టీడీపీ శ్రేణుల అరాచకాలు | TDP leaders attack YSRCP workers in ankanna gudem | Sakshi
Sakshi News home page

టీడీపీ శ్రేణుల అరాచకాలు

Published Wed, Jul 9 2014 1:19 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

టీడీపీ శ్రేణుల అరాచకాలు - Sakshi

టీడీపీ శ్రేణుల అరాచకాలు

      టీడీపీ శ్రేణుల అరాచకాలతో
     బిక్కుబిక్కుమంటున్న వైసీపీ మద్దతుదారులు
    కొందర్ని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు
    ఊరు విడిచివెళ్లిన మరికొందరు
    భయంతో అల్లాడుతున్న మహిళలు
    ఇంటిపెద్దలు ఏమయ్యారో తెలియక ఆందోళన
    ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో
    అట్టుడుకుతున్న అంకన్నగూడెం


సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికార తెలుగుదేశం పార్టీ గూండాల దౌర్జన్యకాండ.. అడ్డూఅదుపులేని అరాచక పర్వానికి పెదవేగి మండలంలోని అంకన్నగూడెం వణికిపోతోంది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. గ్రామంలో ఆరు పోలీస్ పికెట్‌లు కొనసాగుతున్నా ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

అసలేం జరిగిందంటే...
జూన్ 30న ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఒంటరిగా బైక్‌పై వస్తున్న గ్రామ సర్పంచ్, టీడీపీ నాయకుడు చిదిరాల సతీష్ ఊరి పొలిమేర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే, అతనిపై హత్యాయత్నం జరిగిందంటూ సోమవారం వేకువజామునుంచే పచ్చచొక్కాలు ఊరిపై తెగబడ్డాయి. గొడ్డళ్లు, బరిసెలు, మారణాయుధాలతో స్వైరవిహారం చేశాయి. 200మందికిపైగా ఊళ్లో తిరుగుతూ కనబడిన వారినల్లా బాదేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీటీసీ మొరవినేని భాస్కరరావు ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆయనపై మారణాయుధాలతో దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి విధ్వంసకాండకు పాల్పడ్డారు. టీవీ, ఫర్నిచర్, మంచం, వంట సామగ్రి, బీరువా.. ఇలా కనబడిన ప్రతి వస్తువునూ ధ్వంసం చేశారు. ఇంటిబయట ఉన్న జీపును ధ్వంసం చేశారు. బైక్‌ను పక్కనున్న దిగుడు బావిలో పడేశారు. దీనిని చూసి ఇంటి సమీపంలోనే ఉన్న భాస్కరరావు సోదరుడు గోపాలరావు రాగా, ఆయనపైనా విచక్షణారహితంగా దాడికి దిగారు.

తం డ్రిపై జరుగుతున్న దాడిని చూసి ఆయన కుమార్తె కన్నీళ్లపర్యంతమైనా వెనక్కి తగ్గలేదు. సమీపంలో ఉంటున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త సూర్యచంద్రరావు (సూరిబాబు) ఇంటిపైనా దాడికి తెగబడ్డారు. కంప్యూటర్, టీవీ సహా ఇంట్లోని వస్తువులన్నిటినీ  ధ్వంసం చేశారు. ఇంటిబయ ట పార్క్‌చేసి ఉంచిన బైక్‌ను విసిరిపడేశారు. ఓ దశలో ఇంటికి నిప్పుపెట్టేందుకూ యత్నించారు. అడ్డొచ్చిన మహిళలతో ‘మీ తాళి బొట్లు తెంచేస్తాం.. మీ మొగుళ్లను చంపేస్తాం’ అంటూ కత్తులతో బెదిరించారు. సూరిబాబు సహా కొంతమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఊరివిడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలా గ్రామం మొత్తం అల్లకల్లోలమై.. మూడుగంటల పాటు అడ్డూ అదుపులేకుండా టీడీపీ శ్రేణులు దౌర్జన్యకాండ సాగింది. తర్వాత పోలీ సులు రంగప్రవేశం చేశారు. భాస్కరరావు, గోపాలరావు, సూర్యప్రకాశరావు, శేఖర్‌సహా వైఎస్సార్ సీపీకి చెందిన పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులో ఉన్నవారు ఎక్కడ?
భాస్కరరావు, గోపాలరావు సహా దాదాపు 10మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు వారిని అరెస్ట్ చూపించలేదు. తొమ్మిది రోజులవుతున్నా కనీసం వారు ఎక్కడున్నదీ తెలియడం లేదు. భార్యాబిడ్డలు రూర ల్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్తే.. ఇక్కడ కాదు సర్కిల్ స్టేషన్‌లో ఉన్నారని.. అక్కడి వెళ్తే ఏలూరు డీఎస్పీ వద్ద విచారణలో ఉన్నారని చెబుతున్నారే తప్ప ఎన్నిసార్లు తిరిగినా వారి జాడ మాత్రం తెలియడం లేదు.  ‘మా వారు హార్ట్, షుగర్ పేషెంట్.. రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియక తొమ్మిది రోజులవుతోంది. మేం వైఎస్సార్‌సీపీ అభిమానులం. ఎవరితో ఘర్షణల్లేవు. కేవలం మాపై పగతోనే ఇలా చేస్తున్నారు’ అని గోపాల రావు సతీమణి సుజాత మంగళవారం ఆ ఊరికి వెళ్లిన ‘సాక్షి ప్రతినిధి’ ఎదుట కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఏమో ఎక్కడున్నారో : డీఎస్పీ
‘అంకన్నగూడెం ఘటనకు సంబంధించి ఎవరూ మా అదుపులో లేరు’ అని డీఎస్పీ సత్తిబాబు చెబుతున్నారు. హత్యాయత్నం కేసు కింద ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, రెండు, మూడురోజుల్లో అన్ని విషయాలు వెలుగుచూస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.  ‘ఘటన జరిగిన రోజు వారిని అదుపులోకి తీసుకున్నది మీరేకదా.. ఇప్పుడు ఏం తెలియదంటే ఎలా’ అని ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నించగా.. ‘ఇప్పుడేమీ చెప్పలేను. త్వరలోనే అన్నీ తెలుస్తాయి’ అని సమాధానమిచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడుల కేసులు ఏమయ్యాయని ప్రశ్నిం చినా, ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా వచ్చింది.కేసు తారుమారుటీడీపీ నేత, సర్పంచ్ రాజేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యారని తొలుత కేసు నమోదు చేసిన పోలీ సులు దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఒత్తిళ్లతోనే కేసును తారుమారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయే తప్ప ఆయనపై దాడి చేసిన పరిస్థితి కానరావడం లేదని గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులూచెబుతున్నారు.

శవాల్లా బతుకుతున్నాం
‘సర్పంచ్ రాజేష్ రోడ్డు ప్రమాదానికి గురికావడమేమిటో. టీడీపీ గూండాలు మాపై దాడులకు పాల్పడటమేమిటో అర్థం కావడం లేద’ని గ్రామంలోని మహిళలు ‘సాక్షి ప్రతినిధి’ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ‘సర్పంచ్  మా బంధువే. ఆయనేం శత్రువు కాదు.. 20రోజులుగా కామె ర్లతో బాధపడుతున్న ఆయన మద్యం మత్తులో బైక్ డ్రైవ్ చేస్తూ కిందపడ్డాడని చెబుతున్నారు. మేం ఆయన పొరుగింటిలోనే ఉంటున్నాం. ఆరోజు మద్యం మత్తులో కింద పడ్డాడని ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు చికిత్స పేరిట హడావుడి చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తెల్లారేసరికి భాస్కరరావు, సూరిబాబు ఇళ్లపై వందలాది మందితో దాడులు చేయిం చారు. నిజంగానే భాస్కరరావు హత్యాయత్నం చేయించి ఉంటే ఆరోజు ఊళ్లో ఎందుకుంటారు. ఉన్నా ఒంటరిగా ఎందుకుంటారు. ఎంతోకొంత ముందుజాగ్రత్త చర్యలతో ఉంటారు. మరి అవేమీ లేకుండా పొద్దునే ఇంటి ముందు కూర్చున్నారంటే దాడుల వెనుక ఆయన ప్రమేయం ఏమీ లేదని ఎవరికైనా అర్థమవుతుంది’ అని మహిళలు చెప్పుకొచ్చారు.

రాజేష్ ఏమైనట్టు
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన రాజేష్ ఇప్పుడు ఎక్కడున్నది ఎవరికీ తెలియడం లేదు. తొలుత ఆశ్రం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించామన్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చినట్టు రాజేష్ సతీమణి ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. కానీ, రాజేష్ లాంటి వారెవరూ చేరినట్టు రికార్డుల్లో లేవని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇది చింతమనేని పనే : కారుమూరి
‘సర్పంచ్ రాజేష్ ప్రమాద ఘటనను పావుగా చేసుకుని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అల్లరిమూకలతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడు లు చేయించారు. ప్రశాంతమైన జిల్లాలో ఈ తరహా దాడులు నేనింతవరకు చూడలేదు. ఎక్కడో బీహార్‌లో జరుగుతాయని విన్నాం. కానీ విప్ పదవితో పేట్రేగిపోతున్న చింతమనేని అండతో అలాంటి దృశ్యాలు ఇక్కడ చూస్తున్నాం. పోలీసులు  చింతమనేని ఒత్తిళ్లకు తలొగ్గి కేసును తారుమారు చేస్తున్నారు. అదుపులో ఉన్న మా కార్యకర్తలను టార్చర్ పెడుతున్నారు. తెల్లకాగితాలపై సంతకం పెట్టమని డీఎస్పీ ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాళ్లేం పాపం చేశా రు. ఏమైనా తప్పుంటే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చూపించాలే గానీ ఇదెక్కడి ఘోరం. వెంటనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను విడుదల చేయాలి.. లేదంటే ప్రజాందోళనకు par సిద్ధమవుతాం’ఙ- కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement