'టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఓటు వేసే అంశంపై చర్చిస్తాం' | t.congress leaders meet tomorrow for rajya sabha elections | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఓటు వేసే అంశంపై చర్చిస్తాం'

Published Thu, Feb 6 2014 2:33 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

'టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఓటు వేసే అంశంపై చర్చిస్తాం' - Sakshi

'టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఓటు వేసే అంశంపై చర్చిస్తాం'

హైదరాబాద్:టీఆర్ఎస్ అభ్యర్థి కె.కేశవరావు(కేకే)కు ఓటు వేసే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికపై రేపు ఉదయం గోల్కొండ హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా సమావేశం కానున్నట్ల గండ్ర స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే అంశంపై చర్చిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎమ్.ఎ.ఖాన్ ను గెలిపించుకుంటామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కేకేకు ఓటేసి అంశాన్ని కూడా భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతిని గండ్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ మంత్రులు సీఎంను వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు టీడీపీ పార్టీలో తెలంగాణ టి.టీడీపీ నేతలు ఉండాలో లేదో తెలుసుకోవాలన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement