చంద్రబాబుకు దమ్ము, ధైర్యం వుంటే..
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం వుంటే..
Published Sun, Apr 2 2017 9:04 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
రాయచోటి(వైఎస్సార్ జిల్లా): నేడు అమరావతిలో జరిగిన మంత్రివర్గ విస్తరణ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన ఆనాడు తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ లో మంత్రి పదవి ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ ఉల్లంఘన అని గొంతు చించుకున్న చంద్రబాబు, నేడు ఏమిచేశారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, శాసన సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
రాయచోటిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకరితో పెళ్లి చేసుకుని, మరోకరితో కాపురం చేయడం రాజకీయ వ్యభిచారం అని రేవంత్ రెడ్డి అనలేదా.. అందుకు చంద్రబాబు నాయుడు సమర్థించలేదా ? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో మార్పు వచ్చిందా లేక మీ మనస్తత్వంలో మార్పు వచ్చిందా అంటూ ఘాటుగా స్పందించారు. ఆ న్యాయం అంధ్రప్రదేశ్ కు వర్తించదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 12 శాతం మైనారిటీలు ఉంటే ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించలేదని, ముస్లింలు, యస్.టీ.లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని వివక్ష చూపడం జరిగిందని అరోపించారు.
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం వుంటే.. ఆయన నిజంగానే నిప్పు అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో గెలవాలని ఛాలెంజ్ విసిరారు. మంత్రి వర్గ విస్తరణ చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అక్కడ వ్యభిచారం అయితే ఇక్కడ జరుగుతోంది వ్యభిచారం కాదా అని ప్రశ్నించారు. పార్టీలకు వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారిని ప్రోత్సహించకూడదన్న చంద్రబాబు, ఇప్పుడు అదే కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు రెండు నాలుకల ధోరణి అని చేప్పేందుకు ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఒడిందన్నారు. ప్రజల్లో గెలవాలన్న అలోచన చంద్రబాబుకు లేదన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టడమే చంద్రబాబుకు పనన్నారు. కాగ్ నివేదిక రుణమాఫీ బాగోతం బయట పెట్టిందని, చంద్రబాబు రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.
Advertisement
Advertisement