విచారణకు వచ్చిన ఎంఈవోను చితకబాదారు | teacher accused of harassing students in ysr district | Sakshi
Sakshi News home page

విచారణకు వచ్చిన ఎంఈవోను చితకబాదారు

Published Sat, Jul 19 2014 10:28 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

teacher accused of harassing students in ysr district

కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం బోయనపల్లి గ్రామంలో లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక టీచర్పై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు శనివారం పాఠశాలను ముట్టడించారు. విచారణకు వచ్చిన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) కృష్ణకుమార్ను చితకబాదారు. కాగా వివరాల్లోకి వెళితే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. లెక్కల టీచర్ అర్తర్ అనునిత్యం వికృత చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థినులు మదనపడేవారు.

 ఓ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో వ్యవహారం బయటకు పొక్కింది. దాంతో గ్రామస్తులు కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు సర్థిచెప్పారు. టీచర్ ను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. గత రెండు సంవత్సరాల నుంచి స్కూల్ లో చదువుతున్న బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అతనిపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement