
కృష్ణాజిల్లా, వేజండ్ల(చేబ్రోలు): కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తికి స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన తాపీ కార్మికుడు తమ్మినేని పెద్దారెడ్డి కొద్ది రోజులు క్రితం అనారోగ్యంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించి జీజీహెచ్‌కు తరలించారు.గ్రామంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్లు తెలియటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ జి. సిద్దార్థ మంగళవారం తెలిపారు. బుధవారం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో..
గుంటూరు మెడికల్: స్వైన్ ఫ్లూ లక్షణాలతో గుంటూరు నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఇద్దరు పిల్లలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు మంగళవారం వైద్య అధికారులు నిర్ధారించారు. నంబూరు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక, తెనాలికి చెందిన ఎనిమిదినెలల మగశిశువు స్వైన్‌ఫ్లూతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment