Storm Victims
-
తుపాను బాధితుల సాయంలో విఫలం
పీలేరు: ఉత్తరాంధ్ర జిల్లాలలో తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. తిత్లీ తుపాను బాధితులకు సకాలంలో సహాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడే మకాం వేశామని చెప్పుకున్న సీఎం ఆయన మంత్రులు సాధించింది ఇదేనా అని ఎద్దేవా చేశారు. తుపాను ధాటికి సర్వం కోల్పోయిన బాధిత కుంటుంబాలను ఆదుకోకుండా పబ్లిసిటీ కోసం వీరంతా పాకులాడడం శోచనీమన్నారు. ఆకలితో అలమటిస్తున్న బాధిత కుటుంబాలు నిలదీస్తే అంతు చూస్తానంటూ బెదిరించడం సీఎం నియంత పోకడలకు నిదర్శనమన్నారు. శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం అంటూ అత్తారింటి వెళ్లి వచ్చినట్లు ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏడాదికి మూడు పంటలు సాగయ్యే విలువైన భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టే నవరత్నాల పథకంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకూ లబ్ది చేకూరుతుందని తెలిపారు. పేదరికమే కొలబద్దగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు లాంటి అసమర్థ సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం స్వార్థం కోసం హోదాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక పులిచెర్ల(కల్లూరు): మండలంలోని రాజులపల్లె పంచాయతీ పెద్ద హరిజనవాడ, రాజులపల్లెకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి వైఎస్సార్సీపీ కుండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీలో దాదాపు అందరూ వైఎస్సార్సీపీలో చేరిపోవడంతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. పార్టీలో చేరిన వారిలో హేమంత్, మల్లయ్య, యర్రయ్య, నారాయణ, హేమచంద్ర, సుబ్రమణ్యం, రెడ్డెప్ప, రమణయ్య, దామోదర, చిన్నరమణయ్య, అమృత, నరసప్ప నాయునివారు, అయ్యా చిన్నరెడ్డెప్ప, నరసమ్మ, చిన్న చెంగల్రాయులు, జయమ్మ, కళావెంకట్రామయ్య, గంగయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, ఎంపీపీ మురళీధర్, పార్టీ మండల కన్వీనర్ మురళీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏమిటో ఈ మాయ!
శ్రీకాకుళం:ఈ ఫొటోల్లోని బ్యాన ర్లు చూశారా?.. ఒక దాంట్లో 25 కేజీల బియ్యం, మరో దాంట్లో 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఒక దాంట్లో కందిపప్పు, కారంపొడి ఉంటే.. మరో దాంట్లో ఉల్లి, బంగాళదుంపలు ఉన్నాయి. మొదటిది శ్రీకాకుళం పట్టణంలోని ఫాజుల్‌బాగ్‌పేట రేషన్ డిపో వద్ద ఏర్పాటు చేయగా.. రెండోదాన్ని ఇదే పట్టణంలోని శివాలయం వీధి రేషన్ డిపో వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెండూ తుపాను, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలే. అందువల్ల ఈ రెండు డిపోల పరిధిలో ఒకేరీతిలో తుపాను సహాయ నిత్యావసరాలు అందాలి. కానీ బ్యానర్లలో అన్ని తేడాలు ఎందుకున్నట్లు?.. బ్యానర్లే కాదు. నిత్యావసర సరుకుల పంపిణీ మొత్తం ఇలాగే అస్తవ్యస్తంగా ఉంది. బాధితులకు అందాల్సిన సరుకులు పక్కదారి పడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌కి తరలిపోతున్నాయి. బాధితులందరికీ ఒకేరీతిలో సాయం అందడం లేదు. కొందరికి క ందిపప్పు, కారంపొడి అందడం లేదు. ఇంకొందరికి ఉల్లి, బంగాళ దుంపలు అందడం లేదు. బియ్యం కొందరికి 25 కేజీలు ఇస్తే.. మరికొందరికి 10 కేజీలే ఇస్తున్నారు. తుపాను బాధిత ప్రాంతాల్లో తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికే సరుకులు ఇవ్వాలని మొదట ఆదేశించిన ప్రభుత్వం ఆ తర్వాత గులాబీ కార్డుదారులకు కూడా అందజేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో 25 కేజీలు మిగిలిన ప్రాంతాల్లో 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తేడాను డీలర్లు, పంపిణీ బాధ్యత తీసుకున్న కమిటీల సభ్యులు వినియోగించుకుంటున్నారు. ఇష్టానుసారం సరుకులు పంపిణీ చేస్తూ.. మిగిలిన వాటిని మార్కెట్‌కు తరలిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో పంపిణీ తీరును పరిశీలిస్తే ఫాజుల్‌బేగ్‌పేటలో 25 కేజీలు బియ్యం ఇస్తుండగా, శివాలయం వీధిలో 10 కేజీలు ఇస్తున్నారు. వాస్తవానికి ఫాజుల్‌బాగ్‌పేట కంటే ముందు శివాలయం వీధి ముంపునకు గురవుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. కానీ అధికారులు మాత్రం ఈ వీధికి బియ్యం తగ్గించారన్నది స్థానికులకు అర్థం కావడం లేదు. రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీలో కూడా వ్యత్యాసం ఉంటోంది. ఓ చోట ఉల్లిపాయలు, బంగాళదుంపలు, బియ్యం, పంచదార మాత్రమే ఇస్తుండగా, మరికొన్ని చోట్ల నూనె, ఉప్పు, కారం ఇస్తున్నారు. కొన్ని డిపోల్లో మాత్రమే కందిపప్పు అందజేస్తున్నారు. అక్కడ పంచదార ఇవ్వడం లేదు. అధికారులు మాత్రం అన్ని డిపోలకు సమానంగా సరుకులు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారు. మరి ఆ సరుకులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో అంతుచిక్కడం లేదు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు మాత్రం బహిరంగ మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. కొందరు డీలర్లు, టీడీపీ కమిటీల సభ్యులు సరుకులను విపణి వీధికి తరలిస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. జన్మభూమి కమిటీల సభ్యులే రేషన్ సరుకుల పంపిణీలో హవా చలాయిస్తుండగా వీరిలో కొందరు సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చేనేతలకు అందని 50 కేజీల బియ్యం జిల్లాలోని చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో బాదుర్లపేట మినహా మిగిలిన ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వలేదు. బాదుర్లపేటలో కూడా ఈ నెల 23న ముఖ్యమంత్రి వస్తున్నారని తెలియడంతో వేకువజామున ఇంటింటికి పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి బాదుర్లపేటలో పర్యటిస్తారని తొలుత ప్రచారం కావడంతో ఆగమేఘాల మీద పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లోని చేనేత కార్మికులు తమ మాటేమిటని ప్రశ్నిస్తే మీరున్నట్టు ముందుగా తమకు ఎవ్వరూ చెప్పలేదని అధికారులు, ప్రజాప్రతినిధులు అంటుండడం విడ్డూరం. ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలా జరగనప్పుడు ప్రజాప్రతినిధులు అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా న్యాయం చేయాల్సిన ఇద్దరూ ఒకే మాట చెబుతుండడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. -
కరెంట్ కట్‌కట!
శ్రీకాకుళం:అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఏదీ లేదు అన్నట్లుంది తుపాను బాధితులకు సాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి. బాధితులకు అండగా ఉంటాం.. అన్నీ సమకూరుస్తామని డాంభికాలు పలుకుతున్న సీఎం మాటలు కోటలు దాడుతున్నాయే తప్ప చేతలు గడప దాటడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, బాధిత ప్రాంతాల్లో పర్యటనల తీరే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తుపాను గాలులకు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామని ప్రభుత్వం చెప్పుకొంటున్నా వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే బాధితులను పరామర్శించేందుకు రెండుసార్లు జిల్లాకు వచ్చిన సీఎం మొదటిసారి రెండు ప్రాంతాల్లో, రెండోసారి ఒకే గ్రామంలో మొక్కుబడిగా పర్యటించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీడని విద్యుత్ సంక్షోభం హుదూద్ తుపాను సందర్భంగా వీచిన పెనుగాలుల కారణంగా ఈ నెల 11న రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తర్వాత గాలులకు విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో జిల్లా అంతటా సరఫరా నిలిచిపోయింది. ఐదు రోజుల తర్వాత గత గురువారం రాత్రి మొదట శ్రీకాకుళం పట్టణానికి సరఫరా పునరుద్ధరించారు. తర్వాత మిగిలిన మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు పునరుద్ధరించారు. అయితే ఆ ముచ్చట ఒక్కరోజు కూడా నిలవలేదు. గత కొద్దిరోజులుగా జిల్లాకు అవసరమైన రెగ్యులర్ కోటాలో 30 శాతం విద్యుత్ మాత్రమే గ్రిడ్ నుంచి ఇస్తుండటంతో రోజులో అధిక భాగం కోతలే విధించాల్సి వస్తోంది. జిల్లాకు రోజుకు 230 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇందులో వ్యవసాయ, పరిశ్రమ విద్యుత్‌ను మినహాయిస్తే గృహ, వాణిజ్య సర్వీసులకు 120 మెగవాట్లు అవసరం. అయితే శ్రీకాకుళం పట్టణానికి సరఫరా పునరుద్ధరించిన రోజు 50 మెగావాట్లు సరఫరా కాగా.. ఆ తర్వాత నుంచీ జిల్లా మొత్తానికీ 40 నుంచి 60 మెగావాట్లు మాత్రమే ఇస్తున్నారు. గ్రామాలకు ఇంకా సరఫరా పునరుద్ధరించనేలేదు. అయినా ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్ జిల్లా అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఫలితంగా పునరుద్ధరణ జరిగిన పట్టణాలు, మండల కేంద్రాల పరిస్థితి కూడా కరెంటు లేనట్లుగానే ఉంటోంది. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో అధికారులే చెప్పలేని పరిస్థితి నెలకొంది. రోజుకు 15 నుంచి 18 గంటల వరకు కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి వేళ కోతలు విధించరాదని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా జిల్లాలో గత రెండు రోజులుగా రాత్రి పూట కూడా 5 నుంచి 6 గంటలు కోత విధిస్తున్నారు. దీపావళి రోజు రాత్రి 9.30 గంటల నుంచి 11.30 వరకు కోత అమలు చేసిన అధికారులు, ఆ తర్వాత మళ్లీ అర్ధరాత్రి 2 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు సరఫరా నిలిపివేశారు. వ్యవసాయ, పరిశ్రమల విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అతితక్కువ విద్యుత్ ఇస్తుండటం వల్ల గ్రామాలకు సరఫరా పునరుద్ధరణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించాలని అంతవరకు విశాఖ నుంచి కదిలేది లేదని శపథం చేసిన ముఖ్యమంత్రి పాక్షికంగా పునరుద్ధరణ జరగడంతోనే పనైపోయిందనుకుంటున్నట్లు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగతా జిల్లాల్లో ఈ స్థాయిలో కోతలు లేకున్నా.. తుపాను ప్రభావిత జిల్లాలకే విధించడాన్ని విమర్శలకు తావిస్తోంది. రెండుసార్లు పర్యటించినా..మరోవైపు బాధితులకు పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు రెండుసార్లు జిల్లాకు వచ్చారు. తొలి పర్యటనలో పొందూరు మండలం మొదలవలస గ్రామం, శ్రీకాకుళం పట్టణంలోని కృష్ణాపార్కు ప్రాంతం సందర్శించారు. అయితే చీకటి పడిన తర్వాత వచ్చిన ఆయన ఇలా చూసి.. అలా వెళ్లిపోయారు. అలాగే దీపావళి రోజు శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామాన్ని సందర్శించారు. కొద్ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు. రెండు పర్యటనల్లోనూ పాత హామీలే తప్ప కొత్త వరాలేమీ ఇవ్వలేదు. కనీసం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయమైనా ప్రస్తావించలేదు. ఈమాత్రం దానికి హెలికాప్టర్లలో తిరుగుతూ నిధులు దుర్వినియోగం చేయడమెందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా దీపావళి పండుగ రోజు వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టడాన్ని అధికార యంత్రాంగంతోపాటు అధికార పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. -
బాధితుల పరేషన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్కారు వైఫల్యం, అధికారుల ప్రణాళిక లోపం కలిసి తుపాను, వరద బాధితులను మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. తుపాను వచ్చి 12 రోజులైంది. ఆ వెంటనే నాగావళి వరదలతో జిల్లాలో 11 మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ఆర్భాటంగా సహాయం ప్రకటించినా.. సరైన వసతి, రవాణా సదుపాయాలు కల్పించకుండా పంపిణీ వేగవంతం చేయాలని ఒత్తిళ్లు పెంచుతున్నారు. తీరప్రాం తాలకు సరుకులు అందుతున్నా మైదాన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ తీర మండలాలు మినహా మిగిలిన మండలాల్లో బియ్యం, ఉల్లి, బంగాళాదుంపలు, పామాయిల్, కారం, ఉప్పు వంటి సరుకులు అందడంలేదు. పంపిణీ జరుగుతున్న ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో లేకపోవడంతో రేషన్ షాపుల వద్ద బాధితులు బారులుతీరి సరుకుల కోసం ఎగబడుతున్నారు. గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తున్నారు. కమిటీలకు పంపిణీ బాధ్యతలు సరుకుల పంపిణీ బాధ్యతను జన్మభూమి-మాఊరు గ్రామ కమిటీలకు అప్పగించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రాబల్యంతో ఏర్పడిన ఈ కమిటీలపై పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపు విషయంలో పక్షపాతం చూపారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఈ కమిటీలకు సరుకుల పంపిణీని కూడా అప్పగించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో సుమారు 8.40 లక్షల రేషన్ కార్డులు(తెలుపు, గులాబీ, ఆంత్యోదయా, అన్నపూర్ణ) ఉన్నాయి. కాగా తుపాన్, అనంతరం వచ్చిన నాగావళి, వంశధార వరదల కారణంగా 22 మండలాల్లో 196 గ్రామాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 13 వార్డుల్లోనూ కలిపి మొత్తం 57,127 కుటుంబాలు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో మత్య్సకార కుటుంబాలు 33 వేలు ఉన్నాయి. తుపాను సాయం, సరుకులు మత్స్యకారులకు చాలా వరకు అందగా, మిగిలిన బాధితులకు మాత్రం అరకొరగానే అందింది. మత్య్సకారులకు, చేనేత కార్మికులకు {పత్యేక ప్యాకేజీ తుపాన్, వరదల్లో నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, లీటరు పామాయిల్, కందిపప్పు, పంచదార, కారం, ఉప్పు, ఇతర సరుకులతోపాటు ఉల్లిపాయలు, దుంపలు అంద జేయాలి. వీరు కాకుండా మిగిలిన బాధితులకు కుటుంబానికి 25 కేజీల బియ్యం, పామాయిల్, పంచదార, కారం, ఉప్పు కందిపప్పు, తదితర సరుకులు అందజేయాలి. మిగిలిన 7.80 లక్షల కార్డుదారులకు పింక్, తెలుపు అన్న తేడా లేకుండా కార్డుకు 10 కిలోల బియ్యం, పంచదార, పామాయిల్, కారంతోపాటుగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. సరఫరాలో జాప్యం ఇప్పటివరకు జిల్లాకు 30 లారీల్లో సుబారు 480 మెట్రిక్ టన్నుల సరుకలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళా దుంపలు ఉన్నాయి. అయితే వీటిని మండలాలకు చేరవేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కలాసీలు, రవాణా సదుపాయం లేకపోవడం కారణంగా చెబుతున్నారు. ఆదే విధంగా ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరిపడినంతగా బియ్యం నిల్వలు లేవు. దీంతో తహశీల్దార్లు మంజూరు చేసిన ఆర్ఓలు పట్టుకొని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. -
వరద బాధితులకు కోపం వచ్చింది!
సంతకవిటి : తుపాను బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. తమ గ్రామాన్ని ముంపు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడంపై ఆందోళనకు దిగారు. ఏకంగా రెవెన్యూ అధికారిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గలేదు. ఈ సంఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే.. సంతకవిటి మండలం వాసుదేవపట్నం గ్రామం ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా ముంపునకు గురైంది. నాగావళి నది గండి ద్వారా వచ్చిన నీటితో పాటు సాయన్న చానల్, నారాయణపురం కుడి కాలువుల నుంచి వచ్చిన నీరు గ్రామం చుట్టూ చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. ఆ సమయంలో గ్రామం వరకూ రహదారి బాగుండడంతో ముంపు గ్రామాలను అధికారులు పరిశీలించారు. వాసుదేవపట్నం గ్రామం నుంచి సహాయ చర్యలు ప్రారంభించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అరుుతే ముంపు గ్రామాలను గుర్తించే సమయంలో ఈ ఊరును పక్కన పెట్టి మండలంలో 12 నదీతీర గ్రామాలను ముంపు గ్రామాలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వాసుదేవపట్నం గ్రామానికి చెందిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ, టీడీపీలకు చెందిన నేతలు బుధవారం సాయంత్రం తహశీల్దార్ బి.రామారావుతో మంతనాలు జరిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు సంతకవిటి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వీఆర్వో ఇందుధరుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక నివేదిక మీరే ఇస్తారని, తమ గ్రామాన్ని ఎందుకు ముంపు గ్రామంగా గుర్తించలేదని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న వీఆర్వో తాను వాసుదేవపట్నాన్ని ముంపు గ్రామంగా గుర్తించి నివేదిక అందించానని తెలిపారు. ఇంతలో కార్యాలయూనికి చేరుకున్న తహశీల్దార్ బి.రామారావును రైతులు ముట్టడించారు. తమ ఊరును ముంపు గ్రామంగా ఎందుకు గుర్తించలేదని నిలదీశారు. తుపాన్ల సమయంలోనే కాకుండా మడ్డువలస కాలువలు నీరు విడిచిపెట్టిన సమయంలో కూడా ఏటా తమ గ్రామానికి చెందిన పంటపొలాలు ముంపునకు గురౌతున్నాయని వివరించారు. హుదూద్ తుపాను కారణంగా కురిసిన వర్షాలతో ప్రస్తుతం తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురైనా ఎందుకు ముంపు గ్రామాల జాబితాలో చేర్చలేదని ప్రశ్నించారు. ఒకగానొక సందర్భంలో ఆయనపై దాడికి ప్రయత్నించారు. కార్యాలయం మెట్లు ఎక్కుతున్న తహశీల్దార్‌ను కిందకులాగే ప్రయత్నం చేశారు. వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్ తదితరులతో పాటు గ్రామపెద్దలు కలుగుజేసుకోవడంతో రైతులు వెనక్కుతగ్గారు. అరుుతే తహశీల్దార్ తన చాంబర్లోకి వెళ్లగా అక్కడకు కూడా వెళ్లి బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుళ్లు వచ్చి పరిస్థితి అదుపుతప్పకుండా అదుపు చేశారు. రైతులకు నచ్చజెప్పి మంతనాలు ప్రారంభించారు. వాసుదేవపటాన్ని ముంపు గ్రామం పరిధిలోకి తీసుకువచ్చేందుకు తన చేతిలో ఏమీలేదని, పాలకొండ ఆర్డీఓ కూడా వచ్చి పరిశీలనజరిపారని, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తానని తహశీల్దార్ రైతులకు హామీఇచ్చారు. అయినప్పటికీ రైతులు అక్కడే బైఠాయించి ముంపు గ్రామాలకు ఇస్తున్న తక్షణసాయం తమకూ అందించాలని పట్టుబట్టారు. ఎస్ఐ పి.సురేష్‌బాబు కలుగుజేసుకుని ఉన్నతాధికారులకు సమస్యను ఫోన్ ద్వారా వివరించారు. అరుుతే తమకు న్యాయం జరిగేవరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతులు స్పష్టం చేస్తూ సాయంత్రం వరకూ తహశీల్దార్ కార్యాలయం వద్దే బైఠారుుంచారు. దీంతో తహశీల్దార్ రామారాావు ఆందోళనకారులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి గ్రామాన్ని వరద ముంపు జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయూరు. -
తుపాను బాధితులకు తాజా విరాళాలు
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం-5 లక్షలు తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్-3 లక్షలు నటుడు, ఎంపీ మురళీమోహన్ -25 లక్షలు (ఎంపీ లాడ్స్), రెండు నెలల జీతం (సుమారు 1 లక్ష) హీరో సచిన్ జోషీ-15 లక్షలు దర్శకుడు సురేందర్‌రెడ్డి-5 లక్షలు దర్శకుడు శివ కొరటాల-3.5 లక్షలు దర్శకుడు శ్రీవాస్-2.5 లక్షలు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్-2 లక్షలు కెమేరామేన్ ఛోటా కె. నాయుడు-1 లక్ష దర్శకుడు మలినేని గోపీచంద్-1 లక్ష హీరో నాగశౌర్య-1 లక్ష నటుడు అలీ-1 లక్ష -
పర్యటనలకే ప్రాధాన్యం అందని సహాయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాయకుల పరామర్శలు, పర్యటనలు తుపాను పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. నేతల చుట్టూ తిరగడంతోనే అధికారుల పుణ్యకాలం కాస్తా కరిగిపోతోంది. రోజంతా నాయకుల సేవలోనే వారు గడుపుతుండడంతో తుపాను పనులను ఆటంకం కలుగుతోంది. దీంతో తుపాను వెళ్లి నాలుగు రోజులు గడిచినా పునరుద్ధరణ, పునరావాస కార్యక్రమాలు ఊపందుకోవడం లేదు. ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రుల వరకు జిల్లాకొస్తుండడం వల్ల మేలు జరుగుతుందనుకుంటే పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటనే దీనికి ఉదాహరణ. ఈ నెల 13న భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో పర్యటిస్తారని షెడ్యూల్ ఇచ్చారు. దీంతో అధికారులు ఆయన పర్యటన కోసం నానా హైరానా పడ్డారు. సీఎం పర్యటనా ప్రశాం తంగా సాగిపోవాలని అధికారులంతా ఆయా మండలాల్లో మకాంపెట్టి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తీరా అంతా సిద్ధం చేసిన సీఎం తన పర్యటనను రద్దు చేశారు. ఇక మరుసటి రోజైన 14వ తేదీన(మంగళవారం) జరుగుతుందని ప్రకటించారు. దీంతో అధికారులు మళ్లీ హడావుడి చేశారు. జిల్లా అధికారులతో పాటు పోలీసులంతా సీఎం పర్యటనా ప్రాంతాల్లోనే ఉండిపోయారు. తీరా ఏర్పాట్లన్నీ అయ్యాక సీఎం పర్యటన రద్దయ్యిందని ప్రకటించారు. దీంతో అధికారులందరికీ ఆ రోజు వృథా అయ్యింది. ఫలితంగా ఆ రెండు రోజులు అధికారులు పునరుద్ధరణ, పునరావాస కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఇక ముచ్చటగా మూడోసారి సీఎం పర్యటనా షెడ్యూల్ ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు భోగాపురం మండలం దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో పర్యటిస్తారని షెడ్యూల్ ఇచ్చారు. అయితే, ఆ సమయానికి రాలేదు. మధ్యాహ్నం 2.26 నిమిషాలకు దిబ్బలపాలెం వచ్చి పది నిమిషాలు పాటు గ్రామ గట్టున నిలబడి బాధితులకు కాసింత భరోసా ఇచ్చే మాటలు చెప్పి మమ అన్పించేవారు. ఆ తర్వాత ముక్కాం గ్రామానికెళ్లి మత్స్యకారులను పలకరించారు. అక్కడ కాసేపు మాట్లాడి కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ఇలా మూడు రోజుల పాటు సీఎం పర్యటనా బిజీలో పడి అధికారులు పునరుద్ధరణ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇక మంత్రులు అశోక్ గజపతిరాజు, పల్లె రఘునాథరెడ్డి, చిన రాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు జిల్లాలో మకాం వేశారు. వాళ్లు రావడం మంచిదే గాని వారి చుట్టూ తిరిగి అధికారులు సమయాన్ని వృథా చేసుకుంటున్న పరిస్థితి నెలకుంది. సమీక్షల పేరుతో అధికారులు దగ్గర్నే ఉంచుకోవడం, వారి సేవల కింద కొంతమంది అధికారులు నిమగ్నమవ్వడంతో పునరుద్ధరణకు సిబ్బంది సరిపోలేని పరిస్థితి నెలకొంది. ఇక, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారుల వల్ల అదే రకమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొత్తానికి పునరుద్ధరణ పనులు ఊపందుకోవడం లేదు. ప్రజల కష్టాలు తీరడం లేదు. -
మిగిలింది నిరాశే...!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మూడు రోజులగా ఎదురుచూసిన తుపాను బాధితులకు చంద్రబాబు పర్యటన నిరాశ పరిచింది. ఆయనొచ్చి మేలు చేస్తాడని ఆశపడిన బాధితులకు ఒరిగిందేమి లేకుండాపోయింది. బాధితులు తమగోడును చెప్పుకోలేకపోయారు. ఆ అవకాశాన్ని చంద్రబాబు కల్పించలేదు ముఖ్యంగా దిబ్బలపాలెం గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి చెందారు. మూడు రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన చంద్రబాబు పర్యటన ఎట్టకేలకు బుధవారం జరిగింది. భోగాపురం మండలం దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో పర్యటించారు. అయితే ఆయన వస్తారని.... పెద్దఎత్తున నష్టపోయిన కొబ్బరి, అరటి పంటకు సరైన పరిహారం ప్రకటిస్తారని దిబ్బలపాలెం రైతులు ఆశతో ఎదురుచూశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 2.26 నిమిషాలకు వచ్చారు. అంతవరకు ఎండలోనే గ్రామస్తులు అంతా పడిగాపులు కాశారు. పోని వచ్చిన తరువాత అయినా చంద్రబాబు సంతోషపర్చారంటే అదీ లేదు. నష్టపోయిన కొబ్బరి, అరటి పంటను పొలాల్లోకి వెళ్లి చూసేందుకు బాబు ఆసక్తి చూప లేదు. గ్రామంలో ఉన్న గట్టు నుంచే చూసేసి మైకును అందుకున్నారు. బాధితులకు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా అన్నీ చూసుకుంటానని.. అన్నీ చేసేస్తానని ఏకపక్షంగా చెప్పుకొచ్చారు. బాధితుల గోడును వినేందుకు ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు. అయినప్పటికీ కొంతమంది తమకు జరిగిన నష్టాన్ని చెప్పేందుకు ప్రయత్నించినప్పుడు పూర్తిస్థాయిలో వినకుండా ఆ...అనేసి అన్నీ నేను చూసుకుం టానని మీరేమి భయపడొద్దని దాట వేసి 10 నిముషాల్లోనే పర్యటనను మమ అనిపించేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు గుర య్యారు. తామేమి చెప్పకుండానే అంతా చేసేస్తానని, చూసేస్తానని చంద్రబాబు అంటే ఎవ్వరేం చేయగలరని స్థానికులు వాపోయారు. పడిపోయిన కొబ్బరి చెట్టుకు రూ.1000 పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు చేతులు దులుపుకుంటే ఎలా అని.. ఆ చెట్టును తొల గించడానికే ప్రభుత్వం ఇచ్చిన సాయం సరిపోతుందని తమకు నష్ట నివారణ జరిగేది ఎలా అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విష యాన్ని చె ప్పుకుందామంటే చంద్రబాబు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. తమకు మొత్తానికి ఐదారు గంటలుగా వేచి ఉన్న చంద్రబాబు పర్యటన కేవలం 10 నిముషాల్లో ముగియడం దానికంత ఏర్పాట్లు, అధికారుల హైరానా అవసరమా అని పలువురు పెదవి విరిచారు. అనంతరం ముక్కాం గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో పలువురితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ముంజేరులో కొంతమంది చంద్రబాబు కాన్వాయిని ఆపి తమ గోడును వినాలని మొరపెట్టుకున్నారు. దీంతో స్థానికుల గోడు విన్న తరువాత చంద్రబాబు స్పందిస్తుండగా వెనుక నుంచి ఒక వ్యక్తి ‘మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలంటూ గ ట్టిగా అన్నాడు’ ఇది విన్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వు పిల్లకుంకవు.. నాకు చెప్పినంతతోడివా...ఎక్కువ మాట్లాడుతున్నావ్... ఊరు కో అంటూ ఘాటుగా మాట్లాడారు. బాధితుల ఆవేదనను పాజిటివ్‌గా తీసుకోవాల్సిన చంద్రబాబు సీరియస్‌గా మాట్లాడడంపై స్థానికులు కాసింత అసహనం వ్యక్తం చేశారు. ముక్కాం చేరుకున్నాక మత్స్యకారులతో మాట్లాడి వారికి అందించే సాయాన్ని ప్రకటించి మృతుల కుటుంబీకులకు పరిహారాన్ని అందజేసి మమ అనిపించేశారు. -
20లోగా పరిహారం
సాక్షి, గుంటూరు :జిల్లాలోని తుపాను బాధిత రైతాంగానికి డిసెంబరు 20వ తేదీలోగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి టీజీ వెంకటేశ్ హామీ ఇచ్చారు. 2012-13 సంవత్సరం నుంచి రైతులకు చెల్లించాల్సిన రూ. 28.22 కోట్లతో పాటు అక్టోబరులో కురిసిన భారీ వర్షాల సాయాన్ని కూడా కేంద్రం నుంచి రప్పించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తామని పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో కలెక్టర్ సురేశ్‌కుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి(డీఆర్సీ) సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీజీ వెంకటేశ్ బాధిత రైతాంగానికి ఈ మేరకు హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు జిల్లాలోని 23500 మంది కౌలు రైతులకు రుణాలివ్వాల్సిన బ్యాంకులు కేవలం 9,869 మందికి మాత్రమే రుణాలిచ్చి చేతులు దులుపుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలం తుపాను సాయాన్ని పలు బ్యాంకులు అవుట్ స్టాండింగ్ సర్దుబాటు చేసుకుంటున్నాయని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు మాట్లాడుతూ, కౌలు రుణ చట్టాన్ని అమలు చేయించడం చేతగాకపోతే ఎలాగంటూ అధికారుల్ని నిలదీశారు. సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎస్బీఐ, ఎస్‌బీహెచ్‌ల తీరు ఆక్షేపణీయంగానే ఉందనీ, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లలో అనాసక్తి ఉందన్నారు. వచ్చే రబీ సీజనులో ఎల్ఈసీ కార్డులున్న కౌలు రైతులందరికీ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంతృప్తి చెందని ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి సమావేశంలో ఉన్న లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డిని వెంట తీసుకుని హాలు నుంచి బయటకు వెళ్లారు. వెంటనే ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకుల ఏజీఎంలను సమావేశానికి హాజరుకమ్మని ఆదేశించారు. ఎన్యూమరేషన్ సరిగ్గా లేదు అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి రైతుల జాబితాలను తయారు చేయడంలో అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయలేదని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావులు మంత్రి టీజీకి ఫిర్యాదు చేశారు. గురజాల నియోజకవర్గంలో మిరప పంటకు విపరీతంగా నష్టం జరిగినా ఎన్యూమరేషన్ సరిగ్గా జరగలేదన్నారు. బలుసుపాడు గ్రామంలో సిబ్బంది ఓ ఇంట్లో కూర్చుని గణాంకాలు తయారు చేశారని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే ముష్టి కోసం రైతులు ఎన్నాళ్లు ఎదురు చూడాలనన్నారు. వెంటనే మైకందుకున్న మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ రైతులకిచ్చే సాయాన్ని ముష్టి అనడం సబబు కాదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని అరటి రైతులకు లైలా తుపాను సాయాన్ని అందించే విషయంలో ఉద్యాన శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. సబ్సిడీ మంజూరు చేయించండి... జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.21 కోట్లను వెంటనే విడుదల చేయించాలని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య కోరారు. మంగళగిరి ఏరియాలో నిర్మించాలనుకున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే కాండ్రు కమల కోరారు. వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లే అవుట్లు ఎక్కువయ్యాయనీ అరికట్టకపోతే కష్టమని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పల్నాడులో రియల్టర్లు వ్యవసాయ భూముల్ని వ్యాపారానికి అనుగుణంగా మార్చి భూ బదలాయింపు పన్నును ఎగ్గొడుతున్నారని ఎంపీ మోదుగుల ఆరోపించారు. పిడుగురాళ్ల యార్డు ఎదుట అనధికార నిర్మాణం జరుగుతుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని ఫిర్యాదు చేశారు. పంచాయతీల్లో వీధిలైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మంత్రి దృష్టికి తెచ్చారు. అన్యాక్రాంతమవుతోన్న జెడ్పీ స్థలం .. సత్తెనపల్లిలోని రూ.50 కోట్ల విలువైన జిల్లాపరిషత్ స్థలం కబ్జాకు గురవుతోందని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి సమావేశంలో మంత్రి టీజీ వెంకటేశ్, కలెక్టర్ సురేశ్కుమార్లకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఏకధాటిన జరిగిన సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, ఎమ్మెల్యేలు గాదే వెంకటరెడ్డి, జీవీఎస్ఆర్ ఆంజనేయులు, మస్తాన్‌వలి, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, బొడ్డు నాగేశ్వరరావు, సింగం బసవపున్నయ్య వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం వస్తే అడ్డుకుంటాం సాక్షి, గుంటూరు : ‘జలయజ్ఞం’ కింద రాష్ట్రంలో మొట్టమొదట చేపట్టిన ప్రాజెక్టు పులిచింతల. తొమ్మిదేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. పను లన్నీ పూర్తయి ప్రారంభానికి వస్తే ఎవరినైనా సాదరంగా ఆహ్వానిస్తాం. కాదని డిసెంబర్ 5న జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరైతే కచ్చితంగా అడ్డుకుంటా’మని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాస్‌లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులన్నీ పూర్తయ్యాయని రైతాంగాన్ని మభ్యపెట్టి హడావుడిగా ప్రారంభించేసి చేతులు దులుపుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. పాజెక్టు నుంచి గుంటూరు జిల్లా వైపు అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం జిల్లా ప్రజలపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద ఇంకా 30 శాతం పనులన్నీ అలాగే ఉన్నాయని ఎంపీ మోదుగుల వివరించారు. వీటన్నింటినీ పూర్తి చే యకుండా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో హడావుడిగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. కనీసం ప్రాజెక్టును చూసేందుకు వెళ్లే జిల్లా వాసులకు అనుకూలంగా అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడం ఘోరమని సత్తెనపల్లి శాసనసభ్యుడు యర్రం వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ సురేశ్‌కుమార్ సమాధానమిస్తూ ప్రాజెక్టు పనులైతే ఇంకా పూర్తి కాలేదన్నారు. మేజర్ పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో 20 టీఎంసీల నీరు నిల్వచేసే అవకాశాలున్నాయని చెప్పేందుకు ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయమంటున్నారన్నారు. ముంపు గ్రామాల ప్రజలందరినీ 20 రోజుల్లోగా పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, టీడీపీ ఎమ్మెల్యేలు, సభ్యుల ఆవేదన ను అర్థం చేసుకున్నానన్నారు. ఈ విషయంలో సభ్యులతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వారం రోజుల్లోగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వివరిస్తానన్నారు. కాగా పులిచింతల విషయంపై టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు 20 నిమిషాల పాటు సమావేశంలో హడావుడి చేశారు. ఒక దశలో ఎంపీ మోదుగల వేణుగోపాలరెడ్డి అధికారపార్టీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.