వైఎస్ జగన్ ప్రసంగానికి 14సార్లు అంతరాయం!
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్ ప్రసంగానికి అధికారపక్ష మంత్రులు, సభ్యులు 14 సార్లు అంతరాయం కలిగించారు. కేటాయించిన సమయం కంటే ఎక్కువ సమయాన్ని వాడుకున్నారని, తాము పదేపదే చెప్పినా ప్రసంగాన్ని ముగించకపోవడం మీదే తప్పని స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం కూడా ఒకసారి ప్రస్తావించారు. కానీ, వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఏకంగా 52 నిమిషాల పాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనకు పదే పదే అడ్డు తగులుతూ వచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి మధ్యాహ్నం ఆయన ప్రసంగాన్ని అర్ధంతరంగా ఆపేసేవరకు ప్రతిసారీ అడ్డం పడుతూనే ఉన్నారు. ఆ వివరాలు ఇవీ..
యనమల రామకృష్ణుడు ప్రారంభంలోనే 8 నిమిషాలపాటు, కె.అచ్చెన్నాయుడు 11.38గంటలకు 6 నిమిషాలు, మళ్లీ యనమల 11.50కి 3 నిమిషాలు, కాలువ శ్రీనివాసులు 12.10కి 4 నిమిషాలు, డి.నరేంద్రకుమార్ 12.05 సమయంలో 4 నిమిషాలు, కె.ఇ.కృష్ణమూర్తి 12.20 గంటలకు 3 నిమిషాలు, డి.నరేంద్రకుమార్ 12.25 సమయంలో 4 నిమిషాలు, యనమల మళ్లీ 12.31 గంటలకు 2 నిమిషాలు, పి.పుల్లారావు 12.38 సమయంలో 3 నిమిషాలు, రావెల కిశోర్‌బాబు 12.49 గంటలకు 5 నిమిషాలు, కె.కళావెంకట్రావు 12.59 సమయంలో 2 నిమిషాలు, కె.అచ్చెన్నాయుడు ఒంటిగంటకు 3 నిమిషాలు, దేవినేని ఉమా మహేశ్వరరావు 1.13 గంటలకు 3 నిమిషాలు, యనమల 1.16 సమయంలో 2 నిమిషాలు.. ఇలా మొత్తం 52 నిమిషాలు అడ్డం తగిలారు.