పల్లె కన్నీరుపెడుతోంది..కనిపింఛన్ కుట్రకు! | TDP leader Conspiracy in pension plan | Sakshi
Sakshi News home page

పల్లె కన్నీరుపెడుతోంది..కనిపింఛన్ కుట్రకు!

Published Thu, Sep 25 2014 1:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పల్లె కన్నీరుపెడుతోంది..కనిపింఛన్ కుట్రకు! - Sakshi

పల్లె కన్నీరుపెడుతోంది..కనిపింఛన్ కుట్రకు!

 ఈ ఫొటోలో వృత్తంలో కనిపిస్తున్న మహిళ బండారు దేవి పుట్టుకతో అంధురాలు. ఈమె సోదరి కుమారి కూడా అంధురాలే. వీరి తల్లి అన్నపూర్ణమ్మ వితంతువు. గంట్యాడ మండలం పెదవేమలికి గ్రామానికి చెందిన వీరి ముగ్గురికీ పింఛను వస్తోంది. వీరం తా ఒకే రేషన్‌కార్డులో నమోదై ఉన్నారని, ఒకే కుటుంబానికి చెందిన వారిని ఇటీవల జరిపిన పింఛన్ల పరిశీలనలో కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీలో ఒకరికి పింఛను ఇస్తామని, ఎవరికివ్వాలో తేల్చుకోవాలని ఆప్షన్ ఇచ్చారు. చివరికీ దేవీకి పింఛను వర్తింపజేస్తామని, మిగతా ఇద్దరికీ తొలగిస్తామని తెగేసి చెప్పేశారు. దీంతో ఎలా బత కాలో తెలియక వారు బెంగపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒకే ఇంటిలో ఇద్దరు వృద్ధులున్నా, ఒక ఇంటిలో ఒక వృద్ధుడు, ఒక వికలాంగుడు ఉన్నా, ఒక వృద్ధురాలు, ఒక వితంతువు ఉన్నా...వారిలో ఒకరికే పింఛను అని, ఇంకొకరికి తొలగించేస్తున్నారు. ఇక 10 ఏళ్లు, 15 ఏళ్ల కిందట భర్త చనిపోయి వితంతువులైన వారిని ఇప్పుడు తమ  భర్తల డెత్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు. అవి లేవన్న సాకుతో పింఛను తొలగించేస్తున్నారు. ఈ వయస్సులో ఎక్కడికెళ్లి డెత్ సర్టిఫికెట్‌లు తీసుకురాగలమని వృద్ధ మహిళలు దీనంగా అడుగుతున్నారు.  జిల్లాలో ఏ గ్రామానికెళ్లినా కనిపించే దృశ్యాలివే.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : కనిపించని కుట్రకు బలైపోతున్న తన బిడ్డలను చూసి ఇప్పుడు పల్లె తల్లి కన్నీళ్లు పెడుతోంది. అయితే, తొలగింపు  సూత్రం అందరికీ వర్తిస్తుందా అంటే అదీ లేదు. టీడీపీ నేతల ఆశీస్సులున్నోళ్లను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉన్న వారిని కక్ష గట్టి తీసేస్తున్నారు. అడిగితే సమాధానం ఇచ్చే నాథుడు కన్పిం చడం లేదు. తాము తలచినట్టే అవుతుందంటూ కొన్నిచోట్ల  నిర్లక్ష్యంగా చెబుతున్నారు. బుధవారం సాయంత్రంతో పింఛన్ల పరిశీలనా కార్యక్రమం జిల్లాలో ముగిసిపోయింది. ప్రస్తుతం ఉన్న 2.79 లక్షల పింఛన్లను పరిశీలించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పూర్తిగా జరగలేదని విమర్శలొస్తున్నాయి. టీడీపీ నేతల ఇళ్లల్లోనే పరిశీలన చేసేసి తంతు ముగించేశారన్న ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని గ్రామాల్లో, మున్సిపాల్టీల్లోని పలు వార్డులలో తమ వద్దకు పరిశీలనకు రాలేదని పలువురు పింఛనుదారులు గగ్గోలు పెడుతున్నారు. పింఛన్ల పరిశీలన దాదాపు ఏకపక్షంగా సాగిపోయిందన్న విమర్శలొస్తున్నాయి. టీడీపీ వాళ్లకైతే ఒక రూల్...మిగతా పార్టీ వాళ్లకైతే ఇంకో రూల్ అన్న తరహాలో పరిశీలన సాగింది.
 
 దాదాపు ప్రతీ గ్రామంలో తమను అన్యాయంగా జాబితాలోంచి తీసేశారన్న ఆవేదన వెల్లగగ్గుతున్నారు.  ఇప్పుడు వీరందరికీ ఉన్న ఆధారం మండల కమిటీలను ఆశ్రయించడమే. మానవత్వం లేకుండా, పరిస్థితులను గమనించకుండా తీసేశారని తగిన ఆధారాలతో మొర పెట్టుకోవాలి. అయితే, అక్కడా న్యాయం జరుగుతుందనుకుంటే పొరపాటే. ఆ కమిటీల్లో కూడా నామినేటెడ్ సభ్యులంతా టీడీపీ వారే కావడంతో కింది కమిటీ సభ్యులు చేసిన సిఫారుసులనే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆశ్రయించిన వారి వాదన సరైనదని, అన్యాయం జరిగిందని  మండల స్థాయి అధికారులు గుర్తించితే తప్ప న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే ఏరివేతే లక్ష్యంగా,  తమను కాని వారిని వేధించడమే ఎత్తుగడగా భావించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇదే తరహాలో నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచించి ఉంటే ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న టీడీపీ వారికి వచ్చేవా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కోణంలో చూడకుండా మానవత్వంతో ఆలోచించాలని, అభాగ్యులైన తమలాంటి వారికి అన్యాయం చేయడం సరికాదని పండుటాకులు, వికలాంగులు కోరుతున్నారు.
 
 అప్‌లోడింగ్ పనిలో అధికారులు
 బుధవారం సాయంత్రం పింఛన్లు పరిశీలనా కార్యక్రమం ముగియడంతో అర్హులు, అనర్హుల పేర్లను అప్‌లోడ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎవరెవర్ని ఏ కారణం చేత తొలగిస్తున్నామో తెలియజేస్తూ వివరాలను క్రోడీకరిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే సరికి 25వేల పింఛన్లకు సంబంధించిన వివరాలు అప్‌లోడ్ చేశారు. ఈ అప్‌లోడ్ జాబితాను పరిశీలించి మండల కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement