రాష్ట్రంలో హెచ్చుమీరిన అవినీతి | tdp leaders corruption in high | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో హెచ్చుమీరిన అవినీతి

Published Thu, Mar 3 2016 3:31 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

రాష్ట్రంలో హెచ్చుమీరిన అవినీతి - Sakshi

రాష్ట్రంలో హెచ్చుమీరిన అవినీతి

వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజం

కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. అధికారపార్టీ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఎదుట నిలువెత్తు ధనరాశులు పోసి బేరమాడుతుండటం దారుణమన్నారు. టీడీపీ నాయకులు ప్రజాధనం లూటీ చేసి ప్రలోభాలకు దిగారన్నారు.  పాలకులే భూ రాబంధుల అవతారమెత్తి రాజధాని ప్రాంతంలో 25 వేల ఎకరాల  భూములను బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.  దళిత రైతులను భయపెట్టి అసైన్డ్ భూములను దోచుకున్నారని చెప్పారు.  టీడీపీలో ఎమ్మెల్యేల చేరికలు  చంద్రబాబు మీద ప్రేమతో గానీ, వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్ మీద వ్యతిరేకతతో గానీ జరగడం లేదన్నారు. డబ్బుల సంచుల అందడమే కారణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement