త్వరలో ప్రజారంజక పాలన
దుత్తలూరు : ఎన్నికల తర్వాత జగన్ నాయకత్వంలో ప్రజారంజక పాలన వస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక బీసీకాలనీ సమీపంలోని వైఎస్సార్సీపీ కార్యాలయ ఆవరణలో శనివారం పార్టీ మండల కన్వీనర్ చేజర్ల భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహానేత వైఎస్సార్ ప్రజలకు మేలు చేసే ఎన్నో పథకాలను దిగ్విజయంగా అమలు చేయడం వల్లే ఇప్పటికీ ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. అలాంటి నాయకత్వ లక్షణా లు ప్రస్తుతం ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉన్నాయని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు కారకుడు చంద్రబాబేనన్నారు. బాబు రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇస్తే కాంగ్రెస్ నిరంకుశంగా విభజించిందన్నారు. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే సమైక్యవాదానికి కట్టుబడి చివరి వరకు పోరాడిందన్నారు. తెలంగాణలో కూడా వైఎస్సార్సీపీ అధిక సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు గెలవడం ఖాయమన్నారు.
సర్వేలు కూడా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెబుతున్నాయన్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పించిన జిల్లా మంత్రి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదన్నారు. పైగా తాను తెచ్చిన నిధులతో ఆనం తనతో పాటు అనుచరుల పేర్లు శిలాఫలకాలపై వేసుకుని ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ప్రొటోకాల్ పాటించడం లేదని దుయ్యబట్టారు. ఒక్క మేకపాటి సోదరుల హయాంలోనే నియోజక వర్గ అభివృద్ధి జరిగిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. కార్యక్రమంలో సర్పం చ్‌లు లెక్కల పెదమాలకొండారెడ్డి, వడ్లపల్లి పెంచిలమ్మ, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ టీవీఎస్ రాజా, నాయకులు సూరె రమణారెడ్డి, వాశిపల్లి వెంకటేశ్వరరెడ్డి, తుమ్మల వెంగయ్యచౌదరి, బొగ్యం సుబ్బయ్య, వైస్ సర్పంచ్ మౌలాలి, రవీంద్ర, మాల్యాద్రి, వాయల బాలయ్య, ఉప్పలపాటి రమణారెడ్డి, చెంచురెడ్డి, బాలవెంగళరెడ్డి, నెలకుర్తి రమణయ్య, రంగయ్యనాయుడు, గున్నం కృష్ణారెడ్డి, మహలక్ష్మయ్య పాల్గొన్నారు.
అనిత కుటుంబాన్ని
పరామర్శించిన ఎమ్మెల్యే
కొండాపురం : జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బండ్లమూడి అనిత కుటుంబాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం నెల్లూరులో పరామర్శించారు. ఇటీవల అనిత తండ్రి కందుల దేవదానం అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా అనిత, ఆమె భర్త బండ్లమూడి మాల్యాద్రిని ఎమ్మెల్యే పరామర్శించారు. ‘న్యూస్‌లైన్’తో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అనిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.