో వ్యసనాలకు బానిసయ్యాడు. భార్య న వ్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వద్ద ఉన్న డబ్బుల కోసం అంజయ్య గోదావరిఖనికి చెంది న తన మిత్రుడు పెరుక రవిని ఆశ్రయించాడు. రవి తనకు తెలిసిన కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన షరీఫ్, ఈయన మేనమామ, ముత్తారం మండల కేంద్రానికి చెందిన ఉప్పలయ్యను పరిచయం చేయించాడు.
బాబాల వేషంలో ఉన్న వీరు ఁమంత్రాల ద్వారా నీ భార్యను నీ వద్దకు రప్పిస్తాం. చెప్పినట్లు చేయిస్తాం. ఇందుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది.రూ. అని నమ్మించారు. నవ్య చీర, జాకెట్టు, తాడు తీసుకురమ్మన్నారు. నమ్మిన అంజయ్య బట్టల దుకాణంలో అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులోంచి రూ.88 వేలు తీసుకుని, భార్య బట్టలను కవర్లో సర్దుకుని అక్టోబర్ 22న కాల్వశ్రీరాంపూర్‌కు బైక్‌పై చేరుకున్నాడు. అక్కడే ఉన్న షరీఫ్, ముత్తయ్య మద్యం బాటిళ్లు తీసుకుని ముగ్గురూ కలిసి హుస్సేన్‌మియా వాగుకు చేరుకున్నారు. మంత్రాలు చేస్తుంటే దెయ్యాలు వస్తాయని, వాటిని చూసి భయపడితే మంత్రాలు పనిచేయవని అంజయ్య చేతులు కట్టేశారు. వేపమండల దండతో ఉరేసి చంపారు. అంజయ్య వద్దనున్న రూ.88 వేలు తీసుకుని ఉడాయించారు.
బయటపెట్టిన సిమ్‌కార్డు
గీతకార్మికుల ద్వారా హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలంలో పరిశీలించగా.. విరిచిపడేసిన సిమ్‌కార్డు లభించింది. దాని ఆధారంగా దర్యాప్తు చేయగా.. అంజయ్య తరచూ బాబా అంటూ చాలాసేపు మాట్లాడేవాడని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఆరా తీయగా.. నిందితుల ఆచూకీ తెల్సింది. నిందితులను గురువారం అరెస్టు చేసి వారి నుంచి రూ.79 వేలు ఉరికి ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుల్తానాబాద్ కోర్టులో హాజరుపర్చారు. కేసును చేధించిన ఎస్సై జనార్దన్, హెడ్ కానిస్టేబుల్ అజ్మత్ అలీ, కానిస్టేబుళ్లు పండరీనథ్, శివప్రసాద్, సమ్మయ్య, హోంగార్డు శీనును సీఐ అభినందించారు.
డబ్బుల కోసం ప్రాణాలు తీశారు
Published Fri, Nov 1 2013 4:11 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement