విజయనగరం(పార్వతీపురం): విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం టీడీపీ సొంత వ్యవహారంగా మారింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు, గిరిజన నేతలు ఒక్కరు కూడా లేకుండానే సమావేశం ప్రారంభమైంది. అయితే సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమను అనుమతించాలని కోరడంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం వైఎస్ఆర్ సీపీ నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.