Chippada
-
ఏడు పాటలకు రూ. ఏడు లక్షలు కొట్టేసింది!
విజయనగరం : ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ సెప్టులేసి... ప్రేక్షకులతోపాటు కుర్రకారును మైమరిపించింది. ఆ సినిమాలో ఆ పాటకు డ్యాన్స్ వేసి ఆ చిత్ర నిర్మాతల నుంచి ఎంత పారితోషకం తీసుకుందో తెలియదు కానీ... విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో ఏర్పాటు చేసిన స్టేజ్‌పై ఏడు పాటలకు ముమైత్ ఖాన్ డ్యాన్స్ చేసి... ఏకంగా ఒక్కో పాటకు రూ. లక్ష చొప్పున ఏడు పాటలకు రూ. 7 లక్షలు నిర్వాహాకుల నుంచి పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం చిప్పాడ గ్రామంలో కొలువైన శ్రీ సుత్తమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికంగా ప్రోగ్రాం నిర్వాహాకులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా ముమైత్ ఖాన్ డాన్స్ ప్రోగ్రాం చూడటానికి పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చిప్పాడ చేరుకున్నారు. -
సుత్తమ్మ మారుఉత్సవంలో గుండు, గీతాసింగ్ సందడి
చిప్పాడ: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన శ్రీ సుత్తమ్మ తల్లి మారువారం ఉత్సవం సినిమా నటులు గుండు హనుమంతురావు, గీతాసింగ్, సింగర్ విజయలక్ష్మి సందడి చేశారు. చిప్పాడలో శ్రీ సుత్తమ్మ తల్లి మారువారం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ సుత్తమ్మ తల్లి ఆలయం పరిసరాలలో అంతా సందడి నెలకొంది. ఉత్సవంలో భాగంగా ‘మిలీనియం ఈవెంట్స్’ పేరుతో ఉత్సవ కమిటి ఓ సాంస్కతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గుండు హనుంతరావు తనదైన శైలిలో హస్యపుజల్లులు కురిపించారు. ఆయనకు గీతా సింగ్ సహకరించారు. వారి హాస్యానికి విజయలక్ష్మి పాటలు కూడా తోడవడంతో ఉత్సవానికిని హాజరైన భక్తులు ఆనంద డోలికల్లో మునిగి పోయారు. బుల్లి తెర చాలెంజ్ విన్నర్ శంకర్ టీం డాన్సులు, ఆట పాటలు ప్రేక్షకులను కట్టి పడేశారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.