బాబు నమ్మకాన్ని వమ్ము చేయరు | TDP district president gv Anjaneyulu commented on cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

బాబు నమ్మకాన్ని వమ్ము చేయరు

Published Thu, Mar 3 2016 1:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ప్రజలు చంద్రబాబుపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు .....

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
 
కొరిటెపాడు (గుంటూరు) :  ప్రజలు చంద్రబాబుపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పార్టీ జిల్లా  కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే సగానికిపైగా అమలు చేయటం జరిగిందని తెలిపారు. ప్రజాప్రయోజనాల కోసమే ఉచితంగా ఇసుక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి సహకరించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా రాజధానిని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎస్‌ఎం జియావుద్దీన్, దాసరి రాజామాస్టారు, శనక్కాయల అరుణ, మన్నవ సుబ్బారావు, ఇక్కుర్తి సాంబశివరావు, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement