తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆటో ర్యాలీ
Published Wed, Sep 4 2013 3:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
పాల్వంచ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ టాటా ఏస్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత బస్టాండ్ సెంటర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆటో ర్యాలీని టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్ ప్రారంభించారు. బస్టాండ్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్, దమ్మపేట సెంటర్, నటరాజ్ సెంటర్ వ రకు ఈ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంతపురి రాజుగౌడ్ మాట్లాడుతూ తె లంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటాలు నిర్వహించి, ఎందరో తమ ప్రాణాలను అర్పించారని, ఈ సమయంలో సమైఖ్యాంధ్రలోని పెట్టుబడిదారీ వర్గం మరో ఉద్యమాలకు తెర తీయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టాటా ఏస్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్‌కె.ఖాసీం, కార్యదర్శి గజ్జెలి శ్రీను, ఉపాధ్యక్షులు అల్లూరి వెంకటేశ్వర్లు, వజీర్ ఖాన్, టీఆర్‌ఎస్ నాయకులు చీకటి కార్తీక్, శ్రీను, జాని, మోహ న్‌రావు గౌడ్, కుదురుపాక వెంకటేశ్వర్లు, రవి, బాబురావు, గుడిమెట్ల నారాయణ, బుడగం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement