సాక్షి, కర్నూలు : విధి నిర్వహణలో ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ‘సైరా’ సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్‌ఐలపై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లారంటూ జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకఉ చెందిన ఆరుగురు ఎస్‌ఐలు బుధవారం తెల్లవారుజామున సైరా సినిమాకు వెళ్లారు. అయితే వీరంతా సమాచారం ఇవ్వకుండా వెళ్లడంతో ఆరుగురు ఎస్‌ఐలను ఎస్పీ వీఆర్‌కు బదిలీ చేశారు. బదిలీ వేటు పడినవారిలో ...అవకు ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్‌ఐ జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్‌ఐ హరిప్రసాద్, బండి ఆత్మకూర్ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్‌ఐ ప్రియతంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ అశోక్ ఉన్నారు.
చదవండి: ‘సైరా’ మూవీ రివ్యూ
కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఏపీలో ఈ సినిమా అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్టోబర్ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు స్పెషల్ షో లకు అనుమతించింది.
థియేటర్‌లో ‘సైరా’ చిత్రం వీక్షిస్తున్న ఎస్‌ఐలు..
Comments
Please login to add a commentAdd a comment