పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి
Published Sun, Sep 8 2013 11:52 PM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట ఏపీటీఎఫ్ భవన్‌లో పరమేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తెలంగాణ వనరులను దోచుకునేందుకే సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారన్నారు.
శనివారం జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సందర్భంగా తెలంగాణ పోలీసులపై, విద్యార్థులపై సీమాంధ్ర పోలీసులు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారన్నారు. సభలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన కానిస్టేబుల్ కోహెడ శ్రీనివాస్‌గౌడ్‌ను అభినందిస్తున్నామన్నారు. అనంతరం తొగుట మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పరమేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ఎండీ.సలీం, అనిత, ప్రధాన కార్యదర్శిగా విష్ణు, కార్యదర్శులుగా రవీంద్రచారి, రషీద్, రాజు, ఆర్.సుజాత, జిల్లా కౌన్సిలర్లుగా కృష్ణమోహన్, భైరవరెడ్డి, జి.సుధాకర్‌రెడ్డి, ఆర్.నరహరి, రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Advertisement
Advertisement