ఎచ్చెర్ల క్యాంపస్: ఎన్నో అంతరాయాలు..వివాదాల నడుమ ఎట్టకేలకు ఎంసెట్-2014 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్(సహాయ కేంద్రాన్ని) ప్రకటించారు. గురువారం నుంచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలన ప్రారంభం కానుంది. తొలి రోజున 1 నుంచి 5 వేల ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది.
విద్యార్థులకు ఊరట
ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకే కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించడంతో..విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం యూనిట్‌గానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈనెల 23 నాటికి పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది.
అంతా సజావుగా సాగితే..ఒకటి నుంచి తరగతులు సైతం ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మరో సమస్య కూడా తోడవుతోంది. పాలీసెట్, ఈసెట్-2014 ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయి..నెలలు గడుస్తున్నా..ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికతపై స్పష్టత లేకపోవడంతో..అలాట్ మెంట్లు ప్రకటించలేదు. ఈ కోర్సుకు సంబంధించి.. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారం భం కావాల్సి ఉన్నా..ఇంకా పరిష్కారం కావడం లేదు.
ఎం‘సెట్’ అయ్యింది..!
Published Thu, Aug 7 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement