simcard
-
బీఎస్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదల
బీఎస్ఎన్ఎల్ కొన్ని రాష్ట్రాల్లో ‘5జీ-రెడీ సిమ్ కార్డ్’లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇవి రాబోయే నెట్వర్క్ అప్‌గ్రేడ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కొత్త సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 3జీ సదుపాయాన్నే అందిస్తోంది. కొన్ని టైర్1, టైల్ 2 నగరాలతోపాటు ఇతర టౌన్‌ల్లో మాత్రమే 4జీ సేవలను ప్రారంభించింది. ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా..వంటి ప్రైవేట్ నెట్వర్క్ ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్లను సవరించాయి. వాటిని గతంలో కంటే దాదాపు 20-30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. దాంతో ఆ నెట్వర్క్ వినియోగదారులు మార్కెట్లో చౌకగా రీచార్జ్ ప్లాన్లు అందించే బీఎస్ఎన్ఎల్వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇందులో 4జీ సర్వీసే కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. దాంతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇది గమనించిన బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు 4జీ సదుపాయాన్ని వేగంగా విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో రాబోయే 5జీ నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా సిమ్‌కార్డులను తీసుకునే అవసరం లేకుండా ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’లను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వివరించింది.ఈ సిమ్‌కార్డును ఆధునిక స్మార్ట్ఫోన్లతోపాటు ఫీచర్ఫోన్లలో వాడుకునేందుకు వీలుగా రెగ్యులర్, మైక్రో, నానో వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఎయిర్టెల్, జియో మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ 4జీ వినియోగదారులు 5జీ కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి కొత్త సిమ్ కార్డ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5జీ-రెడీ సిమ్‌నే వాడుకోవచ్చని సంస్థ పేర్కొంది. వినియోగదారులకు మరింత మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీని అందించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.ఇదీ చదవండి: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!ఇదిలాఉండగా, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లను కేటాయించారు. తాజాగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవల ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవల్ని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు. -
డబ్బుల కోసం ప్రాణాలు తీశారు
కాల్వశ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని గంగారం-కూనారం హుస్సేన్‌మియా వాగు వంతెన కింద గతనెల 22న వెలుగుచూసిన హత్య కేసును కాల్వశ్రీరాంపూర్ పో లీసులు చేధించారు. డబ్బుల కోసం బాబాల వే షంలో ఓ అమాయకుడిని నమ్మించి ప్రాణం తీ సినట్లు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. వి వరాలను సుల్తానాబాద్ సీఐ కరుణాకర్‌రావు వె ల్లడించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటకు చెందిన ముక్కెర అంజయ్య (42) గో దావరిఖని, పెద్దపల్లి ప్రాంతంలో బట్టల వ్యా పారం చేసేవాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో వ్యసనాలకు బానిసయ్యాడు. భార్య న వ్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వద్ద ఉన్న డబ్బుల కోసం అంజయ్య గోదావరిఖనికి చెంది న తన మిత్రుడు పెరుక రవిని ఆశ్రయించాడు. రవి తనకు తెలిసిన కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన షరీఫ్, ఈయన మేనమామ, ముత్తారం మండల కేంద్రానికి చెందిన ఉప్పలయ్యను పరిచయం చేయించాడు. బాబాల వేషంలో ఉన్న వీరు ఁమంత్రాల ద్వారా నీ భార్యను నీ వద్దకు రప్పిస్తాం. చెప్పినట్లు చేయిస్తాం. ఇందుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుంది.రూ. అని నమ్మించారు. నవ్య చీర, జాకెట్టు, తాడు తీసుకురమ్మన్నారు. నమ్మిన అంజయ్య బట్టల దుకాణంలో అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులోంచి రూ.88 వేలు తీసుకుని, భార్య బట్టలను కవర్లో సర్దుకుని అక్టోబర్ 22న కాల్వశ్రీరాంపూర్‌కు బైక్‌పై చేరుకున్నాడు. అక్కడే ఉన్న షరీఫ్, ముత్తయ్య మద్యం బాటిళ్లు తీసుకుని ముగ్గురూ కలిసి హుస్సేన్‌మియా వాగుకు చేరుకున్నారు. మంత్రాలు చేస్తుంటే దెయ్యాలు వస్తాయని, వాటిని చూసి భయపడితే మంత్రాలు పనిచేయవని అంజయ్య చేతులు కట్టేశారు. వేపమండల దండతో ఉరేసి చంపారు. అంజయ్య వద్దనున్న రూ.88 వేలు తీసుకుని ఉడాయించారు. బయటపెట్టిన సిమ్‌కార్డు గీతకార్మికుల ద్వారా హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలంలో పరిశీలించగా.. విరిచిపడేసిన సిమ్‌కార్డు లభించింది. దాని ఆధారంగా దర్యాప్తు చేయగా.. అంజయ్య తరచూ బాబా అంటూ చాలాసేపు మాట్లాడేవాడని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఆరా తీయగా.. నిందితుల ఆచూకీ తెల్సింది. నిందితులను గురువారం అరెస్టు చేసి వారి నుంచి రూ.79 వేలు ఉరికి ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుల్తానాబాద్ కోర్టులో హాజరుపర్చారు. కేసును చేధించిన ఎస్సై జనార్దన్, హెడ్ కానిస్టేబుల్ అజ్మత్ అలీ, కానిస్టేబుళ్లు పండరీనథ్, శివప్రసాద్, సమ్మయ్య, హోంగార్డు శీనును సీఐ అభినందించారు.