కావలి : స్వచ్ఛభారత్ నినాదంతో దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అందుకు కేంద్రం సహాయం చేస్తుందని విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే ప్రధాని లక్ష్యానికి తెలుగు తమ్ముళ్లు తూట్లు పొడుస్తూ తమకు జైకొట్టిన వారు, తమ అనుచరులకే స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్లను మంజూరు చేయిస్తున్న పరిస్థితి కావలి మున్సిపాలిటీలో నెలకొంది.
వాటి ఎంపిక బాధ్యత మెప్మా, మున్సిపల్ అధికారులపై ఉండగా వారు తెలుగుతమ్ముళ్లు అనుగ్రహించిన వారికే మరుగుదొడ్లను కేటాయించారు. పట్టణంలోని 25వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నెల్లూరు సీతారామమ్మ మరుగుదొడ్లు లేని 132 మంది దరఖాస్తులు జన్మభూమిలో ఇచ్చారు. వాటిని అన్‌లైన్‌లో కూడా పెట్టారు. ఆధార్ కార్డు నెంబర్‌లను కూడా తీసుకున్నారు.
తీరా చూస్తే ఆ వార్డులో ఒక్క మరుగుదొడ్డి కూడా మంజూరు కాలేదు. 21, 38 వవార్డుల్లో కూడా ఇదే పరిస్థితి ఆయావార్డుల కౌన్సిలర్లు శ్రీలత, మాల్యాద్రిలు పేర్కొంటున్నారు. పట్టణంలో సుమారు మూడు వేలకు పైగా మరుగుదొడ్లు మంజూరైతే సగభాగం ఉన్న వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్ల వార్డులకు కేటాయింపులు చేయకుండా తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఇంత అన్యాయమా
25వ వార్డులో 130 మంది వరకు మరుగుదొడ్లకు దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా మంజూరు చేయకపోవడం అన్యాయం.
- నెల్లూరు సీతారామమ్మ,25వ వార్డు కౌన్సిలర్.
ప్రధాని నినాదానికి తూట్లు పొడుస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ నినాదానికి తెలుగు తమ్ముళ్లు తూట్లు పొడుస్తున్నారు. వారి ఇష్టానుసారం మరుగుదొడ్లు మంజూరు చేయడం సరికాదు.
- కేతిరెడ్డి శ్రీలత, 21వ వార్డు కౌన్సిలర్
స్వచ్ఛభారత్‌కు ‘తమ్ముళ్ల’ తూట్లు
Published Wed, May 13 2015 4:34 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement