పింఛన్ల తొలగింపుపై రభస | TDP government cancelled pensions in vizianagaram | Sakshi
Sakshi News home page

పింఛన్ల తొలగింపుపై రభస

Published Thu, Oct 9 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

పింఛన్ల తొలగింపుపై రభస

పింఛన్ల తొలగింపుపై రభస

 ఏనుగువలస (గరివిడి) : మండలంలోని ఏనుగువలసలో బుధవారం జరిగిన జన్మభూమి సభ రచ్చ రచ్చగా సాగిం ది. పంచాయతీ పరిధిలోని బాగువలస, కందిపేట మధుర గ్రామాల్లో సుమారు 30 మంది అర్హులకు పింఛన్లు తొల గించారు. ఈ విషయమై లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకు లు అధికారులను నిలదీశారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా.. ఎందుకు పింఛన్ తొలగించాలని ప్రశ్నించారు. జాబితాలో కొంతమంది మృతి చెందినట్టు పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు జాబితాలు తయూరు చేయడం సరికాదని ఆరోపించారు. ఈ సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు లబ్ధిదారులను అడ్డుకో వడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకదశలో అరుపులు, కేకలతో ఇరువర్గాలు తోపులాటకు దిగారు. సభలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎస్‌ఐకి సమాచా రం ఇచ్చారు. వెంటనే ఎస్‌ఐ కృష్ణవర్మ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలను సముదారుుంచారు. సుమారు మూడు గంటల అనంతరం సభ సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ పైల బలరాం, తహశీల్దారు కల్పవల్లి, తదితరులు పాల్గొన్నారు.
 
 పాత శ్రీరంగరాజపురంలో రసాభాస
 గజపతినగరం రూరల్ : మండలంలోని పాతశ్రీరంగరాజపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. పింఛన్ల తొలగింపుపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. గ్రామానికి చెందిన 43 మంది అర్హుల పింఛన్లు ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు. తహశీల్దార్ ఆర్‌ఎల్‌ఎల్‌ప్రసాద్ పాత్రో సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా.. వినలేదు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వారికి తప్పకుండా పింఛన్ వచ్చేలా చూస్తామన్నారు. అనం తరం గ్రామస్తులు స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె డ్పీటీసీ మక్కువ శ్రీధర్, ఎంపీపీ, గంట్యాడ శ్రీదేవి, ప్రత్యేకాధికారి లక్ష్మణరావు, సర్పంచ్ ఏనుగుల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్,వైఎస్సార్ సీపి నాయకుడు గిడిజాల కామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
 రేజేరులో జన్మభూమి బహిష్కరణ
 బాడంగి : మండలంలోని పినపెంకి, రేజేరు గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో స్థానికులు పింఛన్ల తొలగింపుపై అధికారులను నిలదీశారు. పినపెంకిలో వైఎస్సార్ సీపీకి చెందిన అర్హులైన పింఛన్‌దారుల పేర్లును జాబితాలో తొలగించడంతో ఆ పార్టీ నాయకులు కుప్ప సింహాచలం, చప్ప రాజరత్నంనాయుడు, బోగాది సత్యం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఎంపీడీఓ బాబూరావుతో పాటు పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల పేర్లును జాబితా నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెం టనే అక్కడే ఉన్న ఎస్‌ఐ పాపారావు పరిస్థితిని అదుపు చేశా రు. ఎంపీడీఓ అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పడంతో లబ్ధిదారులు శాంతించారు. రేజేరులో టీడీపీకి చెం దిన ఎంపీపీ వర్గం వారు వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ వర్గం వారికి కమిటీలో ప్రాధాన్యత కల్పించకపోగా ఏకపక్షంగా పింఛన్లు తొలగించడాన్ని నిరసిస్తూ.. సభను బహి ష్కరించారు.     సభకు హాజరైన కొద్ది మంది కూడా తహశీల్దార్ రఘురాంను మాట్లాడనీయకుండా ముందు వికలాంగుడు చం ద్రశేఖర్‌కు పింఛన్ వచ్చేలా చూడాలని, ఆ తరువాతే సభ నిర్వహించాలని పట్టుబట్టారు. అధికారులు ఎంత చెప్పి నా.. గ్రామస్తులు వినకపోవడంతో సభను అర్ధాంతరంగా ముగించారు.
 
 
 గ్రామాల అభివృద్ధి కోసమే జన్మభూమి
 పికె. పాలవలస (చీపురుపల్లి రూరల్) : గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుం దని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. బుధవారం పికె పాలవలస, గొల్లలపాలెం గ్రామా ల్లో జరిగిన జన్మభూమి సభల్లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, చెట్టు-నీరు, పేదరికంపై గెలుపు తదితర కార్యక్రమాలను గ్రామాలను అభివృద్ధి చేయూలన్న ఉద్దేశంతోనే ప్రవేశపెట్టిందన్నారు. వికలాంగులు, వృద్ధులు, వి తంతు పింఛన్లు పెంచిన ఘతన చంద్రబాబుదేనని చెప్పా రు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత అవసరమో గ్రామాభివృద్ధి కూడా అంతే అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డు సౌకార్యం తప్పక ఉండాలని సూచించారు.
 
 త్వరలో గ్రామాలకు పెద్ద మొత్తంలో డస్టుబిన్లు పంపిణీ చేస్తామని, దీని వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తదని చెప్పారు. రైతుల రుణమాఫీకి బ్యాం కులు ముందుకు రాకపోయినప్పటికీ ప్రభుత్వం మొదట విడతగా రూ. 20 వేల కోట్లు చెల్లిస్తుందన్నారు. అనంత రం మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. కాగా సభ ము గిస్తుండగా కొంతమంది లేచి తాము అర్హులమైనప్పటికీ పింఛన్లు రాలేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి అర్హులై ఉండి పింఛన్ రాకపోతే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, తహశీల్దార్ డి. పెంటయ్య, ఎంపీడీఓ కె. రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement