పీలేరు: ఉత్తరాంధ్ర జిల్లాలలో తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. తిత్లీ తుపాను బాధితులకు సకాలంలో సహాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడే మకాం వేశామని చెప్పుకున్న సీఎం ఆయన మంత్రులు సాధించింది ఇదేనా అని ఎద్దేవా చేశారు. తుపాను ధాటికి సర్వం కోల్పోయిన బాధిత కుంటుంబాలను ఆదుకోకుండా పబ్లిసిటీ కోసం వీరంతా పాకులాడడం శోచనీమన్నారు. ఆకలితో అలమటిస్తున్న బాధిత కుటుంబాలు నిలదీస్తే అంతు చూస్తానంటూ బెదిరించడం సీఎం నియంత పోకడలకు నిదర్శనమన్నారు. శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం అంటూ అత్తారింటి వెళ్లి వచ్చినట్లు ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏడాదికి మూడు పంటలు సాగయ్యే విలువైన భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టే నవరత్నాల పథకంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకూ లబ్ది చేకూరుతుందని తెలిపారు. పేదరికమే కొలబద్దగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు లాంటి అసమర్థ సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం స్వార్థం కోసం హోదాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని రాజులపల్లె పంచాయతీ పెద్ద హరిజనవాడ, రాజులపల్లెకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి వైఎస్సార్‌సీపీ కుండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీలో దాదాపు అందరూ వైఎస్సార్‌సీపీలో చేరిపోవడంతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. పార్టీలో చేరిన వారిలో హేమంత్, మల్లయ్య, యర్రయ్య, నారాయణ, హేమచంద్ర, సుబ్రమణ్యం, రెడ్డెప్ప, రమణయ్య, దామోదర, చిన్నరమణయ్య, అమృత, నరసప్ప నాయునివారు, అయ్యా చిన్నరెడ్డెప్ప, నరసమ్మ, చిన్న చెంగల్‌రాయులు, జయమ్మ, కళావెంకట్రామయ్య, గంగయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, ఎంపీపీ మురళీధర్, పార్టీ మండల కన్వీనర్ మురళీ
మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment