టీడీపీ సమైక్యవాద పార్టీనే: ఎర్రబెల్లి | tdp is basically for united state, says errabelli dayakara rao | Sakshi
Sakshi News home page

టీడీపీ సమైక్యవాద పార్టీనే: ఎర్రబెల్లి

Published Mon, Sep 30 2013 4:38 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

టీడీపీ  సమైక్యవాద పార్టీనే: ఎర్రబెల్లి - Sakshi

టీడీపీ సమైక్యవాద పార్టీనే: ఎర్రబెల్లి

కరీంనగర్: తెలుగుదేశం పార్టీ నిజంగానే సమైక్యవాద పార్టీ అని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఒకప్రక్క తెలంగాణ అంశం, సీమాంధ్రలో ఉద్యమ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీపై నాయకులు విమర్శల గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.  ఈసందర్భంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి టీడీపీ తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. టీడీపీ సమైక్యవాద పార్టీ అంటూనే,  ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు.

 

టీడీపీ యూ టర్న్ తీసుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్కు తెలుసునని ఎర్రబెల్లి దయాకరరావు గతంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ వైఖరి వల్లే తెలంగాణ బిల్లు ఆలస్యం అవుతుందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement