ఈతకెళ్లి చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో
గోరంట్ల(అనంతపురం జిల్లా): ఈతకెళ్లి చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో గురువారం సాయంత్రం జరిగింది. గోరంట్ల మూలబావివీధికి చెందిన భరత్‌కుమార్(7), అల్తాఫ్(9) ఇద్దరూ గురువారం సాయంత్రం ఈత కొట్టేందుకు సమీపంలోని రావికుంటచెరువుకు వెళ్లారు. ఇద్దరూ పూడికలో ఇరుక్కుని మృతిచెందారు. బాలలు మృతిచెందిన విషయం ఎవరూ గుర్తించలేదు.
సాయంత్రం ఎనుములు చెరువులో దిగినపుడు వాటి కాళ్లకు తగులుకుని భరత్‌కుమార్ మృతదేహం ఒడ్డుకు వచ్చింది. దాంతో అల్తాఫ్ కూడా కనిపించలేదని తల్లిదండ్రులు వచ్చి చెరువులో వెదకడంతో అల్తాఫ్ మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలియడంతో తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ఇంకా ఎవరైనా పిల్లల మృతదేహాలు ఉన్నాయేమోనని రాత్రి చెరువులో గాలింపు జరుపుతున్నారు.