తిరుపతి(చిత్తూరు): తిరుపతిలో శుక్రవారం జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని మంచాల వీధి, ఎంఆర్‌పల్లి పోలింగ్ బూత్‌ల్లో శుక్రవారం మధ్యాహ్నం ఎస్‌వీ యూనివర్సిటీ ఉద్యోగులు కొందరు దొంగ ఓట్లు వేసేందుకు రాగా కాంగ్రెసు ఎజెంట్ సుబ్రమణ్యం వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సదరు ఉద్యోగులను అక్కడి నుంచి తీసుకెళ్లి కొద్దిసేపటికి వదిలివేశారు. టీడీపీ అభ్యర్థి కుటంబ సభ్యుడు ఒకరు మంచాలవీధి, ఎంఆర్‌పల్లిలో పోలింగ్ బూత్‌లల్లో బయట నుంచి తీసుకువచ్చిన వారితో ఓట్లు వేయిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.