టీఆర్ఎస్తో పొత్తు.. టీ కాంగ్రెస్లో చీలిక
మాజీమంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఇందులో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రధానంగా, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ సమావేశంలో చర్చించారు. అయితే టీఆర్ఎస్తో పొత్తు విషయమై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
టీఆర్ఎస్తో పొత్తు అవసరం లేదని దక్షిణ తెలంగాణ ప్రాంత నాయకులు అంటుంటే.. మరోవైపు ఉత్తర తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం పొత్తు ఉంటేనే నయమని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున టీఆర్ఎస్తో పొత్తు అవసరమని మాజీ మంత్రులు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సమావేశంలో ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు.