కశింకోట స్టేషన్ నుంచి నిందితుల పరారీ సంఘటనపై ఎస్పీ చర్య
పెదవాల్తేరు (విశాఖ): కశింకోట పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గత నెల 30 వతేదీ రాత్రి కశింకోట నూకాంబిక ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని కశింకోట పోలీసు స్టేషన్‌లో ఉంచారు. వారిని ఈనెల 8 వతేదీ రాత్రి కాలకృత్యాల కోసం బయటకు తీసుకురాగా నిందితులు కాపలా ఉన్న పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు.
ఆ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ జి.సన్యాసిరావు, కానిస్టేబుల్ ఎస్.బోడయ్య, హోంగార్డు బి.ప్రకాష్ విధుల్లో ఉన్నారు. వీరు విధి నిర్వహణలో అలస్వతం చూపిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. తప్పించుకున్న అనుమానితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి విస్తృతంగా గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
Published Tue, Jul 12 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement