సాక్షి ప్రతినిధి, విజయనగరం: వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు తప్ప మరెవ్వరూ అందలమెక్కకూడ దు. ఒకవేళ సామాన్యుడ్ని సామాన్యులంతా ఎన్నుకుంటే వారికి ఏదో రకంగా అన్యాయం తలపెట్టాల్సిందే? ఏదో రకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాల్సిందే?. ఇంతవరకూ అయితే కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలే పదవులు దక్కించుకున్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల నేతలనే ఎన్నుకోవలసి వచ్చేది. కానీ వైఎస్సార్ సీపీ ఆవి ర్భావంతో ఈ రెండు పార్టీల ప్రతినిధులు వీలున్న చోటల్లా కుమ్మక్కు కుట్రలకు తెరలేపారు.
వేపాడ మండలంలోనూ ఇదే జరిగింది. మండలంలోని వావిలపాడులో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్‌గా బీల రాజేశ్వరి ఎన్నికయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈ వర్గానికి చెందిన వారిపై వేధింపులు ఎక్కువయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు కాకుండా వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి గెలుపొందడంతో ఖంగుతిన్న ఆ పార్టీల నేతలు ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్కటై తమ అభ్యర్థిగా గోగాడ పద్మావతిని గెలిపించుకున్నారు. నాటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ పనులకు అ డ్డు తగులుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ బీల రాజేశ్వరికి మద్ద తిచ్చిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు. సర్పంచ్‌తో పాటు వారి సమీప బంధువులు, మద్దతుదారులు, ఓట్లేసిన వారిని కూడా ఇబ్బందులు పెట్టి వేధిస్తున్నారు. సర్పంచ్ మద్దతుదారులైన మండల అప్పలనాయుడు, మండల సత్తిబాబుల ఇంటి పెరటి స్థలం తమదని తగాదా సృష్టించి, తమ రాజకీయ పలుకుబడి, అర్ధ బలంతో అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఇంటి పని నిలివేయించారు. వావిలపాడు గ్రామస్తులెన మండల అప్పలనాయుడు, సత్తిబాబులు ఇళ్లు కట్టుకునే సమయంలో ఆ పెరటి స్థలం తమదని, గ్రామా నికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీనేత గండి వెంకటరావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్‌లు సివిల్ తగాదా అయి నందున తమకు సంబంధం లేదని తేల్చడంతో తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు తహశీల్దార్‌ను ఆశ్రయించారు.
మాటమార్చి....
నేతల ఒత్తిళ్లతో తహశీల్దార్ ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చారు. విచారణ సమయంలో సంబంధిత మాజీ సర్పంచ్‌ను తహశీల్దార్ ప్రశ్నించినప్పుడు ఇంటి పెరడు మీదంటున్నారు. హక్కు పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే ప్రజలే మాకు డాక్యుమెంట్లు అంటూ చెప్పు కొచ్చారు. ఆ తర్వాత ఆర్డీఓ కోర్టులో మాత్రం తన పేరున ఇందిరమ్మ ఇంటి పట్టా ఉందంటూ చూపించారు. అకస్మాత్తుగా ఇదెక్కడి నుంచో వచ్చిందో అధికారులకే తెలియాలి. ప్రస్తుతం ఈ కేసు ఆర్డీఓ కోర్టులో ఉంది.
రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం
గ్రామకంఠంలోని ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ భాద్యత పూర్తిగా పంచాయితీలదే. గ్రామకంఠం భూములపై ఆజమాయిషీ చేసే హక్కు ప్రాథమికంగా రెవెన్యూ అధికారులకు లేదు. కాగా అది మరిచి ఇంటి నిర్మాణం వద్దంటూ ఏ హక్కుతో నోటీసులు ఇచ్చారో అర్ధం కాలేదు. ప్రస్తుతం సాగదీత ధోరణి అవలంభిస్తున్నారు. అన్ని ఆధారాలు చూపిస్తున్నా సామాన్యున్ని ఇబ్బందులు గురిచేయ టం ఏ తరహా న్యాయమో అధికారులకే తెలియాలి.
ఆధారాలున్నా కాదంటున్నారు
స్థలం తమది అని నిర్ధారించేలా 1961నుంచి చెల్లించిన ఇంటి పన్ను రశీదులు, తొలగించిన తాటాకుల మిద్దెఇంటి నంబర్‌తో ఓటర్లు జాబితాలో పేరు, విద్యుత్ బిల్లులు, పం చాయతీ పాలకవర్గం తీర్మానం, 1981లో వివాదాస్పద స్థలాన్ని తమ కుటుంబ సభ్యురాలికి దఖలు పరుస్తూ రాసిచ్చిన అగ్రిమెంట్ ఇలా అన్ని ఆధారాలు అప్పలనాయుడు కుటుంబీకులు చూపినా రెవెన్యూ అధికారుల్లో చలనం లే దు. మాజీ సర్పంచ్ గండి వెంకటరావు అకస్మాత్తుగా చూ పించిన ఇందిరమ్మ ఇంటిస్థలం పట్టాను పట్టుకుని విచారణ జరపడం జిల్లా రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు ఎలా దాసోహం అయ్యారో చెప్పకనే తెలుస్తోంది. ఇది కేవవలం ఉదాహరణ మాత్రమే ఇలాంటి వేధింపులు జిల్లా వ్యాప్తం గా రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. దీంతో రాజకీ య అండలేని సామాన్యులునానా అవస్థలు పడుతున్నారు.
అడ్డూ అదుపూ లేకుండా కుమ్మక్కు కుట్రలు !
Published Sun, Aug 17 2014 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement