సుత్తమ్మ మారుఉత్సవంలో గుండు, గీతాసింగ్ సందడి | Suttamma Maru Utsavam in Chippada | Sakshi
Sakshi News home page

సుత్తమ్మ మారుఉత్సవంలో గుండు,గీతాసింగ్ సందడి

Published Thu, May 29 2014 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

గుండు హనుంతరావు, గీతా సింగ్ ల  హస్యపు జల్లులు

గుండు హనుంతరావు, గీతా సింగ్ ల హస్యపు జల్లులు

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన శ్రీ సుత్తమ్మ తల్లి మారువారం ఉత్సవం సినిమా నటులు గుండు హనుమంతురావు, గీతాసింగ్, సింగర్ విజయలక్ష్మి సందడి చేశారు.

 చిప్పాడ: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన శ్రీ సుత్తమ్మ తల్లి మారువారం ఉత్సవం సినిమా నటులు గుండు హనుమంతురావు, గీతాసింగ్, సింగర్ విజయలక్ష్మి సందడి చేశారు.  చిప్పాడలో శ్రీ సుత్తమ్మ తల్లి మారువారం ఉత్సవం ఘనంగా నిర్వహించారు.  శ్రీ సుత్తమ్మ తల్లి ఆలయం పరిసరాలలో అంతా సందడి నెలకొంది. ఉత్సవంలో భాగంగా ‘మిలీనియం ఈవెంట్స్’ పేరుతో ఉత్సవ కమిటి ఓ సాంస్కతిక  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

గుండు హనుంతరావు తనదైన శైలిలో హస్యపుజల్లులు కురిపించారు. ఆయనకు గీతా సింగ్ సహకరించారు. వారి హాస్యానికి విజయలక్ష్మి పాటలు  కూడా తోడవడంతో ఉత్సవానికిని హాజరైన భక్తులు ఆనంద డోలికల్లో మునిగి పోయారు. బుల్లి తెర చాలెంజ్ విన్నర్ శంకర్ టీం డాన్సులు, ఆట పాటలు ప్రేక్షకులను కట్టి పడేశారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
 

Advertisement

పోల్

Advertisement