
బాబును టీడీపీ ఎమ్మెల్యేలే నిలదీయాలి: అంబటి
స్పష్టమైన వైఖరి లేకుండా ఏ పార్టీ నడుచుకున్నా, అణగతొక్కాల్సిన బాధ్యత ఉద్యోగులు, ప్రజలదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సమైక్యవాదానికే చంద్రబాబు కట్టుబడి ఉండాలని నిలదీయాల్సిన బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేలదేనని ఆయన అన్నారు. ఆత్మగౌరవ యాత్ర చేసే నైతిక హక్కు, సీమాంధ్ర గడ్డపై కాలుమోపే హక్కు చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు.
ఆత్మగౌరవం అంటే ఏంటో చంద్రబాబుకు తెలియదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరులో అన్నారు. ఆత్మగౌరవ పేరుతో చంద్రబాబు యాత్ర చేయాలనుకోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల బస్సుయాత్ర మరో మైలురాయిగా నిలుస్తుందని మేకపాటి అన్నారు.