
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ....‘చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేకపోయారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో కుమ్మక్కై పోలవరాన్ని ఆపేందుకు యత్నించింది నిజం కాదా?. పోలవరం కాల్వల తవ్వకంపై రైతులతో కోర్టుల్లో కేసులు వేయించింది వాస్తవం కాదా?. పోలవరంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీని ఎందుకు పొందలేకపోయారు. చంద్రబాబుపై కేంద్రానికి అనుమానాలు ఉండటం వల్లే ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు బంగారు గుడ్లు పెట్టే బాతులా చూస్తున్నారు. పోలవరం జాప్యానికి ముఖ్యమంత్రిదే బాధ్యత.’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment