వెంటనే పార్లమెంట్‌లో ‘బిల్లు’ పెట్టాలి | parliament bill have must to forward | Sakshi
Sakshi News home page

వెంటనే పార్లమెంట్‌లో ‘బిల్లు’ పెట్టాలి

Published Mon, Sep 16 2013 4:16 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

parliament bill have must to forward

భీమ్‌గల్, న్యూస్‌లైన్: హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు బిల్లును తక్షణమే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని అఖిల భారత రైతుకూలీ సంఘం(చంద్రన్న వర్గం) జిల్లా జనరల్ కౌన్సిల్‌లో తీర్మానించింది. మండలకేంద్రంలో ఆదివారం సమావేశ అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజామొయీనుద్దీన్ తీర్మానాలను ప్రకటించారు. తెలంగాణ ప్రజల కల నెరవేరుతున్న సమయంలో సీమాంధ్రులు అడ్డుపడటం దారుణమన్నారు.
 
 సీడబ్యూసీలో తీర్మానం చేసినప్పటికీ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టకుండా జాప్యం చేయడం వల్లే సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం పుట్టిందన్నారు. ప్రజల మధ్యన ఐక్యతను కాపాడాలని, హైదరాబాద్ రాజధానికిగా రాష్ట్ర ఏర్పాటు చేయాలని, అన్ని రకాల పంటలకు గిట్టుబాటు కల్పించాలని, వ్యవసాయరంగానికి సమగ్ర చట్టం చేయాలంటూ పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో నాయకులు జిల్కర నడ్పి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement